KCR : మార్చి తర్వాత ఆసరా పెన్షన్ రు.5వేలు ఇస్తాం – కేసీఆర్ ప్రకటన

ఒక్క ఛాన్స్.. ఒక్క ఛాన్స్.. ఇవ్వండి అంటున్న కాంగ్రెస్ ..ఒక్క ఛాన్స్ ఎందుకు..? పంటికి అంట‌కుండా మింగుదామ‌నా..? అని కేసీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు

Published By: HashtagU Telugu Desk
Kcr Says Asara Pension Will Be Given Rs 5000 After March

Kcr Says Asara Pension Will Be Given Rs 5000 After March

బిఆర్ఎస్ అధినేత , సీఎం కేసీఆర్ (CM KCR) ఎన్నికల ప్రచారం (Election Campaign )లో భాగంగా నేడు నిర్మల్, ధర్మపురి, బాల్కొండ ప్రజా ఆశీర్వాద సభ (BRS Praja Ashirvada Sabha)లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బిజెపి ,కాంగ్రెస్ పార్టీల ఫై తనదైన శైలి లో విమర్శలు , సెటైర్లు , కౌంటర్లు పేల్చారు.

ఎన్నికల్లో మంచి సంప్రదాయం రావాలన్నారు. అబద్దపు హామీలు ఇచ్చేవారు ఎక్కువ అయ్యారన్నారు. బీజేపీ, కాంగ్రెస్ వైఖరి ప్రజలకు తెలుసునన్నారు. ఆ పార్టీలు రైతులు, పేదల గురించి పట్టించుకోవన్నారు. ఓటు అనేది ప్రజాస్వామ్యంలో వజ్రాయుధమని, చర్చించి… ఆలోచించి ఓటేయాలన్నారు. మార్చి తర్వాత ఆసరా పెన్షన్ రు.5వేలు ఇస్తామని కేసీఆర్ తెలిపారు.

ఒక్క ఛాన్స్.. ఒక్క ఛాన్స్.. ఇవ్వండి అంటున్న కాంగ్రెస్ ..ఒక్క ఛాన్స్ ఎందుకు..? పంటికి అంట‌కుండా మింగుదామ‌నా..? అని కేసీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్ర‌జాస్వామ్యంలో ఓటు వ‌జ్రాయుధం.. ఆ ఓటు నీత‌ల‌రాత‌ను మారుస్త‌ది.. నీ భ‌విష్య‌త్‌ను నిర్ణ‌యం చేస్త‌ది అని కేసీఆర్ తెలిపారు. అందుకే ఆషామాషీగా ఓటు వేయొద్దు. గ‌తంలో కాంగ్రెస్ పార్టీ 50 ఏండ్లు ప‌రిపాలించింది. మ‌ళ్లా ఇవాళ వ‌చ్చి ఒక్క‌సారి మాకు ఛాన్స్ ఇవ్వండ‌ని అంటున్న‌రు. ఎందుకు పంటికి అంట‌కుండా మింగుదామ‌నా..? దేనికి మీకు..? ఒక్క సారి కాదు.. 11, 12 సార్లు ఛాన్స్ ఇచ్చారు..మీరు ఏంచేశారని ప్రశ్నించారు.

We’re now on WhatsApp. Click to Join.

ప్ర‌ధాని మోడీ ఫై కూడా కేసీఆర్ నిప్పులు చెరిగారు. మోడీకి ఓ పిచ్చి ప‌ట్టుకుంది. అదే ప్ర‌యివేటైజేష‌న్.. రైళ్లు, ఓడ‌రేవులు, విమానాలు ప్ర‌యివేటైజేష‌న్.. ఆఖ‌రుకు క‌రెంట్ కూడా ప్ర‌యివేటు. రైతుల మోటార్ల‌కు మీట‌ర్లు పెట్టి బిల్లులు వ‌సూళ్లు చేయాల‌ని చెప్పిండు. చ‌చ్చినా స‌రే పెట్ట‌ను ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పాను. మ‌న‌కు రావాల్సిన ఏడాదికి 5 వేల కోట్లు క‌ట్ చేశారు. 25 వేల కోట్లు న‌ష్ట‌పోతూ కూడా మీట‌ర్లు పెట్ట‌లేదు. భ‌విష్య‌త్‌లో కూడా మీట‌ర్లు పెట్టం. ఈ తేడాను గ‌మ‌నించాలి అని కేసీఆర్ సూచించారు.

తెలంగాణ‌లో పొర‌పాటున‌ కాంగ్రెస్ గెలిస్తే మ‌ళ్లీ పైర‌వీకారులు పుట్టుకు వస్తారని, కైలాసం ఆట‌లో పెద్ద‌పాము మింగిన‌ట్టు అవుతుంద‌న్నారు. అల‌వోక‌గా, త‌మాషాగా ఓటు వేయొద్దన్నారు. అన్నీ ఆలోచించి ఓటు వేయాలన్నారు. ఎవ‌రు గెలిస్తే లాభ‌మో చూడాలన్నారు. నేను తెలంగాణ బిడ్డ‌గా చెప్తున్నా.. కాంగ్రెస్ వాళ్లకు రైతుబంధు ఇవ్వడం, క‌రెంట్ ఇవ్వడం, రైతుల ఖాతాలో నేరుగా డబ్బులు వేయడం ఇష్టం లేదన్నారు. కాబట్టి ప్రజలంతా జాగ్ర‌త్తగా ఓటు వేయాలన్నారు. ఈ అభివృద్ది కొన‌సాగాలంటే బీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే ఈ అభివృద్ది నిల‌క‌డ‌గా ముందుకు సాగుతుందన్నారు.

Read Also : Chandrababu : మధ్యతరగతి ప్రజలంతా బాబునే కోరుకుంటున్నారు..ఇదే సాక్ష్యం

  Last Updated: 02 Nov 2023, 09:17 PM IST