తెలంగాణలో రెండో రోజు జరిగిన అసెంబ్లీ సమావేశంలో భాగంగా రాష్ట్ర నిరుద్యోగుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన ప్రకటణ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సభలో ఎప్పటిలాగే సీఎం కేసీఆర్ తనదైన శైలిలో ప్రసంగాన్ని ఆరంభించారు. ఉద్యమ సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయో తెలిపిన కేసీఆర్, 14 ఎళ్ళ సుదీర్ఘ ఘర్షణ తరువాత తెలంగాణ సాకారమైందన్నారు. సమైక్య రాష్ట్రంలో వివక్ష అన్యాయాలతో తెలంగాణ రాష్ట్రం వెనుక బడిపోయిందని, ప్రజలు చాలా క్షోభ, బాధలను అనుభవించారని కేసీఆర్ మరోసారి గుర్తు చేసుకున్నారు.
కొత్త రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ ప్రజలు ఆకలి చావులు చూశానని కేసీఆర్ తెలిపారు. ముఖ్యంగా తెలంగాణలో ఉద్యోగాలు లేక యువత ఆయుధాలను చేత బట్టి ఉద్యమం వైపు వెళ్లారని కేసీఆర్ తెలిపారు. సమైక్య రాష్ట్ర సమయంలో నిధులు, నీళ్లు, నియామకాలపై తెలంగాణపై వివక్షత చూపించారని, దీంతో ఈ మూడు సాధించటమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటం జరిగిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన తరువాత మన నీళ్లు తెచ్చుకున్నాం, మన నిధులు మనమే తెచ్చుకున్నామరని కేసీఆర్ తెలిపారు.
అలాగే తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డాక ప్రతి రూపాయి మన ప్రజల కోసమే వినియోగపడిందని, నీళ్లు, నిధుల విషయంలో ముందడుగులో ఉన్నామని కేసీఆర్ తెలిపారు. ఇక రాజకీయాలంటే ఇతర పార్టీలకు ఒక గేమ్ అని కేసీఆర్ విమర్శించారు. మరోవైపు టీఆర్ఎస్‌కు మాత్రం రాజకీయాలంటే టాస్క్ అని, కేసీఆర్ అన్నారు. ఇప్పుడు అడ్డం పొడవు మాట్లాడేవాళ్లు గతంలో ఏం చేశారో ప్రజలకు తెలుసన్నారు. వ్యక్తిగతంగా తనను కూడా నిందించిన చిల్లగరాళ్లు అని వదిలిపెట్టామని చెప్పారు. తమ ఏకాగ్రత, లక్ష్యం దెబ్బ తినొద్దని అనుకున్నామని తెలిపారు.
తమ లక్ష్యం తెలంగాణ ప్రజలకు మంచి చేయడం.. అందులో తాము సఫలీకృతం అయ్యామని తెలిపారు. తెలంగాణకు రావాల్సిన నీటి కోసం పోరాడుతున్నామని చెప్పారు. ఇక రెండు రాష్ట్రాల విభజన సమస్యలపై కేంద్ర ప్రభుత్వం విముఖత చూపుతుందని తెలిపారు. ఉద్యోగ నియామకాలపై, తెలంగాణ ఆస్తుల విషయంలో కేంద్ర ప్రభుత్వం వివాదాలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని విధాలా అన్యాయానికి గురైన తెలంగాణ ప్రజలు ఒకప్పుడు సినిమాలలో కేవలం కమెడియన్లుగా, జోకర్లుగా మాత్రమే చేసేవారని.. కానీ ఇపుడు తెలంగాణ యాస వాడితేనే సినిమా హిట్ అవుతుంటాని, అలాగే తెలంగాణ భాష మాట్లాడే హీరో ఉంటే సినిమా సక్సెస్ అవుతోందని తెలుగు సినిమా వాళ్ళకు కూడా తనదైన్ పంచ్ ఇచ్చారు కేసీఆర్.