THub-2: హైదరాబాద్ లో అతిపెద్ద టీహబ్!

ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తెలంగాణలో పెట్టుబడుల వరద పారుతోంది.

  • Written By:
  • Updated On - June 27, 2022 / 11:22 AM IST

ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తెలంగాణలో పెట్టుబడుల వరద పారుతోంది. ముఖ్యంగా ఐటీ, ఇతర ఇండస్ట్రీస్ భాగ్యనగరంలో తమ తమ సంస్థలను ప్రారంభించడానికి ముందుకొస్తున్నాయి. ఇక్కడి భూములు, ఇతర సౌకర్యాలు అందుబాటులో ఉండటమే కారణం. తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహంతో తాజాగా మరో టీహబ్ ప్రారంభానికి నోచుకోబోతోంది. ఇది ప్రపంచంలోనే రెండో అతి పెద్ద టీహబ్ కావడం విశేషం. జూన్ 28న టి-హబ్ కొత్త ఫెసిలిటీ సెంటర్ ను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రారంభించనున్నారు.

ఈ మేరకు ఐటి శాఖ మంత్రి కెటి రామారావు ట్వీట్ చేస్తూ “ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు గారు చేతుల మీదుగా టీ హబ్ ప్రారంభం కావడం ఆనందంగా ఉంది. హైదరాబాద్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌కు ఈ హబ్ ఎంతగానో తోడ్పడుతుంది” అని అభిప్రాయపడ్డారు. T-Hub 3.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటైంది. దాదాపు 276 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ హబ్ లో 1,500 కంటే ఎక్కువ స్టార్టప్‌లు ఉంటాయి. టి-హబ్‌కు తెలంగాణ ప్రభుత్వం మద్దతు ఇస్తుంది. ఇది ఇప్పటివరకు 1,120 కంటే ఎక్కువ స్టార్టప్‌లకు హైదరాబాద్‌లో 2,500 మందికి ఉపాధి కల్పించడమే కాకుండా సుమారు రూ. 1,800 కోట్ల పెట్టుబడిని సమకూర్చడంలో సహాయపడింది.

టీ హ‌బ్ -2 భ‌వ‌నం ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంద‌ని సానియా మీర్జా ట్వీట్ చేయ‌గా, అద్భుతంగా ఉంద‌ని సైనా నెహ్వాల్ త‌న అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఆ భ‌వ‌నాన్ని చూస్తుంటే ఎంతో గ‌ర్వంగా ఉంద‌ని స‌మంత పేర్కొన్నారు. టీ హ‌బ్ భ‌వ‌నం హైద‌రాబాద్‌కు ఎంతో గ‌ర్వ‌కార‌ణం అని సినీ న‌టుడు సందీప్ కిష‌న్ పేర్కొన్నారు. కేసీఆర్ స‌ర్ చొర‌వ‌కు వంద‌నాలు.. భ‌వ‌నాన్ని చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంద‌ని పీవీ సింధు ట్వీట్ చేశారు.