Site icon HashtagU Telugu

BRS Praja Ashirvada Sabha : తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీయే శ్రీరామరక్ష – కేసీఆర్

Kcr Nallagonda

Kcr Nallagonda

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (Telangana Elections) సమయానికి సరిగ్గా నెల రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలో అన్ని రాజకీయ పార్టీలు (Political Parties) తమ ప్రచారాన్ని మరింత స్పీడ్ చేయాలనీ చూస్తున్న్నాయి. ఇక అధికార పార్టీ బిఆర్ఎస్ (BRS) మిగతా పార్టీల కన్నా జెట్ స్పీడ్ లో ఉంది. పార్టీ అధినేత , సీఎం కేసీఆర్ (CM KCR) అందరి కంటే ముందే అభ్యర్థుల ప్రకటించి , ప్రచారం మొదలుపెట్టాడు. గత కొద్దీ రోజులుగా ప్రజా ఆశీర్వాద సభ (Praja Ashirvada Sabha) పేరుతో జిల్లాలో సభలు నిర్వహిస్తూ కార్యకర్తల్లో ఉత్సహం నింపుతూ..ప్రజలను మరోసారి బిఆర్ఎస్ ను గెలిపించాలని కోరుతున్నారు.

నేడు ఆదివారం ఉమ్మడి నల్లగొండ లో పర్యటించారు. ఆలేరు , కోదాడ , తుంగతుర్తి సభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భాంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు బాగా ఆలోచించి ఓటేయాలని, ఎవరికి పడితే వాళ్లకు కాకుండా మంచి, చెడు, న్యాయం, అన్యాయం గురించి ఆలోచించి ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏ పార్టీకి ఓటేస్తే మంచి జరుగుతది, ఏ పార్టీ రాష్ట్రాన్ని బాగు చేస్తది అనేది ప్రజలు ఓటు వేసేటప్పుడు బాగా ఆలోచించాలని కోరారు. కోదాడలో ఒక బీసీకి అవకాశం రాలేదు. పీహెచ్‌డీ వరకు చదివిన విద్యావంతుడని పిలిచి టికెట్‌ ఇచ్చాను. మీరు దీవిస్తే ఎమ్మెల్యేగా గెలిచాడు. మీ మధ్యనే ఉన్నడు తోచిన పనులు చేస్తున్నడు. ప్రభుత్వం అందించే కార్యక్రమాలు, ఆయనగా చేసే కార్యక్రమాలు చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

కోదాడ నియోజకవర్గంలో చదువుకున్న, ఉద్యోగాలు చేస్తున్న, నిరుద్యోగులు, రిటైర్డ్‌ బీసీ చైతన్యం కనపడాలి. మేము 50శాతం, 60 శాతం ఉన్నమని నరుకుడు కాదు.. రుజువు చేసి చూపించాలి. కోదాడ నియోజకవర్గంలో బీసీ చైతన్యం ప్రతి కుటుంబంలో, ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల ఇంట్లో చర్చ జరగాలి. కేసీఆర్‌ చెప్పింది నిజమా? ఎవరు గెలవాలి ? ఎవరు ఓడిపోవాలి ? అనే చర్చ చేయాలి.

60శాతం, 70శాతం బీసీ సామాజిక, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గం ఎందుకు ఓడిపావాలి. ఆ చైతన్యాన్ని చూపెట్టే బాధ్యత కోదాడ మీద ఉన్నది. కోదాడలో విజయ బావుటగా ఎగుర వేయాలి. మల్లయ్య యాదవ్‌ ఇప్పుడే నన్ను కోరారు. అగ్రకులాలతో పాటు పెద్ద సంఖ్యలో బీసీ కులాల ప్రజలు ఉన్నరు. ప్రత్యేకంగా కోదాడ కోసం బీసీ భవన్‌ను మంజూరు చేయాలని కోరారు. మల్లయ్య యాదవ్‌ను బంపర్‌ మెజారిటీతో గెలిపిస్తే రూ.10కోట్లతో కోదాడలో బీసీ భవన్‌ను కట్టించే బాధ్యత నాది అని కేసీఆర్ హామీ ఇచ్చారు.

24 గంటల కరెంట్ ఇచ్చే తెలంగాణకు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి వచ్చి మేము తాము అక్కడ రైతులకు 5 గంటల కరెంటు ఇస్తున్నాం అని చెబుతున్నాడని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. తెలంగాణలో నమ్మి ఓటేస్తే గ్యారెంటీగా కాంగ్రెస్ (Congress) కరెంటును ఖతం చేస్తుందన్నారు. కాంగ్రెస్ వస్తే.. తెలంగాణ పరిస్థితి మళ్లీ మొదటికి వస్తదన్నారు. తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీయే శ్రీరామరక్ష అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజల హక్కులను కాపాడుకోవడానికి పుట్టిందే బీఆర్ఎస్ పార్టీ అని స్పష్టం చేశారు.

Read Also : Chandrababu : జైలు నుంచే చంద్రబాబు ఆట.. తెలంగాణలో మారిన రాజకీయం