Site icon HashtagU Telugu

KCR to Protest in Delhi: ఇక యుద్ధమే… ఢిల్లీలో కేసీఆర్ ధర్నా

వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం మొదలైందని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. ధర్నాచౌక్ లో టీఆర్ఎస్ చేసిన ధర్నా అంతం కాదని, ఇది కేవలం ఆరంభం మాత్రమేనని కేసీఆర్ అన్నారు.

కేంద్ర ప్రభుత్వ విధానాలతో తెలంగాణ రైతులు నష్టపోతున్నారని, తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొంటారా? కొనరా? స్పష్టం చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. రైతులని నష్టపోనివ్వమని కేంద్రం దిగిరాకపోతే ఢిల్లీలో కూడా నిరసన సభలు నిర్వహిస్తామని హెచ్చరించారు. తమ మహాధర్నాలో నీతి, నిజాయతీ ఉన్నాయి కాబట్టే చిరుజల్లులు కూడా స్వాగతం పలికాయన్నారు.

రాష్ట్రాన్ని పాలిస్తున్నవారు ధర్నా ఎలా చేస్తారని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారని, గుజరాత్‌ సీఎంగా ఉన్న సమయంలో మోదీ ధర్నా చేశారని కేసీఆర్ గుర్తు చేశారు. కేంద్రం దుర్మార్గ పాలనవల్ల సీఎం, మంత్రులు ధర్నాలు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని, ఈ పోరాటం ఇక్కడితో ఆగదని, కేంద్రం రైతులకు న్యాయం చేయకపోతే దిల్లీ యాత్ర చేయాల్సి ఉంటుందని కేసీఆర్ హెచ్చరించారు.

Exit mobile version