KCR: కేసీఆర్ రాజీనామా ఛాలెంజ్

బీజేపీ చీఫ్ బండి సంజ‌య్ కు తెలంగాణ ముఖ్య‌మంత్రి ప్ర‌తి స‌వాల్ విసిరాడు. గొర్ల ప‌థ‌కం కేంద్రం నిధులు ఇచ్చిన‌ట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తాన‌ని కేసీఆర్ ఛాలెంజ్ చేశాడు. ఎవ‌రైనా ప్ర‌శ్నిస్తే దేశ ద్రోహులుగా చిత్రీక‌రించ‌డం బీజేపీ నైజ‌మ‌ని కేసీఆర్ ఫైర్ అయ్యాడు. చైనా ఆక్ర‌మ‌ణ చేయ‌కుండా ఉండాల‌ని కోరుకుంటూ చేసిన వ్యాఖ్య‌ల‌ను దేశ ద్రోహం కింద‌కు వ‌స్తాయా? అంటూ నిల‌దీశాడు.

  • Written By:
  • Updated On - November 8, 2021 / 11:00 PM IST

బీజేపీ చీఫ్ బండి సంజ‌య్ కు తెలంగాణ ముఖ్య‌మంత్రి ప్ర‌తి స‌వాల్ విసిరాడు. గొర్ల ప‌థ‌కం కేంద్రం నిధులు ఇచ్చిన‌ట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తాన‌ని కేసీఆర్ ఛాలెంజ్ చేశాడు. ఎవ‌రైనా ప్ర‌శ్నిస్తే దేశ ద్రోహులుగా చిత్రీక‌రించ‌డం బీజేపీ నైజ‌మ‌ని కేసీఆర్ ఫైర్ అయ్యాడు. చైనా ఆక్ర‌మ‌ణ చేయ‌కుండా ఉండాల‌ని కోరుకుంటూ చేసిన వ్యాఖ్య‌ల‌ను దేశ ద్రోహం కింద‌కు వ‌స్తాయా? అంటూ నిల‌దీశాడు.

కేసీఆర్ ప్రెస్ మీట్ 

  • దేశంలోని ఏ రాష్ట్రంలో నేత‌లు ప్ర‌శ్నిస్తే వాళ్లు దేశ ద్రోహులా?
  • ప్ర‌శ్నిస్తే దేశ‌ద్రోహులు, చైనా లో డ‌బ్బు దాచుకోవ‌డం మ‌సిపూసి మారేడు కాయ చేసే వ్యాఖ్య‌
  • తెలంగాణ‌లో వ‌డ్ల‌ను కేంద్రం కొనుగోలు చేస్తుందా? లేదా? నేరుగా చెప్పాలి
  • వ‌రి ధాన్యం కొనుగోలు చేయ‌డంపై కేంద్రం నిజాయితీగా చెప్పాలి
  • రాయ‌ల‌సీమ‌కు నీరు కావాల‌ని చెబుతున్నా. దేశంలో ముఖ్య‌మైన వ్య‌క్తిగా స్పందించా
  • కృష్ణా, గోదావ‌రి, కావేరి అనుసంధానం ఎన్నిక‌ల కోసం రాజ‌కీయ అస్త్రం
  • 62ల‌క్ష‌ల ఎక‌రాల్లో వ‌రి పండించాం. ఆరు హెలికాప్ల‌ర్లలో చూపిస్తాం
  • యాసంగి వ‌రి పంట‌ను కేంద్రం కొనుగోలు చేయాలి
  • గొర్ల ప‌థ‌కం కింద కేంద్ర నిధులు ఇచ్చి ఉన్న‌ట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తా
  • క‌ర్నాట‌క‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో దొడ్డిదోవ‌న బీజేపీ ప్ర‌భుత్వం న‌డుపుతున్నారు
  • నాగార్జున‌సాగ‌ర్ లో బీజేపీ డిపాజిట్లు పోయింద‌నే విష‌యం గుర్తుంచుకోవాలి
  • ఈడీ, ఆదాయ‌ప‌న్ను శాఖ‌తో దాడులు చేయించ‌డం బీజేపీ స్టైల్
  • అనేక కార‌ణాల‌తో ద‌ళిత ముఖ్య‌మంత్రిని చేయ‌లేక‌పోయాను
  • తెలంగాణ‌లో బీజేపీకి పునాది లేదు. అడ్ర‌స్ లేనిపార్టీ బీజేపీ
  • గ్రేట‌ర్ లో టీఆర్ఎస్ కున్న కార్పొరేట‌ర్లు కూడా బీజేపీకి లేరు
  • తెలంగాణ‌లో ప‌లు చోట్ల పోటీ చేసి గెలిచా, తెలంగాణ బిల్లుపై పార్ల‌మెంట్లో కేసీఆర్ లేడా?
  • తెలంగాణ కోసం కిష‌న్ రెడ్డి ఎందుకు రాజీనామా చేయలేదు. ప‌ద‌వుల‌ను చిత్తు కాగితాల‌పై విసిగొట్టే నైజం టీఆర్ఎస్ పార్టీది.
  • ప్ర‌పంచ ఉద్య‌మాల‌కు ఆద‌ర్శంగా నిలిచేలా తెలంగాణ ఉద్య‌మాన్ని న‌డిపా
  • ఏడేళ్ల‌లో అనేక కార్య‌క్ర‌మాలు విజ‌య‌వంతంగా నిర్వ‌హించాం. ప్రైవేటు స్కూల్స్ టీచ‌ర్ల‌ను ఆదుకున్నాం
  • క‌ర్నాట‌క‌లో క‌రోనా స‌హాయం అడిగితే లాఠీ చార్జి చేసి పంపారు.
  • మెడిక‌ల్ కాలేజీలు, న‌వోదయ కాలేజిల‌ను బీజేపీ తీసుకురావాలి
  • పెట్రోలు, డీజిల్ సెస్సును కేంద్రం ఉప‌సంహరించుకోవాలి
  • ఈడీ, ఇన్ కంటాక్స్ దాడుల‌కు భ‌యంప‌డం. బ్లాక్ మెయిల్ రాజ‌కీయాలు చెల్ల‌వు
  • ఫాంహౌస్ లో వ్య‌వ‌సాయం చేసుకుంటున్నా. వ్యాపారాలు, బిజినెస్ లు లేవు
  • మిగిలిన వాళ్ల‌ను బెదిరింన‌ట్టు చేస్తే తెలంగాణ‌లో కుద‌ర‌దు.