CM KCR: ఒకే వేదికపై కేసీఆర్, జగన్

కేంద్ర హోమ్ మంత్రి అధ్యక్షతన నిర్వహించనున్న సభకు ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు.

Published By: HashtagU Telugu Desk

కేంద్ర హోమ్ మంత్రి అధ్యక్షతన నిర్వహించనున్న సభకు ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. నవంబరు 14న తిరుపతిలో సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశం జరగనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ సహా కేరళ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గోననున్నారు.

Also Read : TDP vs YCP : నాయుడి కంచుకోటను వైసీపీ బద్దలుకొడుతుందా..?

ఎప్పుడో జరగాల్సిన ఈ సభ కోవిడ్ కారణాలతో వాయిదా పడుతోంది. రెండు సంవత్సరాలకి ఒకసారి జరిగే ఈ సమావేశంలో కేసీఆర్ ఇప్పటిదాకా పాల్గొనలేదు. 2016లో ఇలాంటి సభ జరగగా దానికి తెలంగాణ తరపున అప్పటి హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి హాజరయ్యారు. 2018లో బెంగుళూరులో జరిగిన సమావేశ సమయంలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఉండడం వల్ల తెలంగాణ నుండి ఎవరు హాజరు కాలేదు. ఇక ఈసారి జరిగే సమావేశానికి కేసీఆర్ హాజరుకానున్నట్లు సమాచారం. రెండు రాష్ట్రాల మధ్య నెలకొని ఉన్న నదీజలాల పంపకాల సమస్యలు, బైఫరికేషన్ అంశాలు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, జీఎస్టీ చెల్లింపులు తదితర అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశముంది.

  Last Updated: 05 Nov 2021, 11:15 PM IST