BRS Party : `బీఆర్ఎస్` కు ఫ‌స్ట్ స్ట్రోక్, కేసీఆర్ కు ప్రాంతీయ ముద్ర‌!

`త‌న‌దాకా వ‌స్తేగానీ త‌త్త్వం బోధ‌ప‌డ‌దంటారు పెద్ద‌లు.` ఇదే సామెత‌ను ఇప్పుడు కేసీఆర్ కు అన్వ‌యించుకోవ‌చ్చు.

  • Written By:
  • Publish Date - October 7, 2022 / 03:59 PM IST

`త‌న‌దాకా వ‌స్తేగానీ త‌త్త్వం బోధ‌ప‌డ‌దంటారు పెద్ద‌లు.` ఇదే సామెత‌ను ఇప్పుడు కేసీఆర్ కు అన్వ‌యించుకోవ‌చ్చు. ఎందుకంటే, క‌ర్ణాట‌క రాష్ట్రం నుంచి ఆయ‌న‌కు తాజాగా వ్య‌తిరేక‌త ఎదురైయింది. బీఆర్ఎస్ కు మ‌ద్ధ‌తు ప‌ల‌క‌డానికి సిద్దంగా లేమ‌ని తాజాగా క‌ర్ణాట‌క మాజీ సీఎం కుమారస్వామి చెప్పేశారు.

ఒక వేళ కేసీఆర్ కు మ‌ద్ధ‌తు ఇస్తే క‌ర్ణాట‌క‌లోని తెలుగు వాళ్లు హ్యాండిస్తార‌ని గ్ర‌హించార‌ట‌. ప్రాంతీయ విద్వేషాన్ని రెచ్చ‌గొట్టిన కేసీఆర్ ను ఏపీ ప్ర‌జ‌లు స‌హ‌జంగా వ్య‌తిరేకిస్తారు. తెలంగాణ స‌రిహ‌ద్దు రాష్ట్రాల్లో ఏపీ ఓట‌ర్లు భారీగా ఉన్నారు. త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌ రాష్ట్రాల్లో కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలుపోట‌ముల‌ను నిర్దేశించే స్థాయిలో ఏపీ ఓట‌ర్ల సంఖ్య ఉంది. వాళ్ల‌ను దూరం చేసుకోవ‌డానికి అక్క‌డి పార్టీలు సిద్ధంగా లేవు. ప్ర‌త్యేకించి క‌ర్ణాట‌క రాజ‌కీయాల్లో ఏపీ ఓట‌ర్లు కీల‌క రోల్ పోషిస్తారు. స‌గం బెంగుళూరు ఏపీ ఓట‌ర్ల‌తో నిండిపోయి ఉంటుంది. అందుకే, కుమారస్వామి తొలి ప్ర‌య‌త్నంలోనే కేసీఆర్ కు హ్యాండిచ్చిన‌ట్టు తెలుస్తోంది.

క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్ర నుంచి తొలి విడ‌త ఆప‌రేష‌న్ కొన‌సాగించాల‌ని కేసీఆర్ ప్లాన్ చేశార‌ట‌. ఆ విష‌యం తెలంగాణ భ‌వ‌న్ వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. క‌ర్ణాట‌క రాష్ట్రంలో ప్ర‌స్తుతం బీజేపీ ప్ర‌భుత్వం ఉంది. అక్క‌డ కాంగ్రెస్, జేడీఎస్ కూట‌మి గ‌త ఎన్నిక‌లు ముగిసిన త‌రువాత ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ,ఆ త‌రువాత మారిన రాజ‌కీయాల కార‌ణంగా బీజేపీ అధికారంలోకి వ‌చ్చింది. ప్ర‌ధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ ఉండగా, జేడీఎస్ తో పొత్తుపెట్టుకుని స‌రిహ‌ద్దు నియోజ‌క‌వ‌ర్గాల్లో బీఆర్ఎస్ అభ్య‌ర్థుల‌ను దింపాల‌ని కేసీఆర్ స్కెచ్ వేశారు. కానీ, మిగిలిన ప్రాంతాల్లో ఏపీ ఓట‌ర్లు దూరం అవుతార‌ని గ్ర‌హించిన కుమారస్వామి రివ‌ర్స్ వాయిస్ వినిస్తున్నారట‌.

బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భాం రోజు కుమారస్వామి మిన‌హా చెప్పుకోద‌గ్గ లీడ‌ర్లు ఎవ‌రూ ఇత‌ర రాష్ట్రాల నుంచి హాజ‌రు కాలేదు. రైతు నాయ‌కులు కూడా చాలా వ‌ర‌కు దూరంగా ఉన్నారు. తూతూ మంత్రంగా పార్టీ ఆవిర్భావం జ‌రిగింది. తొలి రోజే కేసీఆర్ పెట్టిన బీఆర్ఎస్ పార్టీ వెల‌వెల పోయింద‌ని టాక్ న‌డుస్తోంది. మాజీ సీఎంగా కుమార‌స్వామి హాజ‌ర‌యిన‌ప్ప‌టికీ ఆ త‌రువాత తేరుకుని కేసీఆర్ తో క‌టీఫ్ అంటూ సంకేతాలు ఇచ్చేశారు. రాజ‌కీయేత‌ర స‌హాయాన్ని కేసీఆర్ నుంచి తీసుకోవ‌డానికి సిద్ధంగా ఉన్నామ‌ని, బీఆర్ఎస్ పార్టీకి మ‌ద్ధ‌తు ఇచ్చే ప్ర‌స‌క్తిలేద‌ని క‌ర్ణాట‌క మీడియా వ‌ద్ద అన్నార‌ట‌. దీంతో కేసీఆర్ తొలి ప్ర‌య‌త్నంలోనే బోర్లాప‌డిన‌ట్టు అయింది.

త‌మిళ‌నాడులో బీఆర్ఎస్ ఎంట్రీకి అవ‌కాశం దాదాపుగా లేదు. క‌ర్ణాట‌క మీద పెట్టుకున్న ఆశ‌లు క‌రిగిపోయాయి. మ‌హారాష్ట్ర మీద ఆశ‌లు పెట్టుకున్న‌ప్ప‌టికీ ఆక్క‌డ ఉండే ప‌రిస్థితుల దృష్ట్యా కేసీఆర్ కు ఎంట్రీ ఉంటుంద‌ని ఎవ‌రూ భావించ‌డంలేదు. రాజ‌కీయ శూన్య‌త కూడా అక్క‌డ క‌నిపించ‌డంలేదు. ఇక ప‌క్క‌నే ఉన్న ఏపీ మాత్ర‌మే ఆయ‌న‌కున్న ఒకే ఒక ఆప్ష‌న్ . అక్క‌డ పోటీ చేస్తే స‌హ‌జ మిత్రునిగా ఉన్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి న‌ష్టం వాటిల్లుతుంద‌న్న కోణం నుంచి ఆలోచిస్తున్నార‌ని తెలుస్తోంది.

ఉత్త‌ర భార‌త దేశంలో కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ ఎంట్రీకి అవ‌కాశం దాదాపుగా లేదు. అయితే, బీహార్లో మాత్రం ప్ర‌శాంత్ కిషోర్ పెట్టే కొత్త పార్టీతో జ‌త‌క‌ట్టి వెళ్ల‌డానికి ప్లాన్ చేస్తున్నారు. మిగిలిన చోట్ల రాజ‌కీయేతర స‌హాయం అందుకోవ‌డానికి ఆయా రాష్ట్రాల్లోని పార్టీలు సిద్ధంగా ఉన్నాయిగానీ, రాజ‌కీయంగా పొత్తు పెట్టుకోవ‌డానికి ఎవ‌రూ ముందుకు రాక‌పోవ‌చ్చు. ఆర్థికంగా కేసీఆర్ బాగా ఎదిగార‌ని స‌ర్వ‌త్రా భార‌త‌దేశ ప్ర‌జ‌ల‌కు తెలుసు. అందుకే, ఆయా రాష్ట్రాల్లోని పార్టీలు ఆర్థిక స‌హాయం కోసం కేసీఆర్ ను ద‌గ్గ‌ర‌కు రానివ్వ‌డానికి అవ‌కాశం ఉంది. అంతేగానీ, బీఆర్ఎస్ తో పొత్తుకు ఎవ‌రూ ముందుకు వ‌చ్చే ప‌రిస్థితులు లేవ‌ని ప్ర‌గ‌తిభవ‌న్ వ‌ర్గాల్లోనే చ‌ర్చ జ‌రుగుతోంది. సో, ఆనాడు ప్రాంతీయ విద్వేషాన్ని రెచ్చ‌గొట్టిన దోషిగా ఇప్పుడు దేశం ఎదుట కేసీఆర్ నిల‌బ‌డుతున్నాడన్న‌మాట‌.