Site icon HashtagU Telugu

KCR Resigns to CM Post : సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా..

Kcr Resigns To Cm Post

Kcr Resigns To Cm Post

తెలంగాణ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ (BRS) ఘోర పరాజయం పాలైంది..రెండుసార్లు అధికారం చేపట్టిన కేసీఆర్ (KCR)..మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని కలలు కన్నారు. కానీ ప్రజలు మాత్రం కేసీఆర్ కలల ఫై నీళ్లు చల్లారు. కేవలం 39 స్థానాలతో సరిపెట్టించారు. తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 65 స్థానాల్లో ‘కాంగ్రెస్’ ఘన విజయం సాధించింది. బీఆర్ఎస్ 39 స్థానాలు, బీజేపీ 8 స్థానాలు, ఎంఐఎం 7 స్థానాల్లో విజయం సాధించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక ఫలితాల నేపథ్యంలో సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా (KCR Resigns to CM Post) చేశారు. ఆదివారం సాయంత్రం రాజ్ భవన్‌కు వెళ్లిన కేసీఆర్.. గవర్నర్ తమిళికి సైకి రాజీనామా పత్రం సమర్పించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలుకావడంతో ప్రజా తీర్పును గౌరవిస్తూ ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రిజైన్ చేశారు. పూర్తి ఫలితాలు వెలువడక ముందే ఈ నిర్ణయం తీసుకున్నారు. కారులో రాజభవన్ కు వెళ్లిన సీఎం కేసీఆర్ .. గవర్నర్ కు రాజీనామా లేఖను అందించారు. కాంగ్రెస్ కు మేజిక్ ఫిగర్ సీట్లు దాటగానే కేసీఆర్ రాజీనామా చేయడం జరిగింది.

ఇదిలా ఉంటె కేసీఆర్ పోటీ చేసిన కామారెడ్డి , గజ్వేల్ లలో కామారెడ్డి లో ఓటమి చెందగా..గజ్వేల్ లో హ్యాట్రిక్ విజయం సాధించారు. సమీప బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌పై కేసీఆర్ ఘన విజయం సాధించారు. కాకపోతే గత ఎన్నికల కంటే ఈ సారి మెజార్టీ తగ్గడం గమనార్హం. కామారెడ్డిలో బీజేపీ నేత చేతిలో ఓడిపోయారు.

Read Also : KTR : మాకు ఇదో గుణపాఠం – ఫలితాల ఫై కేటీఆర్ రియాక్షన్