KCR Reacts On Kavitha Arrest : కవిత అరెస్ట్‌పై ఫస్ట్ టైం స్పందించిన కేసీఆర్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు అంతా ఉత్తిదే. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీఎల్ సంతోశ్ ను అరెస్ట్ చేయడానికి మనం పోలీసులను పంపించాం. అప్పటి నుంచి ప్రధాని మోడీ మనపై కక్ష కట్టారు. అందుకే కవితను అరెస్ట్ చేయించి జైలుకి పంపారు.

  • Written By:
  • Updated On - April 18, 2024 / 08:43 PM IST

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు (Delhi Liquor Scam)లో బిఆర్ఎస్ అధినేత , మాజీ సీఎం కేసీఆర్ (KCR) కూతురు ,ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ (Kavitha Arrest) అయ్యి ..చాల రోజులే అవుతుంది. ఇప్పటికే పలుమార్లు బెయిల్ కోసం ఆమె కోర్ట్ కు పిటిషన్ చేసినప్పటికీ …ఈడీ మాత్రం కవిత కు బెయిల్ ఇస్తే ..సాక్షాలు తారుమారు చేస్తారని గట్టిగా వాదిస్తూ వస్తుంది. దీంతో కోర్ట్ ఆమెకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తుంది. కవిత అరెస్ట్ ఫై దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు కేసీఆర్ మాత్రం స్పందించలేదు. కవిత తప్పు చేసింది కాబట్టే కేసీఆర్ స్పందించడం లేదని కాంగ్రెస్, బిజెపి ఆరోపిస్తూ వస్తుంది. ఈ క్రమంలో నేడు తెలంగాణ భవన్ లో జరిగిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో ఫస్ట్ టైం కేసీఆర్ కవిత అరెస్ట్ ఫై స్పందించారు.

We’re now on WhatsApp. Click to Join.

కవిత ఎలాంటి తప్పు చేయలేదని , రాజకీయంగా కక్ష సాధింపు కోసమే కవితను అరెస్టు చేశారని కేసీఆర్ ఆరోపించారు. ‘ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు అంతా ఉత్తిదే. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీఎల్ సంతోశ్ ను అరెస్ట్ చేయడానికి మనం పోలీసులను పంపించాం. అప్పటి నుంచి ప్రధాని మోడీ మనపై కక్ష కట్టారు. అందుకే కవితను అరెస్ట్ చేయించి జైలుకి పంపారు. మోడీ ఓ దుర్మార్గుడు” అంటూ కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు.

ప్రస్తుతం కేసీఆర్ ఫోకస్ అంత లోక్ సభ ఎన్నికలపైనే పెట్టారు. గత అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈసారి ఎలాగైనా గెలిచి తమ సత్తా చాటాలని చూస్తున్నారు. అత్యధిక సంఖ్యలో ఎంపీలు గెలిస్తే కేంద్రం చెప్పినట్లు వింటుందని కేసీఆర్ భావిస్తున్నారు. ఇందుకు తగ్గట్లే వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటీకే ప్రచార సభలను జరుపుతూ వస్తున్నారు. ఈ నెల 20 నుండి బస్సు యాత్ర మొదలుపెట్టబోతున్నారు. అలంపూర్ జోగులాంబ నుండి కేసీఆర్ బస్సు యాత్రను ప్రారంభించనున్నారు.

Read Also : Ram Charan: రామ్ చరణ్ ప్యాన్ ఇండియా క్రేజ్.. గేమ్ ఛేంజర్ పై బాలీవుడ్ గురి