Site icon HashtagU Telugu

KCR Strategy : TSPSC పాయే..టెన్త్ వ‌చ్చే.!వావ్ కేసీఆర్!

KCR Strategy

Kcr Twitter Telanganacmo 18122021 1200x800

టీఎస్ పీఎస్ పేప‌ర్ లీక్ వ్య‌వ‌హారం మ‌రుగున‌ప‌డింది. తెలంగాణ సీఎం కేసీఆర్ వేసిన పాచిక(KCR Strategy) పారింది. విప‌క్షాలు ఇప్పుడు టెన్త్ పేప‌ర్ లీక్ (Tenth paper leak)మీదకు వెళ్లాయి. తెలంగాణ‌లోని 30లక్ష‌ల మందికి సంబంధించిన టీఎస్ పీఎస్ పేప‌ర్ల లీక్ గంద‌ర‌గోళం గురించి మాట్లాడే వాళ్లే లేకుండా పోయారు. సిట్ విచార‌ణ అంటూ పీసీసీ చీఫ్ రేవంత్, బీజేపీ చీఫ్ బండి సంజ‌య్ కు నోటీసులు ఇచ్చారు. వాళ్ల వ‌ద్ద ఉన్న ఆధారాల‌ను అందించాల‌ని కోరారు. అందుకు నిర‌స‌న‌గా కొన్ని రోజులు ఆయా పార్టీలు ఆందోళ‌న‌కు దిగాయి. దీంతో తెలంగాణ స‌ర్కార్ ఉక్కిరిబిక్కిరి అయింది. సిట్టింగ్ జ‌డ్జి, ఈడీ విచార‌ణ‌ల‌కు విప‌క్షాలు డిమాండ్ చేస్తూ ప‌బ్లిక్ అటెన్ష‌న్ అంతా టీఎస్ పీఎస్ పేప‌ర్ లీక్ మీద ఉండేది. ష‌డ‌న్ గా టెన్త్ పేప‌ర్ లీక్ తెర మీద‌కు వ‌చ్చింది.

తెలంగాణ సీఎం కేసీఆర్ వేసిన పాచిక పారింది(KCR Strategy)

టెన్త్ ప‌రీక్ష‌లు ప్రారంభ‌మైన రోజే తెలుగు పేప‌ర్ లీక్ (Tenth paper leak) అయింది. మ‌రుస‌టి రోజు హిందీ పేప‌ర్ లీక్ అయింది. ఆ పేప‌ర్లు వాట్సప్ గ్రూపుల్లో చ‌క్క‌ర్లు కొట్టాయి. లీకు వీరుడు ఆ పేప‌ర్ల‌ను బీజేపీ అగ్ర నేత‌ల‌కు వాట్సప్ చేశారు. వాళ్లు దాన్ని ప‌లువురికి పంపుతూ కేసీఆర్ స‌ర్కార్ తీరును ఎండ‌గ‌ట్టే ప్ర‌య‌త్నం చేశారు. స‌రిగ్గా ఇక్క‌డే కేసీఆర్ రాజ‌కీయ అనుభ‌వాన్ని , చ‌తుర‌త‌ను(KCR Strategy) ప్ర‌ద‌ర్శించారు. పేప‌ర్ల‌ను షేర్ చేసిన బీజేపీ అగ్ర‌నేత‌ల్ని టార్గెట్ చేశారు. తెలంగాణ పోలీసులు అర్థ‌రాత్రి బీజేపీ చీఫ్ బండి సంజ‌య్ ను అరెస్ట్ చేశారు. ఆయ‌న్ను జైలుకు పంపారు. దీంతో టెన్త్ పేప‌ర్ లీక్ అంశం రాజ‌కీయాన్ని వేడెక్కించింది. ఫ‌లితంగా తెలంగాణ పబ్లిక్ స‌ర్వీస్ పేప‌ర్ల లీక్ అంశం తెర వెన‌క్కు వెళ్లిపోయింది.

టీఎస్ పీఎస్ పేప‌ర్ లీక్  విచార‌ణ స్లో

వాస్త‌వంగా తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ నిర్వ‌హించిన ప‌లు ప‌రీక్ష‌ల మీద అనుమానాలు రేకెత్తాయి. ఆ సంస్థ నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల పేప‌ర్లు 2016 నుంచి లీక్ అయ్యాయ‌ని కాంగ్రెస్ ఆరోపించింది. దానిపై సీబీఐ విచార‌ణ చేయాల‌ని పీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. విదేశాల నుంచి పేప‌ర్ లీక్ ఎపిసోడ్ లో డ‌బ్బులు వ‌చ్చాయ‌ని కొన్ని అనుమానాల‌ను వ్య‌క్తం చేస్తూ ఈడీకి ఫిర్యాదు చేయ‌డంతో సీరియ‌స్ అయింది. మ‌రో వైపు టీఎస్ పీఎస్ క‌మిష‌న‌ర్, చైర్మ‌న్ల‌ను విచార‌ణ చేయాల‌ని సిట్ భావించింది. కానీ, ఆ విచార‌ణ ఎటు వెళ్లిందో ఎవ‌రికీ ఇప్పుడు ప‌ట్ట‌డంలేదు. క‌మిష‌న‌ర్, ఆమె పీఏను విచారించిన సిట్ కొన్ని ఆధారాల‌ను సేక‌రించింది. వాటి ఆధారంగా చైర్మ‌న్ జ‌నార్థ‌న్ రెడ్డిని విచారించ‌డానికి సిట్ సిద్ద‌మ‌యింది. కానీ, ఇప్పుడు ఆ విచార‌ణ స్లో అయింది. టెన్త్ పేప‌ర్ల లీకు(Tenth Paper leak) అంశం రాజ‌కీయాన్ని హీటెక్కించింది.

