Telangana Secretariat: తెలంగాణ కొత్త సచివాలయానికి ముహూర్తం ఫిక్స్!

తెలంగాణ కొత్త సచివాలయాన్ని (Secretariat) ప్రారంభించేందుకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది.

Published By: HashtagU Telugu Desk
Cm Kcr

Cm Kcr

తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ (CM KCR) తెలంగాణ కొత్త సచివాలయ (Secretariat) భవన నిర్మాణానికి పూనుకున్న విషయం తెలిసిందే. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే భారీ హంగులు, అత్యాధునిక నిర్మాణ విలువలతో ఈ భవనాన్ని నిర్మించేందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇప్పటికే కోట్ల వ్యయంతో రూపుదిద్దుకుంటున్న కొత్త సచివాలయాన్ని (Secretariat) ప్రారంభించేందుకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. నూతన డా.బి.ఆర్ అంబేద్కర్ సచివాలయ భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభంకానుంది.

అంగరంగ వైభవంగా

వేదపండితులు సూచించిన ముహూర్తం మేరకు, ఫిబ్రవరి 17 వ తేదీ, శుక్రవారం ఉదయం 11.30 నుంచి 12.30 గం.ల నడుమ నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. (Secretariat) ప్రారంభోత్సవానికి ముందు, ఉదయం.. వేద పండితుల ఆధ్వర్యంలో వాస్తు పూజ, చండీ యాగం, సుదర్శన యాగం తదితర పూజాకార్యక్రమాలు నిర్వహిస్తారు.

ముగ్గురు ముఖ్యమంత్రుల రాక

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి డిఎంకె అధ్యక్షుడు స్టాలిన్ (Stalin), ఝార్కండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వినీ యాదవ్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తరఫున ఆయన ప్రతినిధిగా జెడియు జాతీయ అధ్యక్షుడు లలన్ సింగ్, డా. బిఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ తదితర ముఖ్యులు పాల్గొంటారు. సచివాలయ ప్రారంభోత్సవం తర్వాత.. మధ్యాహ్నం, సికింద్రాబాద్ లోని పెరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ (Public Meeting) జరుగుతుంది. ఈ బహిరంగ సభలో సచివాలయ ప్రారంభోత్సవం లో పాల్గొన్న పైన పేర్కొన్న ముఖ్య అతిథులందరూ పాల్గొంటారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.

Also Read: Job Notification: 71 లైబ్రేరియన్ పోస్టుల కోసం నోటిఫికేషన్ జారీ!

  Last Updated: 24 Jan 2023, 01:16 PM IST