Site icon HashtagU Telugu

KCR : పదునైన మొనదేలినటువంటి అంకుశం కాసాని జ్ఞానేశ్వర్‌ – కేసీఆర్

Kcr Kasani

Kcr Kasani

కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) మెడలు వంచి పనిచేయించే అంకుశం అవసరం ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు ఎంతైనా ఉంది.. అలాంటి అంకుశంలో ఓ పదునైన మొనదేలినటువంటి అంకుశం చేవెళ్ల అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ అంటూ బిఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కొనియాడారు. లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న బిఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR).. ఈరోజు చేవెళ్ల నుండి ఎన్నికల శంఖారావం పూరించారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన కేసీఆర్ (KCR)..ఇప్పుడు లోక్ సభ (Lok Sabha) ఎన్నికలతో తమ సత్తా చాటాలని చూస్తున్నారు. ఇందులో భాగంగా చేవెళ్ల (Chevella ) బిఆర్ఎస్ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్‌ ను బరిలోకి దింపారు. కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ (Kasani Gnaneshwar Mudiraj) ఈయన గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా, శాసనమండలి సభ్యుడిగా పని చేసి ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ నియోజకవర్గం నుండి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన కాసాని.. 2022 అక్టోబర్ 14న హైదరాబాద్‌లో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు సమక్షంలో టీడీపీ ()TDP పార్టీలో చేరాడు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా 2022 నవంబర్ 04న నియమితుడయ్యాడు. 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో భాగంగా ఎన్నికలకు దూరంగా ఉండాలని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు (Chandrababu) నిర్ణయం తీసుకోవడంతో మనస్థాపంతో చెందిన ఆయన టీడీపీ అధ్యక్ష పదవికి, పార్టీకి రాజీనామా చేశాడు. ఆ తర్వాత కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌ (BRS) పార్టీలో చేరాడు. ప్రస్తుతం చేవెళ్ల లోక్ సభ బిఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నాడు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సందర్బంగా ఈరోజు శనివారం చేవెళ్ల పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. ప్రభుత్వం మెడలు వంచి పనిచేయించే అంకుశం అవసరం ఇప్పుడు ఉందని , అలాంటి అంకుశంలో ఓ పదునైన మొనదేలినటువంటి అంకుశం చేవెళ్ల అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ అని పేర్కొన్నారు. కాసాని ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి, బలహీనవర్గాల వ్యక్తి అని అలాంటి వ్యక్తిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్ధానాలు నెరవేరాలంటే.. బలమైన ప్రతిపక్షం ఉండాలని కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. ఈ ప్రభుత్వం మీకిచ్చిన వాగ్ధానాలు నెరవేరాలంటే.. ఓటు వేసే ముందు ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. బలమైన ప్రతిపక్షం ఉంటేనే.. ప్రభుత్వానికి మీరు ఒక సురుకు పెడితేనే మీ అన్ని పనులు అయితాయని అన్నారు. ‘ లేదంటే.. మేం ఏం చేయకున్నా, మోసం చేసినా, అబద్ధపు వాగ్దానాలు చేసినా మళ్లీ మమ్మల్ని గెలిపించిండ్రు అని అంటరు. ఎల్లెలకల పంటరు.. మీకేం చేయరు.’ అని హెచ్చరించారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో బీఆర్‌ఎస్‌ గెలవాలని.. అంకుశంలా పనిచేయాలని పేర్కొన్నారు.

Read Also : KCR : 4 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం కుదేలైంది – కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

Exit mobile version