Site icon HashtagU Telugu

KCR Request: త్వరలో కోలుకొని మీ ముందుకు వస్తా, దయచేసి ఆస్పత్రికి రాకండి!

Cm Kcr Health Belletin

Cm Kcr Health Belletin

KCR Request: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తుంటి ఎముకకు గాయం కారణంగా హైదరాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర ముఖ్య నాయకులు కేసీఆర్ ను పరామర్శించారు. అయితే కేసీఆర్ ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు చాలామంది నేతలు ఆస్పత్రికి క్యూ కడుతుండటంతో ఆస్పత్రిలో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో కేసీఆర్ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల కోసం ఓ వీడియో రూపంలో కీలక సందేశం ఇచ్చారు.

‘‘ తాను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానని త్వరలో సాధారణ స్థితికి చేరుకుని మీ నడుమకే వస్తానని అప్పడిదాకా సంయమనం పాటించి యశోద దవాఖానకు రావొద్దని తనతో పాటు వందలాది మంది పేషెంట్లు హాస్పిటల్ లో ఉన్నందున మన వల్ల వారికి ఇబ్బంది కలగకూడదు’’ అని ఆయన వేడుకున్నారు.

‘‘తన పట్ల అభిమానం చూపుతున్న కోట్లాది ప్రజలకు కృతజ్ఞత తెలుపుతూ గద్గద స్వరం తో చేతులు జోడించి మొక్కారు. తనను చూడడానికి వచ్చి మీరూ ఇబ్బంది పడొద్దు… హాస్పటల్ లో ఉన్న పేషెంట్లను ఇబ్బంది పెట్టొద్దని పదే పదే ఆ వీడియో ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రత్యేకంగా వీడియో ను విడుదల చేశారు కేసీఆర్.