Site icon HashtagU Telugu

BJP vs TRS : అది కేసీఆర్‌కి కొత్తేమి కాదంటున్న బీజేపీ..!

Kcr Bjp

Kcr Bjp

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ నిన్న మీడియా స‌మావేశంలో ప్ర‌ధాని మోడీ, బీజేపీ పై విరుచుకుప‌డ్డారు. అయితే కేసీఆర్‌కి అదేస్థాయిలో బీజేపీ జాతీయ నేత‌లు కౌంట‌ర్ ఇచ్చారు.

మోడీ, బీజేపీ పై చేసిన వ్యాఖ్య‌ల‌ను బీజేపీ జాతీయ నేత‌లు ఖండిచారు. తెలంగాణ సీఎం కేసీఆర్ గ‌త ఎనిమిదేళ్లుగా ప్ర‌ధాని మోడీపై, బీజేపీ నేత‌ల‌పై అస‌భ్యప‌ద‌జాలం ఉప‌యోగించ‌డం ఆయ‌న‌కు అల‌వాటైంద‌న్నారు. ప్రపంచంలోని అగ్రస్థానంలో భారతదేశ ఉంద‌ని బిజెపి జాతీయ కార్యదర్శి తరుణ్ చుగ్ అన్నారు. ముందస్తు ఎన్నికలపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ సవాల్‌ను స్వీకరించింది.

తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసి ఎన్నిక‌ల‌కు రావాల‌ని బీజేపీ నేత‌లు డిమాండ్ చేశారు.15 రోజుల్లో ఎన్నికలు జరిగినా బీజేపీ ఎప్పుడైనా సిద్ధంగా ఉందన్నారు. తెలంగాణ ప్రజలు డబుల్ ఇంజన్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని, జులై 3న మోడీ బహిరంగ సభకు భారీ స్పందన రావడంతో కేసీఆర్ ఉలిక్కిప‌డ్డార‌ని బీజేపీ పేర్కొంది. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై నియంత్రణ లేని అవినీతి రాజవంశ ప్రభుత్వం నుండి ప్రజలు విముక్తిని కోరుకుంటున్నారని.. అక్కడ పోలీసులపైనే అఘాయిత్యాల ఆరోపణలు ఉన్నాయని బీజేపీ నేత‌లు పేర్కోన్నారు.

డాలర్‌తో రూపాయి పతనంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా మారింద‌ని.. COVID-19 మహమ్మారి తర్వాత దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ త్వరగా కోలుకుంటున్నదని బిజెపి పేర్కొంది. యుద్ధకాల పరిస్థితుల కారణంగా డాలర్ పెరుగుదల తాత్కాలిక దశ అని వెల్ల‌డించింది.