KCR : రెండు పిల్లర్లు కుంగితే..కాంగ్రెస్ దేశం కొట్టుకుపోయినట్టు చేస్తుంది – కెసిఆర్

అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన బిఆర్ఎస్ (BRS).. లోక్ సభ (Lok Sabha) ఎన్నికలపై పూర్తి ఫోకస్ పెట్టింది. ఈ ఎన్నికల్లో విజయం సాధించి తిరిగి సత్తా చాటాలని సుహుస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు కరీంనగర్లో బీఆర్ఎస్ ‘కథనభేరి’ (Kadana Bheri Public Meeting) పేరిట భారీ సభ నిర్వహించింది. ఈ సభకు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ (KCR) హాజరయ్యారు. We’re now on WhatsApp. Click to Join. కేసీఆర్‌ కు కరీంనగర్‌ (Karimnagar […]

Published By: HashtagU Telugu Desk
Kcr Medigadda

Kcr Medigadda

అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన బిఆర్ఎస్ (BRS).. లోక్ సభ (Lok Sabha) ఎన్నికలపై పూర్తి ఫోకస్ పెట్టింది. ఈ ఎన్నికల్లో విజయం సాధించి తిరిగి సత్తా చాటాలని సుహుస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు కరీంనగర్లో బీఆర్ఎస్ ‘కథనభేరి’ (Kadana Bheri Public Meeting) పేరిట భారీ సభ నిర్వహించింది. ఈ సభకు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ (KCR) హాజరయ్యారు.

We’re now on WhatsApp. Click to Join.

కేసీఆర్‌ కు కరీంనగర్‌ (Karimnagar )ను సెంటిమెంట్‌గా భావిస్తారనే విషయం తెలిసిందే. 2001లో ఎక్కడైతే తెలంగాణ ఉద్యమ బావుటాను ఎగురవేశారో ఇప్పుడు అక్కడి నుంచే పార్లమెంట్‌ ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తున్నారు. కలిసొచ్చిన ఎస్సారార్‌ కళాశాల మైదానం వేదికగా ఈ పబ్లిక్ మీటింగ్ జరిగింది. ఈ సభలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫై నిప్పులు చెరిగారు. ముఖ్యంగా మేడిగడ్డ ప్రాజెక్టుపై వచ్చిన ఆరోపణల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టులో 300కు పైగా పిల్లర్లు ఉంటాయి. వాటిలో రెండు కుంగితే రాద్ధాంతం చేస్తున్నారు. దేశమే కొట్టుకుపోయినట్లు మాట్లాడుతున్నారు. రెండు కుంగితే భూమి బద్దలైందా..? మేడిగడ్డ పేరు చెప్పి నన్ను బద్నాం చేయాలని కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. త్వరలో టీవీల్లో కూర్చుని కాళేశ్వరంపై వివరిస్తా’ అని తెలిపారు.

ఈ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టకపోతే వాళ్లలో నిర్లక్ష్యం, అహంకారం మరింత పెరుగుతుందని ఓటర్లను హెచ్చరించారు. ఈ ఎన్నికల్లో గులాబీ జెండా ఎంత బలంగా ఎగిరితే.. బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజల పక్షాన అంత బలంగా, కాపలాదారుగా కొట్లాడుతుందని భరోసా ఇచ్చారు.

Read Also : Aadhaar: ఆధార్ వినియోగదారులకి గుడ్ న్యూస్.. ఇకపై ఆ విషయంలో నో టెన్షన్?

  Last Updated: 12 Mar 2024, 09:21 PM IST