తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయ చతురత(KCR Strategy) అందరికీ తెలిసిందే. ఆయన ఒక్కో ఎన్నికకు ఒక్కోలా వ్యూహాన్ని రచిస్తుంటారు. గత ఎన్నికల్లో ముందస్తుకు వెళ్లి సక్సెస్ అయ్యారు. విపక్షాలు అవినీతి ఆరోపణలను కాజ్ గా చూపిస్తూ ముందుస్తుకు వెళ్లారు. ప్రజాక్షేత్రంలో రెండోసారి గెలిచారు. సీఎంగా రెండోసారి 2018 ఎన్నికల్లో ముందస్తు (Before Elections) రూపంలో విజయం సాధించారు. ఇక 2014 ఎన్నికల్లో `చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తీసుకొచ్చాను` అంటూ సెంటిమెంట్ ను బాగా రంగరించారు. బొటాబొటి సీట్లతో సీఎంగా పదవిని చేపట్టారు. ఆ తరువాత విపక్షాలను నిర్వీర్యం చేసి బలపడ్డారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయ చతురత(KCR Strategy)
గత రెండు ఎన్నికలను టీఆర్ఎస్ పార్టీ పేరుతో కేసీఆర్ ఫేస్ చేశారు. ఈసారి బీఆర్ఎస్ పార్టీ చీఫ్ గా ప్రజల మధ్యకు వెళుతున్నారు. జాతీయవాదాన్ని వినిపిస్తూనే తెలంగాణ ప్రజల్లోని బలహీనతను పట్టుకోవడానికి చతురతను ప్రదర్శిస్తున్నారు. తెలంగాణ మోడల్ ను(KCR Strategy) చూపిస్తూ జాతీయ స్థాయి ప్రచారానికి వెళుతున్నారు. ఆ మోడల్ ను రాష్ట్రంలో చూపిస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ఆయన గ్రహించారట. అందుకే, ఆ మోడల్ ను మరో రకంగా ఎలివేట్ చేయాలని బుధవారం జరిగిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సమావేశంలో దిశానిర్దేశం చేశారని తెలుస్తోంది.
ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సమావేశంలో దిశానిర్దేశం
ఏపీ, తెలంగాణ ప్రజల మధ్య భావోద్వేగాలను రెచ్చగొట్టడం ఈజీ. కొన్ని దశాబ్దాలుగా ఈ రెండు ప్రాంతాల ప్రజల మధ్య గ్యాప్ ఉండేలా విష బీజాలను రాజకీయ లబ్దికోసం నాటారు. అవసరమైనప్పుడల్లా దాన్ని ఉపయోగించుకోవడం ద్వారా నేతలు లబ్దిపొందుతున్నారు. రాష్ట్ర విభజన సందర్భంలో ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య సెంటిమెంట్ ను రెచ్చగొట్టారు. ఆ సందర్భంగా పలు చోట్ల గొడవలను కూడా చేయించారు. టీఆర్ఎస్ పార్టీ చీఫ్ రెండు దశాబ్దాల పాటు సెంటిమెంట్ తో (KCR Strategy)రాజకీయ పబ్బం గడిపారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఫక్తు రాజకీయాలు అంటూ తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్నారని ఉద్యమకారులు బలమైన వాయిస్ ను ఈ మధ్య పెంచారు.
బీఆర్ఎస్ కు ఓటు వేయకపోతే, ఏపీ పరిస్థితి వస్తుందని బ్లాక్ మెయిల్
తెలంగాణ మోడల్ ను చూపించడం ద్వారా మూడోసారి సీఎం కావడం కష్టమని ఇటీవల ఐ ప్యాక్ చేసిన సర్వే సారాంశమట. అందుకే, ఆ మోడల్ ను ఏపీ అభివృద్ధికి లింకు చేస్తున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య ఈర్ష్యా, ద్వేషాలను రెచ్చగొట్టేలా తెలంగాణ మోడల్ ను ఏపీకి (KCR Strategy) ముడిపెడుతున్నారు. రాబోవు రోజుల్లో బీఆర్ఎస్ కు ఓటు వేయకపోతే, ఏపీ పరిస్థితి వస్తుందని బ్లాక్ మెయిల్ రాజకీయానికి దిగుతూ ఈర్షాద్వేషాలను రెచ్చగొట్టే చతురతను కేసీఆర్ ప్రదర్శిస్తున్నారు. ఆ మేరకు నేతలకు దిశానిర్దేశం చేస్తూ తెలంగాణ మోడల్ ను (Telangana model)ఏపీకి అభివృద్ధికి లింకు చేస్తూ ప్రచారం చేయడం ద్వారా మూడోసారి సీఎం కావాలని కేసీఆర్ భావిస్తున్నారు.
Also Read : CM KCR: మళ్లీ మనమే అధికారంలోకి వస్తున్నాం, 95 నుంచి 105 స్థానాలు గెలవబోతున్నాం!
వాస్తవంగా 2019 ఎన్నికల్లో పూర్తిస్థాయి సహాయసహకారాలను జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ సీఎం అందించారు. అభివృద్ధిని వేగంగా పట్టాలు ఎక్కిస్తోన్న చంద్రబాబును ఓడించడగానికి జగన్మోహన్ రెడ్డిని ఉపయోగించుకున్నారు. ఆ తరువాత కేసీఆర్ ఏది అనుకున్నాడో, అది చేయడం మొదలు పెట్టారు. ఏపీలోని అభివృద్ధి కుంటుపడడాన్ని ఇప్పుడు వ్యంగ్యాస్త్రాల రూపంలో ప్రస్తావిస్తున్నారు. అమరావతి ప్రాజెక్టు ఆగిపోవడం, పోలవరం నిర్మాణం నత్తనడకన నడవడం, భూముల రేట్లను పోల్చడం తదితరాలను ప్రస్తావిస్తూ తెలంగాణ మోడల్ కు(Telangana model) ఏపీ ప్రగతిని ముడిపెడుతున్నారు. తద్వారా ఈర్షాద్వేషాలను ఓట్ల రూపంలో మలుచుకోవాలని కేసీఆర్ ఎత్తుగడ. గత రెండో ఎన్నికల కంటే ఈసారి ఆయన(KCR Strategy) ఎత్తుగడ భిన్నంగా ఉంది.
Also Read : BRS alliance : కేసీఆర్ మహా కూటమి! రేవంత్ కు చిక్కులే!!