Site icon HashtagU Telugu

TS Assembly: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ బతికించారు: హరీశ్ రావు

Harish Rao

Harish Rao

TS Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కాసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ కొనసాగింది. సభలో ప్రతిపక్ష నాయకుడిగా సీఎం కేసీఆర్ పేరును స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. నేటితో అసెంబ్లీ సమావేశాలు ముగియనున్న ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య వాడీవేడిగా చర్చ నడిచింది. అసెంబ్లీలో నువ్వా-నేనా అన్నట్టుగా మాటల యుద్ధానికి దిగారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బతికించిందని కెసిఆర్ అని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు సభలో చర్చ సందర్భంగా అన్నారు. 14 నెలలకే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం నుంచి తాము వైదొలిగామని పేర్కొన్నారు. ఆరు కారణాలతో మేం ఆరోజు రాజీనామా చేశామన్నారు. వైఎస్ హయాంలో తమతో ఉన్నది పిజెఆర్ మాత్రమేనని ఆయన గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీకి అధికార భిక్షపెట్టిందే కెసిఆర్ అన్నారు.

కెసిఆర్ తో పొత్తు పెట్టుకుంటేనే కాంగ్రెస్ కు అధికారం వచ్చిందన్న హరీశ్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సైతం బీఆర్ఎస్ విమర్శలను తిప్పికొట్టారు. ముస్లింల సంక్షేమం కోసం ప్రభుత్వాలు ఏమి చేయడం లేదని అక్బరుద్దీన్ అన్నారు.

Also Read: Kerala: కేరళలో విజృంభిస్తున్న విష జ్వరాలు, 2 వారాల్లోనే 1,50,369 కేసులు