కత్తిపోటుకు గురైన దుబ్బాక బిఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిని సీఎం కేసీఆర్ పరామర్శించారు. సోమవారం మధ్యాహ్నంకొత్త ప్రభాకర్ రెడ్డి (Kotha Prabhakar Reddy) ఫై హత్యాయత్నం చోటుచేసుకుంది. ప్రస్తుతం ప్రభాకర్ రెడ్డి దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి బరిలో ఉన్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో ప్రచారాన్ని జోరుగా చేస్తున్నారు. ఈ క్రమంలో దౌల్లాబాద్ మండలం సూరంపల్లిలో ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న ప్రభాకర్ రెడ్డిపై ఓ గుర్తు తెలియని వ్యక్తి (Unknown Person Attack) కత్తి (Knife)తో దాడి చేశాడు. దీంతో ప్రభాకర్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. కడుపులో కత్తితో పొడవడం తో తీవ్ర రక్తప్రసావం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే కార్యకర్తలు ఆయన్ను గజ్వేల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాధమిక చికిత్స చేసి..మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ యశోద హాస్పటల్ కు తరలించారు.
We’re now on WhatsApp. Click to Join.
ప్రస్తుతం యశోద లో ప్రభాకర్ రెడ్డి చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ (CM KCR) సోమవారం రాత్రి ప్రభాకర్ ను పరామర్శించారు. యశోదా ఆసుపత్రికి వెళ్లిన సీఎం కేసీఆర్.. ప్రభాకర్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిపై తీశారు. ఆందోళన చెందవద్దని ప్రభుత్వం, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రభాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఎప్పటికప్పుడు ప్రభాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించాలని అక్కడే ఉన్న వైద్య ఆరోగ్య, ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావును సీఎం ఆదేశించారు. కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం సంఘటన దురదృష్టకరమని కేసీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సంఘటన పై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి తగు చర్యలు తీసుకుంటామని సీఎం పేరొన్నారు.
Read Also : Chandrababu : చంద్రబాబును వదలని సీఐడీ..మరోకేసు నమోదు