CM KCR Speech: మా అమ్మమ్మ ఊరు ఇదే.. నేను కామారెడ్డిలోనే తిరిగిన

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు సీఎం కేసీఆర్ కామారెడ్డిలో పర్యటించారు. కామారెడ్డిలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. కేసీఆర్ మాట్లాడుతూ.. కామారెడ్డితో తనకు పుట్టినప్పటి నుంచి

CM KCR Speech: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు సీఎం కేసీఆర్ కామారెడ్డిలో పర్యటించారు. కామారెడ్డిలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. కేసీఆర్ మాట్లాడుతూ.. కామారెడ్డితో తనకు పుట్టినప్పటి నుంచి అనుబంధం ఉందని అన్నారు. కేసీఆర్ అమ్మమ్మ ఈ గ్రామంలోనే పుట్టిందని, తన బాల్యం కూడా ఇక్కడే గడిచిందని సీఎం చెప్పారు. అంతేకాదు తెలంగాణ ఉద్యమ సమయంలో ఇక్కడ 45 రోజుల పాటు జలమండలి ఉద్యమం చేశానని గుర్తు చేశారు.

కామారెడ్డిలో నామినేషన్‌ దాఖలు చేసిన అనంతరం కేసీఆర్ మాట్లాడారు. గత ఎన్నికల్లో కామారెడ్డిని జిల్లా చేస్తామని హామీ ఇచ్చాం. జిల్లా చేసి మాట నిలుపుకున్నామని కేసీఆర్ తెలిపారు. జిల్లాకి మెడికల్ కాలేజీ కూడా వచ్చిందన్నారు. కేసీఆర్ కామారెడ్డి వస్తుంటే ఒక్కడే రాడు. కేసీఆర్ తో పాటు చాలా మంది వస్తారు. కేసీఆర్ వెంట కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు కాళేశ్వరం నీళ్లు వస్తాయన్నారు. కామారెడ్డి గ్రామాల రూపురేఖలు మార్చే బాధ్యత నాదేనని స్పష్టం చేశారు.

తెలంగాణ వెనుకబాటుకు కాంగ్రెస్సే కారణమని ఫైర్ అయ్యారు.. కాంగ్రెస్ 50 ఏళ్లు దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించిందని, అయితే కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నించారు సీఎం కేసీఆర్. రైతుబంధు వ్యర్థమని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. వ్యవసాయం చేయని రాహుల్ గాంధీ మీరు ధరణిని తొలగిస్తారా? ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌లో కూడా 24 గంటల పాటు కరెంటు ఇవ్వడం లేదు. కానీ తెలంగాణలో 24 గంటల కరెంట్‌ ఇస్తున్నాం. 24 గంటల కరెంట్ కావాలా? మీకు 3 గంటల కరెంట్ కావాలా తేల్చుకోవాలని సీఎం కేసీఆర్ అన్నారు.

Also Read: BRS Minister: కొప్పుల ఈశ్వర్ నామినేషన్, ధర్మపురిలో జనసంద్రం