Site icon HashtagU Telugu

KCR Powder : BRS,BJP సూత్రం ఇంచుమించు ఒక‌టే..!

Kcr Powder

Kcr Cap Getup

జాతీయ స్థాయిలో బీజేపీ అమ‌లు చేస్తోన్న వాషింగ్ పౌడ‌ర్ నిర్మా సూత్రాన్ని కేసీఆర్ (KCR Powder)హైలెట్ చేశారు. అయిన‌ప్ప‌టికీ అదే సూత్రాన్ని మోడీ, షా ద్వ‌యం న‌మ్ముకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఆ సూత్రానికి మ‌రింత ప‌దును పెట్టారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో చేరిక‌ల‌పై బీజేపీ క‌న్నేసింది. అందుకోసం క‌మిటీల‌ను వేసింది. కానీ, వ్యూహాల‌ను వ‌ర్కౌట్ కాలేదు. ఫలితంగా బీజేపీ తెలంగాణ విభాగాన్ని, ఏపీ బీజేపీని ప్ర‌క్షాళ‌న చేసింది.

బీజేపీ  వాషింగ్ పౌడ‌ర్ నిర్మా సూత్రాన్ని కేసీఆర్ (KCR Powder)

తెలుగు రాష్ట్రాల్లో ఇప్ప‌టి వ‌ర‌కు బీజేపీలో చేరిన లీడ‌ర్లు (KCR Powder)ఏదో ఒక కేసులో ఇరుక్కున్న వాళ్లే. ప్ర‌త్యేకించి ఈటెల రాజేంద్ర‌ను అసైన్డ్ ల్యాండ్ కింద కేసీఆర్ ఇరికించారు. ఆ కేసు నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు బీజేపీ త‌ప్ప మ‌రో మార్గం ఆయ‌న‌కు క‌నిపించ‌లేదు. ఇలా ఏదో ఒక కేసు నుంచి భ‌య‌ట‌ప‌డేందు లేదా అధికార టీఆర్ఎస్ పార్టీ పెట్టిన ఇబ్బందుల నుంచి తాత్కాలికంగా ఉప‌శ‌మ‌నం పొందేందుకు మాత్ర‌మే బీజేపీ గూటికి చాలా మంది చేరారు. ఆ జాబితాలో సీనియ‌ర్లు ఎక్కువ‌గా ఉన్నారు. వాళ్లంద‌రూ ఇప్పుడు పార్టీ మార‌డానికి సిద్ధంగా ఉన్నారు. అదే జ‌రిగితే, బీజేపీ తెలంగాణ విభాగం ఖాళీ అవుతుంది. అందుకే, చిక్కోటి ప్ర‌వీణ్ కుమార్ లాంటి కాసినో కింగ్ ను కూడా బీజేపీ ఆక‌ర్షిస్తోంది.

త్వ‌ర‌లో   బీజేపీలో చిక్కోటి  

మనీ ల్యాండరింగ్ వ్యవహారంలో ఈడీ కేసులనూ చిక్కోటి ఉన్నారు. ఇటీవ‌ల‌ బోనాల పండుగ సందర్భంగా ప్రైవేటు గన్‌మన్లను వెంటబెట్టుకుని లాల్‌ దర్వాజ అమ్మవారి దర్శనానికి వెళ్లి వివాదంలో చిక్కుకున్నారు. సీన్ క‌ట్ చేస్తే తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ని ఢిల్లీలో చీకోటి ప్రవీణ్ క‌ల‌వ‌డం వాషింగ్ పౌడ‌ర్ సూత్రాన్ని గుర్తు చేస్తోంది. క‌మ‌లం గూటికి చేర‌డానికి పార్టీ ఉపాధ్య‌క్షురాలు డీకే అరుణ‌, ఇత‌ర అగ్ర‌నేత‌ల‌తో చిక్కోటి భేటీ అయ్యారు. అధికారికంగా త్వ‌ర‌లో బీజేపీలో చేర‌తార‌ని (KCR Powder)ప్ర‌చారం జ‌రుగుతోంది.

బీజేపీ, కాంగ్రెస్ పార్టీల‌ స‌మైక్య‌వాదుల పెత్త‌నం (KCR Powder )

తెలంగాణ బీజేపీ లెక్క ప్ర‌కారం ఇప్ప‌టి వ‌ర‌కు 35 స్థానాల్లో మాత్ర‌మే చెప్పుకోద‌గ్గ అభ్య‌ర్థులు ఉన్నారు. వాళ్లు కూడా గెలిచే అభ్య‌ర్థులు కాదు. కేవ‌లం 10 నుంచి 15 మంది మాత్ర‌మే గెల‌వ‌డానికి అవ‌కాశం ఉన్న లీడ‌ర్లను గుర్తించార‌ని తెలుస్తోంది. వాళ్ల‌లో ఈటెల రాజేంద్ర‌, డీకే అరుణ‌, బండి సంజ‌య్య , ధ‌ర్మిపురి అర‌వింద్, కొండ విశ్వేశ్వ‌ర‌రెడ్డి, కిష‌న్ రెడ్డి , జితేంద్ర‌రెడ్డి , కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి త‌దిత‌రులు ఉన్నారు. ద‌క్షిణ తెలంగాణ ప్రాంతంలోని న‌ల్గొండ‌, ఖ‌మ్మం జిల్లాల్లో పోటీ చేయ‌డానికి అభ్య‌ర్థులు బీజేపీకి దాదాపు  (KCR Powder) చెప్పాలి. అందుకు ఉదాహ‌ర‌ణ‌గా నాగార్జున‌సాగ‌ర్, హుజూర్ న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల‌ను తీసుకోవ‌చ్చు.

