Site icon HashtagU Telugu

KCR Silent: కూతురు అరెస్టై సరిగ్గా నెల..కేసీఆర్ మౌనం వీడేదెప్పుడు

KCR Silent

KCR Silent

KCR Silent: ఢిల్లీ మద్యం కుంభకోణంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టయి సరిగ్గా నెల రోజులు కావస్తోంది. ఆమె సోదరుడు కేటీఆర్, ఆమె భర్త, తల్లి శోభను జైలులో కలిసినా.. తండ్రి కేసీఆర్ ఇంతవరకు ఆమెను పరామర్శించకపోవడం, ఎక్కడా కూడా ఆ విషయాన్ని ప్రస్తావించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

మద్యం కుంభకోణంలో నిందితురాలిగా ఉన్న కవితను మార్చి 15న హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలో ఈడీ అధికారులు అరెస్టు చేశారు.అంతకుముందు ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించారు. అప్పటి నుంచి ఈడీ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గత 20 రోజులుగా తీహార్ జైలులో ఉన్న కవితను ఇటీవల సీబీఐ అరెస్ట్ చేసి మూడు రోజుల పాటు విచారించింది. సోమవారంతో ఆమె కస్టడీ ముగియనుండడంతో ఉదయం 10 గంటలకు అధికారులు ఆమెను ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. అయితే సీబీఐ మరో 15 రోజుల కస్టడీ కోరింది. దీంతో కోర్టు ఏప్రిల్ 23 వరకు కవితను కస్టడీకి అనుమతి ఇచ్చింది.

We’re now on WhatsAppClick to Join

తెలంగాణలో పదవి కోల్పోవడం, కవిత అరెస్టు, ఎంపీ, ఎమ్మెల్యేల ఫిరాయింపులతో కేసీఆర్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అంతేకాకుండా త్వరలో లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇక ఎంపీ ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలపై కేసీఆర్ పెద్దగా నమ్మకం పెట్టుకున్న కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రజలకు చేరువ కావాలని రైతులతో మమేకం అయ్యారు. రేపు సంగారెడ్డిలో భారీ బహిరంగ సభకు పిలుపునిచ్చారు. అయితే రాజకీయంగా బలహీన క్షణాలను ఎదుర్కొంటున్న గులాబీ బాస్ని లోపల కవిత అరెస్ట్ తీవ్రంగా కలచి వేస్తుందట. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో కవిత అంశంపై లేవనెత్తితే బహిరంగ సభలలో ప్రజలు ప్రశ్నించే అవకాశం లేకపోలేదు. మరోవైపు కేసీఆర్ కవిత గురించి సానుకూలంగా స్పందించినా ఆ ప్రభావం లోకసభ ఎన్నికలపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ కవిత విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు కేసీఆర్ సన్నిహితులు చెప్తున్నారు. కాగా కవిత అరెస్ట్ అయి నేటితో సరిగ్గా నెలరోజులు. గత నెల ఇదే రోజున కవితను ఈడీ హైదరాబాద్ లోని తన నివాసంలో అరెస్ట్ చేసింది.

Also Read: Bonda Uma : సీఎం జగనుపై దాడి కుట్రలో కేశినేని నాని, వెల్లంపల్లి సూత్రధారులు