అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన బిఆర్ఎస్ (BRS)..ఇక ఇప్పుడు ప్రజల్లో నమ్మకం పెంచుకునే పనిలో పడింది. ప్రత్యేక తెలంగాణ సాధించాడని చెప్పి..కేసీఆర్ కు తెలంగాణ ప్రజలు పదేళ్ల పాటు పాలించే అవకాశం ఇచ్చారు. కానీ కొంతమంది ఎమ్మెల్యేలు అధికారం చేతిలో ఉందని చెప్పి..ప్రజలను ఇబ్బంది పెట్టడం , భూములు ఆక్రమించుకోవడం వంటి అక్రమాలకు పాల్పడ్డారు. దీంతో కేసీఆర్ ఫై అభిమానం ఉన్నప్పటికీ , సిట్టింగ్ ఎమ్మెల్యేల ఫై ఆగ్రహం తో బిఆర్ఎస్ ను ఓడించారు ప్రజలు. దీంతో కేసీఆర్ పునరాలోచనలో పడి, చేసిన తప్పును సరిదిద్దుకోవడం మొదలుపెట్టారు. పోరాటాలతో ప్రజల మనుసులు గెలుచుకున్న కేసీఆర్..ఇప్పుడు అదే పొరబాటు మొదలుపెట్టి మళ్లీ ప్రజల్లో నమ్మకం కూడగట్టుకోవాలని చూస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇందులో భాగంగా నీటి పోరు యాత్ర (Water Fight) కు సిద్ధం అవుతున్నారు. త్వరలో హైదరాబాద్లో భారీ బహిరంగసభ నిర్వహించి, ఇటు కృష్ణా, అటు గోదావరి నుంచి నీటి పోరు పేరుతో యాత్ర నిర్వహించబోతున్నారు. ఇప్పటికే కృష్ణా ప్రాజెక్టులు కేఆర్‌ఎంబీకి అప్పగించడంపై నల్గొండలో బీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించిన విషయం తెలిసిందే.
ఈ సభ సక్సెస్‌తో జోష్‌లో ఉన్న బీఆర్‌ఎస్ ఇదే ఊపులో నీటి పోరుయాత్ర చేసి తమ పాలనకు, కాంగ్రెస్ పాలనకు ఉన్న తేడాను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు డిసైడ్ అయ్యింది. తెలంగాణ కోసం కొట్లాడేది కేవలం బీఆర్‌ఎస్ పార్టీ మాత్రమేనని ఎన్నికల వేళ మరోసారి ప్రజలకు గుర్తుచేసేందుకే ఈ యాత్ర అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దక్షిణ తెలంగాణలోని నాగార్జున సాగర్, ఉత్తర తెలంగాణలోని కాళేశ్వరం నుంచి నీటి పోరు యాత్ర ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. యాత్ర ముగింపు సందర్భంగా హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు బీఆర్‌ఎస్ పెద్దలు ప్లాన్ చేశారు.
Read Also : Vemireddy Prabhakar Reddy : వైసీపీకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గుడ్ బై చెప్పబోతున్నాడా..?