KCR Raja Shyamala Yagam : రాజశ్యామల యాగం మొదలుపెట్టిన కేసీఆర్..మళ్లీ అధికారం కేసీఆర్ దేనా..?

కేసీఆర్ యాగం చేసిన ప్రతిసారీ అందుకు ప్రతిఫలం పొందారని..ఈ సారికూడా రాజ శ్యామల యాగం ద్వారా మూడోసారి అధికారం చేజిక్కించుకుంటారని బిఆర్ఎస్ శ్రేణులు చెపుతున్నారు

  • Written By:
  • Publish Date - November 1, 2023 / 10:52 AM IST

బిఆర్ఎస్ అధినేత , సీఎం కేసీఆర్ (CM KCR) కు దైవ భక్తి ఎక్కువ అనే సంగతి తెలిసిందే. అలాగే యాగాలను కూడా బాగా నమ్ముతారు. ఆయన ఏ పనిచేసిన శుభఘడియలు చూసుకొని మొదలుపెడతారు. అలాగే పెద్ద ఎత్తున చండీ యాగాలు నిర్వహిస్తుంటారు. తెలంగాణ రాష్ట్రం (Telangana State) సుభిక్షంగా ఉండాలని.. రాష్ట్రం, ప్రజలు అభివృద్ధి చెందాలంటూ.. 2015లో చండీయాగం (Chandi Yagam) నిర్వహించారు. అనంతరం.. 2018 రెండో దఫా ఎన్నికలకు వెళ్లే ముందు కూడా సీఎం కేసీఆర్ తన ఫామ్ హౌస్‌లో రాజశ్యామల యాగం (Raja Shyamala Yagam) నిర్వహించారు. ఆ యాగం తర్వాత ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్.. రెండో సారి రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకున్నారు.ఇక ఇప్పుడు ఆయన వ్యవసాయ క్షేత్రంలో మూడు రోజుల పాటు పెద్ద ఎత్తున రాజ్యశ్యామల, చండీ యాగాలు నిర్వహిస్తున్నారు.

సిద్దిపేట జిల్లా మర్కూక్‌ మండలం ఎర్రవల్లి (KCR Farm House Erravalli)లోని వ్యవయసాయ క్షేత్రంలో నేటి (నవంబర్ 1) నుంచి మూడు రోజుల పాటు రాజశ్యామల యాగం నిర్వహించనున్నారు. విశాఖపట్నం శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి పర్యవేక్షణలో యాగానికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలంగాణ, ఏపీ, కర్ణాటకలకు చెందిన పలువురు పీఠాధిపతులు యాగంలో పాల్గొననున్నారు. 200 మంది వైదికులు మంగళవారం సాయంత్రానికి ఎర్రవల్లి గ్రామానికి చేరుకున్నారు. ఈరోజు తెల్లవారుజామున మూడు గంటలకే సంకల్పంతో యాగంతో శ్రీకారం చుట్టారు. రెండోరోజు వేదపారాయణలు, హోమం తదితర క్రతువులు నిర్వహించనున్నారు. చివరిరోజు పూర్ణాహుతి ఉంటుంది. పుర్ణావుతితో యాగం ముగియనుంది. రాజశ్యామలా అమ్మవారు, చండీ అమ్మవార్లతోపాటు ఐదుగురిని ఆవాహనం చేసుకొని హోమం నిర్వహించనున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

రాజ శ్యామల యాగం (Raja Shyamala Yagam) ఎందుకు చేస్తారంటే..

పూర్వ కాలంలో రాజు గారు యుద్ధానికి వెళ్ళే ముందు పురోహితులతో రాజ శ్యామల యాగాలు, చండీ యాగాలు, శత్రు సంహార యాగాలు నిర్వహించేవారని పురోహితులు చెబుతున్నారు. అధికారం రావడానికి, శత్రువుల బలం తగ్గడానికి, జన వశీకరణ కోసం ఈ యాగం చేస్తారని పండితులు వెల్లడించారు. సీఎం కేసీఆర్ గత ఎన్నికలకు ముందు రాజ శ్యామల యాగం చేసి ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో విజేతగా నిలిచారు. ఎన్నికల విజయం తరువాత సహస్ర చండీ యాగం చేశారు. బీఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న సందర్భంలోనూ ఢిల్లీలో యాగం నిర్వహించారు. కేసీఆర్ యాగం చేసిన ప్రతిసారీ అందుకు ప్రతిఫలం పొందారని..ఈ సారికూడా రాజ శ్యామల యాగం ద్వారా మూడోసారి అధికారం చేజిక్కించుకుంటారని బిఆర్ఎస్ శ్రేణులు చెపుతున్నారు. మరి కేసీఆర్ కు ఈ యాగం ఈసారి ఎంత కలిసి వస్తుందో చూడాలి.

Read Also : AI – Word Of The Year : 2023 వర్డ్ ఆఫ్ ది ఇయర్‌‌గా ‘‘ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్’’