KCR : తెలంగాణ అసెంబ్లీ ర‌ద్దుకు స‌న్నాహాలు? 17వ తేదీ త‌రువాత ఎప్పుడైనా..!

అసెంబ్లీని ర‌ద్దు(KCR) చేయ‌నున్నారా? అందుకే, ఫిబ్ర‌వ‌రిలో బ‌డ్జెట్ ను పెట్టారా?

  • Written By:
  • Updated On - February 10, 2023 / 04:09 PM IST

తెలంగాణ అసెంబ్లీని ర‌ద్దు(KCR) చేయ‌నున్నారా? అందుకే, ఫిబ్ర‌వ‌రిలో బ‌డ్జెట్ ను పెట్టారా? సీబీఐ కేసులు ముంచుకొస్తున్న వేళ అసెంబ్లీని ర‌ద్దు చేయ‌డ‌మే మార్గ‌మా? ముంద‌స్తుకు కేసీఆర్ సిద్ధ‌మైన‌ట్టేనా? అంటే ఆయ‌న గురించి బాగా తెలిసిన వాళ్లు ఔనంటున్నారు. ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన త‌రువాత తొలిసారి 2014లో నవంబర్ నెలలో బడ్జెట్ స‌మావేశాలు జ‌రిగాయి. ఆ త‌రువాత‌ 2018 డిసెంబర్‌లో సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు(Elections) వెళ్లగా, ఆ మరుసటి ఏడాది అంటే 2019 సెప్టెంబర్‌లో బడ్జెట్ సమావేశాలు జరిగాయి. ఈ రెండు సందర్భాలు మినహా పూర్తిస్థాయి బడ్జెట్ ఎప్పుడూ మార్చి నెలలోనే పెట్టారు. ఇప్పుడు ఫిబ్ర‌వ‌రిలోనే బ‌డ్జెట్ పెట్టారు? అంటే ముంద‌స్తు ఆలోచ‌న కేసీఆర్ చాలా వేగంగా చేస్తున్నార‌ని భావిస్తున్నారు.

తెలంగాణ అసెంబ్లీని ర‌ద్దు.?(KCR)

ఇటీవ‌ల టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా కేసీఆర్(KCR) మార్పుచేసిన దేశ వ్యాప్తంగా ప్ర‌చారానికి సిద్ధ‌మ‌య్యారు. ఇప్ప‌టికే ఢిల్లీ కేంద్రంగా రాజ‌కీయాల‌ను ఆయ‌న ప్రారంభించారు. ఆ క్ర‌మంలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌లకు ముందుగా వెళ్ల‌నున్నారని తెలుస్తోంది. సాధార‌ణ ఎన్నిక‌ల‌కు దేశ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీని సిద్ధం చేయాలంటే ఆయ‌న‌కు స‌రిప‌డినంత టైమ్ కావాలి. అందుకే, ముంద‌స్తుగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను(Elections) ముగించాల‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. అందుకే, ఫిబ్ర‌వ‌రిలో బ‌డ్జెట్ ను పెట్టార‌ని ఒక వాద‌న వినిపిస్తోంది. ఇక సీబీఐ కేసులు త‌ర‌ముకొస్తున్నాయి. ఇప్ప‌టికే లిక్క‌ర్ స్కామ్ కేసు వేగంగా విచార‌ణ జ‌రుగుతోంది. ఆ కేసులో ఎమ్మెల్సీ క‌విత ప్ర‌ధాన నిందితురాలిగా ఉన్నారు. తెలంగాణ ఎన్నిక‌ల్లో ఆ కేసు ప్ర‌భావం ప‌డ‌నుంద‌ని కొంద‌రి అంచ‌నా. అంతేకాదు, మొయినాబాద్ ఎమ్మెల్యేల ఎర కేసు కూడా కేసీఆర్ మెడ‌కు చుట్టుకుంటోంది. ఆ కేసును కూడా ఇటీవ‌ల సీబీఐ టేక‌ప్ చేసింది. సుప్రీం కోర్టు కూడా ఆ కేసును సీబీఐకి అప్ప‌గిస్తూ తీర్పు చెబితే ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు ఖాయంగా కేసీఆర్ వెళ‌తార‌ని టాక్‌.

