మరికాసేపట్లో బిఆర్ఎస్ అధినేత , సీఎం కేసీఆర్ (CM KCR) కోనాయిపల్లి వెంకటేశ్వరస్వామి (Kondapalli Sri Venkateswara Swamy) ఆలయానికి చేరుకొని నామినేషన్ పత్రాలు (KCR Nomination Documents) సమర్పించనున్నారు. కోనాయిపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయానికి ..కేసీఆర్ కు ఉన్న అనుభందం ఈనాటిది కాదు..1985 నుండి కేసీఆర్ కు ఈ ఆలయం తో అనుబంధం ఉంది.
34 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో.. ఎన్నో ఒడిదుడుకులను, మరెన్నో చారిత్రాత్మకం మలుపులు. ఏమైనా ఓ తిరుగులేని నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు సీఎం కేసీఆర్. ఎన్ని అడ్డంకులు ఎదురైనా కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వాటినన్నింటిని తట్టుకుని నిలబడ్డానని నమ్మకం ఆయనది. టీఆర్ఎస్ పార్టీని స్థాపించడం మొదలుకుని బంగారు తెలంగాణ సాధించడం వరకు కేసీఆర్ అదే సెంటిమెంట్‌ని ఫాలో అవుతున్నారు. ఇక్కడి వేంకటేశ్వరాలయంలో పూజలు చేస్తే శుభం జరుగుతుందని నమ్మే కేసీఆర్.. ఎన్నికలొచ్చిన ప్రతిసారీ స్వామివారి పాదాల చెంత నామినేషన్ పత్రాలు ఉంచి ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీగా మారింది.
1985వ సంవత్సరం నుంచి ఆనవాయితీగా వస్తున్నది. 1989, 1994, 1999, 2001, 2004, 2009, 2018 ప్రతిసారి ఎన్నికల నామినేషన్ పత్రాలకు పూజలు నిర్వహించి, నామినేషన్ వేసి విజయం సాధించారు. 2023లో కూడా ఆ శ్రీనివాసుడి కృపతో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించాలని సంకల్పించారు.
We’re now on WhatsApp. Click to Join.
సిద్దిపేట ఎమ్మెల్యే, మంత్రి తన్నీరు హరీశ్‌రావుకు సైతం సెంటిమెంట్ దేవాలయమైంది. 2004 ఉప ఎన్నికల్లో రాష్ట్ర మంత్రిగా ఉన్న హరీశ్‌రావు తొలిసారిగా కోనాయిపల్లి ఆలయంలో తన నామినేషన్ పత్రాలకు పూజలు చేయించి సంతకాలు చేశారు. అనంతరం నామినేషన్ వేసి ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. అప్పటి నుంచి హరీశ్‌రావుకు సెంటిమెంట్ గుడిగా మారింది. మంత్రి హరీశ్ 2008, 2009, 2010, 2014, 2018 ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. అంతేకాకుండా నియోజకవర్గంలోని ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులను సైతం ఇక్కడ పూజలు చేయించి ఎన్నికల్లో నామినేషన్లు వేయిస్తారు.
సిద్దిపేట ( Siddipet ) నంగునూరు మండలంలోని కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి పూర్వ చరిత్ర ఉంది. సంకటహరుడిగా, విజయవేంకటేశునిగా స్వామికి పేరుంది. ఇక్కడ దేవాలయ ముఖద్వారం దక్షిణం వైపు ఉంటుంది. ఇలా దక్షిణం వైపు ఉన్న దేవాలయాలు చాలా అరుదు. అది కూడా ఒక ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. ఈ పురాతన ఆలయాన్ని అద్భుతంగా పునరుద్ధరించారు. కేసీఆర్ సూచనలతో హరీశ్‌రావు ( Harish Rao ) దేవాలయాన్ని 3 కోట్ల రూపాయలకు పైగా నిధులు ఖర్చుచేసి గుడిని పునర్నిర్మించారు. ప్రధాన ఆలయంతో పాటు కల్యాణ మండపం, రాజమండపం, ధ్వజస్తంభం, స్వామి వారి మూలవిరాట్, అమ్మవార్ల విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఉత్తర ద్వారాన్ని నిర్మించారు. ప్రత్యేక పూజలు చేసేందుకు యాగశాలను సిద్ధం చేశారు. 2022 ఫిబ్రవరిలో పునఃప్రతిష్ఠ మహోత్సవాలు నిర్వహించారు. మరో రూ.50 లక్షలతో గ్రామంలో కల్యాణ మండపాన్ని కూడా నిర్మించడం విశేషం.
Read Also : Revanth Reddy: మొదటిరోజే రేవంత్ రెడ్డి నామినేషన్.. ప్రచార హోరు షురూ