సెంటిమెంట్ ను న‌మ్ముకున్న కేసీఆర్

ద‌క్షిణ తెలంగాణ ప్రాంతంలో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో ఎక్క‌డా డిపాజిట్ బీజేపీ అధ్య‌ర్థుల‌కు రాలేదు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లోనూ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. ఇలాంటి ప‌రిస్థితుల్లో రాజ్యాధికారం తెలంగాణ‌లో చేజిక్కించుకోవ‌డం అసంభం. అందుకే, కొంద‌రు తెలుగుదేశం పార్టీతో పొత్తు అనే అంశాన్ని తెర‌మీద‌కు తీసుకొస్తున్నారు. కానీ, ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే బీఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీకి న‌ష్టం వాటిల్లుతోంది. ఉత్త‌ర తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంకును టీడీపీ చీల్చుకుంటుంది. అలాగే, ద‌క్షిణ తెలంగాణ వ్యాప్తంగా భారీగా కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు ను నిట్ట‌నిలువునా   కొల్ల‌గొడుతోంది. అందుకే, కేసీఆర్ తాజాగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల‌ను స‌మైక్య‌వాదుల (KCR Powder)పెత్త‌నంతో న‌డుస్తున్నాయ‌ని గుర్తు చేస్తున్నారు.

Also Read : KCR & Etela: బీజేపీ బిగ్ స్కెచ్, కేసీఆర్ పై ఈటల పోటీ?

మాజీ సీఎం కిర‌ణ్ కుమార్ రెడ్డి శిష్యునిగా కిష‌న్ రెడ్డిని చిత్రీక‌రిస్తున్నారు కేసీఆర్. ప‌క్కా స‌మైక్య‌వాదిగా తెలంగాణ స‌మాజం భావించే కిర‌ణ్ కుమార్ రెడ్డి ముద్ర‌ను కిష‌న్ రెడ్డి మీద వేస్తున్నారు. ఆయ‌న అండ‌ర్ లోనే తెలంగాణ బీజేపీ న‌డుస్తుంద‌ని తాజాగా ఎన్నిక‌ల అస్త్రంగా కేసీఆర్ ఆందుకున్నారు. అదే స‌మ‌యంలో చంద్ర‌బాబు శిష్యుడు రేవంత్ రెడ్డి అండ‌ర్ లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విభాగం ఉంద‌ని గుర్తు చేస్తున్నారు. ఆ రెండు పార్టీల‌కు ఓటేస్తే స‌మైక్య‌వాదుల‌కు ఓటేసిన‌ట్టేన‌ని చెబుతున్నారు. గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ సెంటిమెంట్ ను న‌మ్ముకున్న కేసీఆర్ ఈసారి కూడా దాన్ని మ‌రో రూపంలో తెలంగాణ స‌మాజంలోకి విసురుతున్నారు. గ‌త ఎనిమిదేళ్ల‌లో ఏమి చేశారు? అనే వాదాన్ని తెర‌వెనుక్కు తీసుకెళ్లేలా స‌మైక్య‌, ప్ర‌త్యేక వాదాల‌ను కేసీఆర్ ముందుకు (KCR Powder) తీసుకొస్తున్నారు.

Also Read : Errabelli: సీఎం కెసిఆర్, BRS పార్టీయే ప్రజలకు శ్రీరామ రక్ష- మంత్రి ఎర్రబెల్లి

బంగారు తెలంగాన నినాదంతో కాంగ్రెస్, టీడీపీ పార్టీల‌ను నామ‌రూపాల్లేకుండా కేసీఆర్ చేయ‌గ‌లిగారు. సుదీర్ఘ కాలం పాటు టీడీపీలో ప‌నిచేసిన వాళ్లే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. సీఎం కేసీఆర్ తో సహా తెలుగుదేశం పార్టీ బ్ల‌డ్ నుంచి వ‌చ్చిన లీడ‌ర్లే, కానీ, ఆయ‌న మాత్రం స‌మైక్య‌వాదుల పార్టీలుగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల‌ను పోల్చుతున్నారు. బీజేపీ వాషింగ్ పౌడ‌ర్ నిర్మా సూత్రాన్ని న‌మ్ముకుంటే, కేసీఆర్ ఇంచుమించు అదే త‌ర‌హా పార్ములాను అమ‌లు చేస్తున్నారు. తెలంగాణ‌లోని పాల‌న‌ను వ్య‌తిరేకించిన వాళ్ల‌ను స‌మైక్య‌వాదిగా ముద్ర వేస్తున్నారు. దేశ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీని పెట్టుకున్న ఆయ‌న తెలంగాణ ఎన్నిక‌ల వ‌ర‌కు సెంటిమెంట్ ను రంగ‌రిస్తున్నారు. ఆయ‌న మాత్రం మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క‌, ఏపీ రాష్ట్రాల్లో పార్టీ కార్యాల‌యాలు పెట్టుకున్నారు. ఇత‌రులు ఎవ‌రు అలాంటి ప‌నిచేసినా తెలంగాణ ద్రోహులు (KCR Powder) అంటూ ముద్ర వేస్తున్నారు. అదే బీఆర్ఎస్ పార్టీలోకి వ‌స్తే తెలంగాణ‌వాదిగా ఆ లీడ‌ర్లు మారిపోతున్నారు. అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ రెండు ఇంచుమించు ఒకేతానులో ముక్క‌ల్లా క‌నిపిస్తున్నామ‌న్నమాట‌.