Also Read : CBI : KCR మెడ‌కు ఫామ్ హౌస్ కేసు! 2014 నుంచి ప్ర‌జాప్ర‌తినిధులపై ఎర ఇష్యూ!

కొత్త స‌చివాల‌యం ప్రారంభ ముహూర్తంగా ఈనెల 17వ తేదీని కేసీఆర్ నిర్ణ‌యించారు. ఆ రోజున ఆయ‌న బ‌ర్త్ డే కూడా. ఆ సంద‌ర్భంగా పేరెడ్ గ్రౌడ్స్ లో భారీ బ‌హిరంగ స‌భ‌ను పెడుతున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మ‌రంగా జ‌రుగుతున్నాయి. ఇటీవ‌ల బీజేపీ నిర్వ‌హించిన స‌భ‌ను మించేలా విజ‌య‌వంతం చేయాల‌ని క్యాడ‌ర్ కు దిశానిర్దేశం ఇచ్చార‌ని స‌మాచారం. ఆ స‌భ‌కు ఇత‌ర రాష్ట్రాల‌కు చెందిన ఇద్ద‌రు, ముగ్గురు సీఎంలు కూడా హాజ‌రవుతార‌ని తెలుస్తోంది. జాతీయ‌స్థాయి బ‌హిరంగ స‌భ‌ల‌కు పేరెడ్. గ్రౌండ్స్ నుంచే. శ్రీకారం చుట్టేలా ప్లాన్ చేశారు. గ‌త వారం మ‌హారాష్ట్ర ప‌రిధిలోని నాందేడ్ సరిహ‌ద్దుల్లో బ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హించారు. ఇవ‌న్నీ ఎన్నిక‌ల(Elections) కోసం రిహార్స‌ల్స్ గా పార్టీ క్యాడ‌ర్ భావిస్తోంది. ఇప్ప‌టికే విప‌క్ష లీడ‌ర్లు పాద‌యాత్ర‌లు చేస్తున్నారు. ప్ర‌భుత్వంపై ఉన్న ప్ర‌జా వ్య‌తిరేక‌త‌ను మ‌రింత పెంచుతున్నారు. టైమ్ గ‌డిచే కొద్దీ బీజేపీ బ‌ల‌ప‌డేలా క‌నిపిస్తోంది. కాంగ్రెస్, బీజేపీ మ‌ధ్య గేమాడిని కేసీఆర్ ఇప్పుడు సందిగ్ధంలో ప‌డ్డార‌ని తెలుస్తోంది.

రాజ్ భ‌వ‌న్, ప్ర‌గతిభ‌వ‌న్ మ‌ధ్య  ప్ర‌చ్ఛ‌న్న‌యుద్ధానికి బ‌డ్జెట్ స‌మావేశాల‌తో తెర‌

బీఆర్ఎస్, బీజేపీ మ‌ధ్య రాజ‌కీయ అవ‌గాహ‌న ఉంద‌ని కాంగ్రెస్ చెబుతోంది. అందుకు త‌గిన ఆధారాల‌ను కూడా బ‌య‌ట‌పెడుతోంది. ఢిల్లీ కేంద్రంగా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కు ఖ‌రీదైన స్థలాన్ని మోడీ స‌ర్కార్ ఇవ్వ‌డాన్ని ప్ర‌ధానంగా ఎత్తిచూపుతోంది. అంతేకాదు, ఇటీవ‌ల వ‌ర‌కు రాజ్ భ‌వ‌న్, ప్ర‌గతిభ‌వ‌న్ మ‌ధ్య పెద్ద వార్ న‌డిచింది. గ‌త ఏడాదిన్న‌ర‌గా జ‌రిగిన ఈ ప్ర‌చ్ఛ‌న్న‌యుద్ధానికి బ‌డ్జెట్ స‌మావేశాల‌తో తెర‌ప‌డింది. ఇదంతా బీజేపీ, బీఆర్ఎస్ (KCR)పార్టీ గేమ్ లో భాగంగా జ‌రిగిన త‌తంగంగా కాంగ్రెస్ భావిస్తోంది. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం మ‌ధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఉంద‌ని కాంగ్రెస్ చెబుతోంది. ఆ మూడు పార్టీలు అవ‌గాహ‌న‌తో వేస్తోన్న అడుగుల‌ను కూడా ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌జల‌కు వినిపిస్తోంది. ఇలాంటి అంశాల‌న్నీ ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు బ‌లంగా వెళ్లే లోపు ముంద‌స్తు ఎన్నిక‌ల‌ను(Elections) ముగించాల‌ని కేసీఆర్ భావిస్తున్నార‌ని వినికిడి.

