Site icon HashtagU Telugu

Lok Sabha Election Campaign : కేసీఆర్ ప్రచార రథానికి ప్రత్యేక పూజలు..

Kcr Prachara

Kcr Prachara

లోక్ సభ ఎన్నికల (KCR Ready to Lok Sabha Elections) నేపథ్యంలో బిఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) ఎన్నికల ప్రచారానికి సిద్ధం అయ్యారు. రేపటి (ఏప్రిల్ 24) నుండి ఆయన బస్సు యాత్ర చేపట్టబోతున్నారు. రేపటి నుండి మే 10 వరకు ఈ బస్సు యాత్ర కొనసాగనుంది. మొత్తం 17 రోజుల పాటు సాగే ఈ యాత్ర కు సంబదించిన షెడ్యూల్ ను సైతం పార్టీ విడుదల చేసింది. మిర్యాలగూడలో ప్రారంభమై సిద్దిపేటలో జరిగే బహిరంగసభతో ఈ యాత్ర ముగుస్తుంది. ఈ నేప‌థ్యంలో కేసీఆర్ యాత్ర కొన‌సాగించ‌బోయే బ‌స్సుకు మంగళవారం తెలంగాణ భ‌వ‌న్‌లో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు.

యాత్ర సక్సెస్ ఫుల్ గా సాగాలని అంత కోరుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కేసీఆర్‌ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. దాదాపు ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఒకటి రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్‌షోలు ఉండే విధంగా బస్సు యాత్రను ప్లాన్‌ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన బిఆర్ఎస్..లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక సంఖ్యలో గెలిచి తమ సత్తా చాటాలని చూస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఇదే విషయాన్నీ తాజాగా జరిగిన పార్టీ విస్తృత సమావేశంలో పార్టీ అభ్యర్థులకు తెలియజేసారు. లోక్‌స‌భ ఎన్నికల్లో ప్రచారం, అనుసరించే వ్యూహంపై పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అలాగే ఇప్పటి వరకు 8 లోక్ సభ సీట్లలో బీఆర్ఎస్ గెలుస్తోందని.. మరో మూడు స్థానాల్లో విజయావకాశాలున్నాయని కుండబద్దలు కొట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేఖత ఉందని.. దానిని అనుకూలంగా మల్చుకోవాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.

బస్సు యాత్ర షెడ్యూల్ చూస్తే..

 

1వ రోజు 24-04-2024
1. మిర్యాల గూడ రోడ్ షో – 05.30 PM
2. సూర్యాపేట రోడ్ షో – 07.00 PM (రాత్రి బస)

2వ రోజు 25-04-2024
భువనగిరి రోడ్ షో – 06.00 PM
(రాత్రి బస) ఎర్రవల్లిలో

3వ రోజు 26 -04-2024
మహబూబ్ నగర్ లో రోడ్ షో – 06.00 PM
మహబూబ్ నగర్ (రాత్రి బస)

4వ రోజు 27-04-2024
నాగర్ కర్నూల్ రోడ్ షో – 06.00 PM

5వ రోజు 28-04-2024
వరంగల్ రోడ్ షో – 06.00 PM
వరంగల్ (రాత్రి బస)

6వ రోజు 29-04-2024
ఖమ్మం రోడ్ షో – 06.00 PM (రాత్రి బస)

7వ రోజు 30-04-2024
1. తల్లాడ లో రోడ్ షో – 05.30 PM
2. కొత్తగూడెం లో రోడ్ షో – 06.30 PM
కొత్తగూడెంలో (రాత్రిబస)

8వ రోజు 01-05-2024
మహబూబాబాద్ రోడ్ షో – 06.00 PM
వరంగల్ లో (రాత్రి బస)

9వ రోజు 02-05-2024
జమ్మికుంట రోడ్ షో – 06.00 PM
వీణవంకలో (రాత్రి బస)

10వ రోజు 03-05-2024
రామగుండం రోడ్ షో – 06.00 PM
రామగుండంలో రాత్రిబస

11వ రోజు 04-05-2024
మంచిర్యాల రోడ్ షో – 06.00 PM
కరీంనగర్ లో (రాత్రి బస)

12వ రోజు 05-05-2024
జగిత్యాల రోడ్ షో – 06.00 PM
జగిత్యాలలో (రాత్రి బస)

13వ రోజు 06-05-2024
నిజామాబాద్ రోడ్ షో – 06.00 PM
నిజామాబాద్ లో (రాత్రి బస)

14వ రోజు 07-05-2024
1. కామారెడ్డి రోడ్ షో – 05.30 PM
2. మెదక్ రోడ్ షో – 07.00 PM
మెదక్ లో (రాత్రి బస)

15వ రోజు 08-05-2024
1. నర్సాపూర్ రోడ్ షో – 05.30 PM
2. పటాన్ చెరువు రోడ్ షో – 07.00 PM
ఎర్రవెల్లి లో (రాత్రి బస)

16వ రోజు 09-05-2024
కరీంనగర్ రోడ్ షో – 06.00 PM
కరీంనగర్ లో (రాత్రి బస)

17వ రోజు 10-05-2024
1. సిరిసిల్ల రోడ్ షో – 05.00 PM
2. సిద్దిపేట బహిరంగ సభ – 06.30 PM

హైదరాబాద్ లో (రాత్రి బస)

Read Also : CM Jagan: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై టీడీపీ, బీజేపీ వైఖరి చెప్పాలి: సీఎం జగన్

Exit mobile version