Lok Sabha Elections 2024 : మెదక్ సభలో సీఎం రేవంత్ ఫై కేసీఆర్ సంచలన ఆరోపణలు

పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీకి 2 సీట్ల కంటే ఎక్కువ రావ‌ని అన్ని స‌ర్వే రిపోర్టులు చెపుతున్నాయి. అందుకే నారాయ‌ణ‌పేట స‌భ‌లో సీఎం రేవంత్ లో భయం కనిపించింది

  • Written By:
  • Publish Date - April 16, 2024 / 09:08 PM IST

లోక్ సభ ఎన్నికల (Lok Sabha Elections) ప్రచారంలో భాగంగా ఈరోజు మెదక్ లో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) భారీ సభ నిర్వహించారు. ఈ సభలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫై , సీఎం రేవంత్ (CM Revanth Reddy) ఫై సంచలన ఆరోపణలు చేసారు. గత కొద్దీ రోజులుగా బిఆర్ఎస్ నేతలు ముఖ్యంగా పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ పదే పదే సీఎం రేవంత్ రెడ్డి బిజెపి లో చేరబోతున్నారని..లోక్ సభ ఎన్నికలు పూర్తి కాగానే ఎన్నికల్లో గెలిచినా అభ్యర్థులతో కలిసి బిజెపి లో చేరడం ఖాయమని చెపుతుండగా..ఈరోజు కేసీఆర్ సైతం అలాగే అన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీకి 2 సీట్ల కంటే ఎక్కువ రావ‌ని అన్ని స‌ర్వే రిపోర్టులు చెపుతున్నాయి. అందుకే నారాయ‌ణ‌పేట స‌భ‌లో సీఎం రేవంత్ లో భయం కనిపించింది. ఆ భ‌యం చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కూడా ఉండేట‌ట్టు లేద‌ని అనిపిస్తుంది. ఎవ‌డు ఎప్పుడు పోయి బీజేపీలో క‌లుస్త‌డో.. ముఖ్య‌మంత్రే జంప్ కొడుతడో.. ఏమైత‌దో తెలియ‌ని ప‌రిస్థితి. సీఎం ఇక్క‌డ ఒక‌టి మాట్లాడుతున్నాడు. అక్క‌డ ఒక‌టి మాట్లాడుతున్నాడు. ఢిల్లీకి పోయి బీజేపీకి ఓటు వేయ‌మ‌ని చెబుతుండు. ఏం జ‌రుగుతంది. ఎవ‌రు ఎవ‌రికి బీ టీమ్. ఎవ‌రెవ‌రూ క‌లిసిపోయారు. ఒక్క‌సారి మిరే ఆలోచ‌న చేయాలి అంటూ కేసీఆర్ మెదక్ సభలో చెప్పుకొచ్చారు. ఇక అంబేద్క‌ర్ జ‌యంతి రోజున ఆ మ‌హానీయుడిని కాంగ్రెస్ అవ‌మానించారు అని కేసీఆర్ మండిప‌డ్డారు. క‌నీసం అంబేద్క‌ర్‌కు నివాళుల‌ర్పించ‌లేదు అని ధ్వ‌జ‌మెత్తారు.

పదేళ్ల బిఆర్ఎస్ పాలన లో కరెంట్ క్షణం పోయింది లేదు..పంట ఎండింది లేదు..మంచి నీళ్ల కోసం బిందెలు పట్టుకొని పరుగులు తీసింది లేదు..కరువు అంటే ఏంటో కూడా తెలియదు..అలాంటిది కాంగ్రెస్ వచ్చింది..రాష్ట్రానికి కరువు వచ్చింది. కరెంట్ ఎప్పుడు ఉంటుందో..ఎప్పుడు పోతుందో కూడా తెలియడం లేదు..నీళ్ల కోసం ఎదురుచూసే పరిస్థితి వచ్చింది..పంటలు ఎండిపోయాయి..వారిని ఆదుకునే నాధుడు లేడు..ఇలా ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే..ఇవన్నీ జరుగుతాయని ముందే చెప్పుకుంటూ వచ్చా..అయినప్పటికీ ప్రజలు కాంగ్రెస్ హామీలను నమ్మి ఓటు వేసి..ఇప్పుడు బాధపడుతున్నారు. అందుకే ఈ బాధలన్నీ పోవాలంటే లోక్ సభ ఎన్నికల్లో బిఆర్ఎస్ ను భారీ మెజార్టీ తో గెలిపించాలని..అప్పుడే ఈ కాంగ్రెస్ ప్రభుత్వ మెడలు వచ్చే పరిస్థితి వస్తుందని కేసీఆర్ చెప్పుకొచ్చారు.

Read Also : Kadiyam Srihari: పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాజయ్య స్కామ్ లపై కడియం సంచలన ఆరోపణలు