Also Read : KCR-KTR : తండ్రి జాతీయవాదం,త‌న‌యుడి ప్రాంతీయ‌వాదం,`క‌ల్వ‌కుంట్ల` మాయ‌

ఢిల్లీ బీజేపీ పెద్ద‌ల స‌హ‌కారం లేకుండా టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా(KCR) మార్చుకోవ‌డం అంత ఈజీ కాదు. పైగా కారు సింబ‌ల్ బీఆర్ఎస్ పార్టీకి ఉండేలా ప‌క్కా ప్లాన్ తో ముందుకెళ్లారు. ఇప్పుడు ముందస్తుకు వెళ్ల‌డానికి కూడా బీజేపీ పెద్ద‌ల స‌హకారం ఉంద‌ని తెలుస్తోంది. లేదంటే అసెంబ్లీని ర‌ద్దు చేసిన త‌రువాత ఎన్నిక‌ల‌ను పొడిగించ‌డానికి అవ‌కాశం ఉంది. అదే జ‌రిగితే, కేసీఆర్ బోల్తాప‌డ‌డం ఖాయం. ఉమ్మ‌డి ఏపీ ఉండ‌గా చంద్ర‌బాబు అసెంబ్లీని ర‌ద్దు చేసిన త‌రువాత ఆనాడున్న ఎన్నిక‌ల క‌మిష‌నర్ ఎన్నిక‌ల తేదీని పొడిగించారు. దీంతో 2004 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు ఓడిపోయారు. సాధార‌ణ ఎన్నిక‌లు, అసెంబ్లీ ఎన్నిక‌లు ఒకేసారి రావ‌డం కూడా అప్ప‌ట్లో చంద్ర‌బాబు అధికారం కోల్పోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణంగా నిలిచింది.

రాబోవు క‌ర్ణాట‌క ఎన్నిక‌లతో (Elections)

ఈనెలాఖ‌రు నాటికి అసెంబ్లీని ర‌ద్దు చేస్తే, రాబోవు క‌ర్ణాట‌క ఎన్నిక‌లతో (Elections)పాటు తెలంగాణ ఎన్నిక‌ల‌ను పెట్టాల్సి ఉంటుంది. మూడోసారి అధికారంలోకి వ‌స్తే గుజరాత్ మోడ‌ల్ ను 2014 ఎన్నిక‌ల్లో మోడీ ప్ర‌చారం చేసిన విధంగా తెలంగాణ మోడ‌ల్ ను దేశ వ్యాప్తంగా కేసీఆర్ ఫోక‌స్ చేయ‌డానికి అవ‌కాశం ఉంటుంది. అప్పుడు సాధార‌ణ ఎన్నిక‌ల నాటికి కేసీఆర్ జాతీయ ప్ర‌చారానికి కొంత స‌మ‌యం దొర‌కుతుంది. ఇలా అన్ని కోణాల నుంచి ఆలోచిస్తోన్న కేసీఆర్ ఈనెలాఖ‌రులోగా మంత్రివ‌ర్గాన్ని స‌మావేశ‌ప‌రిచి ప్రభుత్వాన్ని ర‌ద్దు చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. అందుకే, ఫిబ్ర‌వ‌రిలో బ‌డ్జెట్ ప్ర‌వేశ పెట్టార‌ని టాక్‌. దీనికితోడు కేటాయింపుల‌ను గ‌మ‌నిస్తే ఓట్ల కోసం చేసిన బ‌డ్జెట్ గా క‌నిపిస్తోంది.

Also Read : KCR Strategy: కేసీఆర్ ‘ఢిల్లీ’ జిమ్మిక్కులు.. మోడీపై ఏడుగురు సీఎంలతో ‘ఢీ’