ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జర్నీని గుర్తు చేశారు. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, కంటి వెలుగు వంటి పథకాలను ప్రజల అవసరాలను గుర్తించి ప్రభుత్వం స్వయంగా రూపొందించిందని తెలిపారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటా తాగునీటి సరఫరా వంటి కార్యక్రమాలను ఎన్నికల హామీలుగా కాక, ప్రజల సంక్షేమం కోసం చేపట్టామని స్పష్టంగా పేర్కొన్నారు. ముఖ్యంగా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడంలో బీఆర్‌ఎస్ కీలక పాత్ర పోషించిందని కేసీఆర్ వివరించారు.
SAARC Visa Exemption Scheme: భారతదేశం రద్దు చేసిన సార్క్ వీసా పథకం అంటే ఏమిటి?
రైతుల సంక్షేమం కోసం బీఆర్‌ఎస్ తీసుకున్న చర్యలను కేసీఆర్ గర్వంగా వివరించారు. తెలంగాణలో పంజాబ్‌ను తలదన్నే విధంగా పంట ఉత్పత్తి పెరిగిందని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడం ద్వారా లక్షల ఎకరాలకు నీరు అందించిన ఘనత బీఆర్‌ఎస్ ప్రభుత్వానిదని చెప్పారు. రైతులకు నాణ్యమైన 24 గంటల ఉచిత కరెంటును అందించడం ద్వారా వ్యవసాయ అభివృద్ధికి దోహదపడ్డామని గుర్తు చేశారు. రైతుల మరణాల సమయంలో తక్షణ సహాయం అందించేందుకు రైతుబీమా పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. రైతులు ఇంట్లో కూచున్నా వారి ఖాతాల్లో రైతుబంధు నిధులు చకచకా జమయ్యేవిధంగా ప్రభుత్వ యంత్రాంగం పనిచేసిందని వివరించారు.
Pahalgam Attack: పహల్గాం ఉగ్రదాడిపై రష్యా, చైనాలతో దర్యాప్తు : పాక్
కేసీఆర్ ప్రసంగంలో పారిశ్రామిక రంగం, విద్యా రంగంలో తెలంగాణ సాధించిన పురోగతిని కూడా ప్రస్తావించారు. ఐటీ రంగంలో కోట్లాది రూపాయల విలువైన ఎగుమతులు సాధించామని, లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని తెలిపారు. గురుకుల విద్యాసంస్థలను విస్తరించి పేద విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించినట్లు వివరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షించడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యుత్తమంగా పనిచేసిందని, ఇవన్నీ కేవలం మాటలు కాకుండా కేంద్ర ప్రభుత్వ నివేదికల ఆధారంగా రుజువైన విషయాలేనని కేసీఆర్ ప్రజలకు నొక్కి చెప్పారు. “ఈ అభివృద్ధి మీ కండ్లముందే జరిగింది” అని గర్వంగా తెలిపారు. ఇక చివర్లో రాబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ ఘనవిజయం సాదించబోతుందని..బిఆర్ఎస్ విజయాన్ని ఎవ్వరు ఆపలేరని పేర్కొన్నారు.