సంజ‌య్ ను హైప్ చేయ‌డానికి బీఆర్ ఎస్ వ్యూహాత్మ‌కం

పేప‌ర్ లీక్ అంశాన్ని అడ్డుపెట్టుకుని బీఆర్ఎస్, బీజేపీ వ్యూహాత్మ‌క గేమాడుతున్నాయ‌ని కాంగ్రెస్ చెబుతోంది. తెలంగాణ వ్యాప్తంగా హాత్ సే హాత్ జోడో యాత్ర జ‌రుగుతోన్న క్ర‌మంలో హైప్ క్రియేట్ అయింది. ఒక వైపు రేవంత్ మ‌రో వైపు భ‌ట్టీ విక్ర‌మార్క్ పాద‌యాత్ర‌లు ప్ర‌జా దృష్టిని ఆక‌ర్షించాయి. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో టీఎస్ పీఎస్ పేప‌ర లీక్  అంశం వ‌చ్చింది. ఆ సంద‌ర్భంగా బీజేపీ, బీఆర్ఎస్ నేత‌లు ప‌ర‌స్ప‌రం ఆరోపించుకుంటూ కొన్ని రోజులు రాజ‌కీయాన్ని ర‌క్తిక‌ట్టించారు. దీంతో ప్ర‌జ‌ల దృష్టి ఆ రెండు పార్టీల వైపుకు మ‌ళ్లింది. కొన‌సాగింపుగా టెన్త్ ప‌రీక్ష పేప‌ర్ల లీక్(Tenth Paper leak) డ్రామా ఆ రెండు పార్టీల మ‌ధ్య న‌డుస్తుంద‌ని కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ మ‌హేష్ గౌడ్ ఆరోపించారు. బీజేపీ చీఫ్ బండి సంజ‌య్ ను హైప్ చేయ‌డానికి బీఆర్ ఎస్ వ్యూహాత్మ‌కంగా (KCR Strategy) గేమాడుతుంద‌ని ఆయ‌న అభిప్రాయం.

Also Read : KCR : కేసుకు కేసు-అరెస్ట్ కు అరెస్ట్! సింహ‌స్వ‌ప్నంలా కేసీఆర్ !!

మొత్తానికి తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ పేప‌ర్ల లీక్ నుంచి కేసీఆర్ స‌ర్కార్ (KCR Strategy) బ‌య‌ట‌ప‌డింది. మంత్రి కేటీఆర్ బ‌ర్త‌ర‌ఫ్‌, సిట్టింగ్ జ‌డ్జి విచార‌ణ‌, ఈడీ ఎంక్వ‌యిరీలు ఇప్పుడు వినిపించ‌డంలేదు. హాత్ సే హాత్ జోడో, పాద‌యాత్ర‌ల హ‌డావుడి, ప్ర‌భుత్వంపై కాంగ్రెస్ ఆరోప‌ణ‌ల ప‌ర్వం త‌గ్గింది. ప్ర‌జ‌ల దృష్టి ఇప్పుడు బండి సంజ‌య్ అరెస్ట్, విడుద‌ల మీద ఉంది. దానికి కొన‌సాగింపుగా ఈటెల రాజేంద్ర విచార‌ణ అంశాన్ని బీఆర్ఎస్ తెర‌మీద‌కు తీసుకొచ్చింది. ఎలాగూ ఈనెల 8న మోడీ హైద‌రాబాద్ వ‌స్తున్నారు. ఆయ‌న ఏదో ఒక కామెంట్ సహ‌జంగా చేస్తారు. దీంతో మ‌రో వారం పాటు బీజేపీ నేత‌ల అరెస్ట్ ప‌ర్వం న‌డుస్తుంది. అంతిమంగా కేసీఆర్ వేసిన ఎత్తుగ‌డ ఫ‌లించి తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ పేప‌ర్ లీక్ కేసు బుట్ట‌దాఖ‌లు కానుందని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. అంతేకాదు, బీజేపీ ఆశించిన రాజ‌కీయ ప్ర‌యోజ‌నం నెర‌వేరుతుంది. ఫ‌లితంగా కాంగ్రెస్ ప్ర‌స్తావ‌న తెలంగాణ వ్యాప్తంగా చ‌ర్చ‌కు రాకుండా బీజేపీ, బీఆర్ఎస్ హైప్ క్రియేట్ చేసుకున్నాయి. ఇందులో ఎవ‌రు ఎత్తుగ‌డ ఏమిటోగానీ నిరుద్యోగులు, విద్యార్థులు అయోమ‌యంలో ప‌డ్డారు.

Also Read : Polavaram : KCR చెప్పిన‌ట్టే కేంద్రం! పోల‌వ‌రం ఎత్తు కుదింపు!