తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ (KCR)..కొద్దీ రోజుల క్రితం తన ఫాం హౌస్ లో కాలు జారి పడిపోయిన సంగతి విదితమే. అనంతరం ఆయనకు యశోదా ఆస్పత్రిలో కాలికి సర్జరీ చేశారు. వారం రోజుల పాటు హాస్పటల్ లో చికిత్స తీసుకున్న కేసీఆర్.. అనంతరం నందినగర్ లోని తన సొంత ఇంటికి తీసుకెళ్లారు. కొద్దీ రోజులు అక్కడే ఉన్న కేసీఆర్..ప్రస్తుతం ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ కు చేరుకున్నారు. ఫామ్ హౌస్ లో వైద్యుల పర్యవేక్షణలో కేసిఆర్ చికిత్స తీసుకుంటున్నారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులు, సహాయకులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ప్రస్తుతం కేసీఆర్ ఊత కర్ర సాయంతో నడుస్తున్నారు. అయితే, సర్జరీ నాటి నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితిపై బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆరా తీస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఫామ్ హౌస్ లో కెసిఆర్ నడుస్తున్న వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫాం X లో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది.
ఇదిలా ఉంటె తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన కేసీఆర్…రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించి సత్తా చాటాలని చూస్తున్నారు. ఇప్పటికే ఆ బాధ్యతలు కేటీఆర్ , హరీష్ రావు లకు అప్పగించారు. దీంతో వారు వరుసగా నియోజకవర్గ నేతలతో సమావేశం అవుతూ..ఎన్నికల్లో విజయం సాధించేలా వారికీ ఐడియాస్ ఇస్తూ…ఉత్సాహం నింపుతున్నారు.
తుంటి ఎముక సర్జరీ అనంతరం కోలుకుంటూ ఊత కర్ర సాయంతో నడుస్తున్న కేసీఆర్. pic.twitter.com/9tP8hAq7Jg
— Telugu Scribe (@TeluguScribe) January 17, 2024
Read Also : NTR Death Anniversary : ఎన్టీఆర్‍కు నివాళులు అర్పించిన జూ. ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్