Site icon HashtagU Telugu

Telangana: గెలుపు గుర్రాలపై కేసీఆర్ జాబితా రెడీ

Telangana

Telangana

Telangana: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ లోకసభ ఎన్నికలపై ఫోకస్ చేస్తుంది. త్వరలోనే లోకసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేసీఆర్ గెలుపు గుర్రాల జాబితాను తయారు చేయనున్నాడు. లోకసభలో సత్తాచాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి షాకివ్వాలని పార్టీ భావిస్తుంది. ఏ మేరకు మాజీ సీఎం కేసీఆర్ నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశాలను నిర్వహించనున్నారు. ఈ రోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

మేడిగడ్డ, ఇతర బ్యారేజీలను సందర్శించిన అనంతరం తెలంగాణ భవన్‌లో కేసీఆర్ నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశాలను ప్రారంభించనున్నారని కేటీఆర్ చెప్పారు. ఈ సందర్భంగా గెలుపు గుర్రాలను ఎంపిక చేస్తారని, త్వరలోనే తుది జాబితాను రూపొందిస్తామని కేటీఆర్ చెప్పారు.

కాంగ్రెస్‌కు సరైన అభ్యర్థులు లేకపోవడంతో సునీత మహీంద్రా రెడ్డి, బొంతు రామ్మోహన్, కంచెర్ల చంద్రశేఖర్ రెడ్డి, వెంకటేష్ నేత వంటి మాజీ బీఆర్‌ఎస్ నేతలను కాంగ్రెస్ ఎంపిక చేస్తుందని విమర్శించారు కేటీఆర్. స్థానిక సంస్థల స్థాయిలో కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కయ్యాయని ఆరోపించారు కేటీఆర్. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏలు టీఎస్‌ఐపాస్‌ను ఎందుకు ఆపివేసి, బిల్డర్లకు అనుమతులు ఇవ్వకపోవడాన్ని సమాధానం చెప్పాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చట్టం ప్రకారం దరఖాస్తు చేసిన 21 రోజులలోపు అనుమతులు ఇవ్వాలి. ఏఈ విషయంలో ప్రభుత్వం ఆలోచన ఏంటనేది చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు.

Also Read: AP BJP : ఏపీలో బీజేపీ పొత్తుపై మిస్సవుతున్న క్లారిటీ..!