KCR Politics : న‌ల్గొండ BRS కు గ్రూప్ ల బెడ‌ద

KCR Politics :తెలంగాణ రాజ‌కీయాన్ని ఒంటిచేత్తో తిప్పేస్తోన్న కేసీఆర్ కు న‌ల్గొండలోని బీఆర్ఎస్ గ్రూపులు తల‌నొప్పిగా మారాయ‌ట‌

  • Written By:
  • Publish Date - August 28, 2023 / 04:45 PM IST

KCR Politics : వెయ్యి గొడ్ల‌ను తిన్న రాబందు ఒక గాలి వాన‌కు కొట్టుకు పోతుంద‌ని పెద్ద‌ల సామెత‌. అలాగే, తెలంగాణ రాజ‌కీయాన్ని ఒంటిచేత్తో తిప్పేస్తోన్న కేసీఆర్ కు న‌ల్గొండలోని బీఆర్ఎస్ గ్రూపులు తల‌నొప్పిగా మారాయ‌ట‌. ఆ జిల్లాలోని ఆరు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉన్న గ్రూపు విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇటీవ‌ల సూర్యాపేటలో కేసీఆర్ స‌భ‌ను నిర్వ‌హించారు. అక్క‌డ నుంచి ఎన్నిక‌ల శంఖారావాన్ని పూరించారు. ఆ స‌భ‌కు మంత్రి జ‌గ‌దీశ్వ‌రెడ్డి అన్నీ తానై క‌నిపించారు. గ‌త కొన్నేళ్లుగా ఆయ‌న‌కు మ‌ద్ధ‌తుగా నిలిచిన వ‌ట్టే జాన‌య్య ఎక్క‌డా క‌నిపించ‌లేదు. ఉమ్మ‌డి న‌ల్గొండ డీసీఎంఎస్ చైర్మ‌న్ గా ప‌నిచేసిన జాన‌య్య సూర్యాపేట వేదిక‌గా అనుచ‌ర‌గ‌ణం ఉంది. కానీ, ఇప్పుడు ఆయ‌న మంత్రి జ‌గ‌దీశ్వ‌ర‌రెడ్డి నాయ‌క‌త్వాన్ని వ్య‌తిరేకిస్తూ దూరం జ‌రిగారు.

కేసీఆర్ కు న‌ల్గొండలోని బీఆర్ఎస్ గ్రూపులు తల‌నొప్పి (KCR Politics)

న‌ల్లొండ జిల్లాలోని న‌కిరికేల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే చిరుమ‌ర్తి లింగయ్య ఈసారి కూడా బ‌రిలోకి దిగుతున్నారు. దీంతో అదే పార్టీలో టిక్కెట్ ను ఆశించిన వీరేశం బీఆర్ఎస్ పార్టీకి (KCR Politics)గుడ్ బై చెప్పారు. ఆయ‌న‌కంటూ ఆ నియోజ‌క‌వ‌ర్గంలో బ‌ల‌మైన గ్రూప్ ఉంది. ఇపుడు బీఆర్ఎస్ పార్టీకి దూరం అయ్యారు. కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకోవ‌డానికి రెడీ అయ్యారు. అటు వీరశం ఇటు లింగ‌య్య ఇద్ద‌రూ ఒక‌ప్పుడు కోమ‌టిరెడ్డి వెంక‌టరెడ్డి అనుచ‌రులు. ఆయ‌న నీడ‌లో రాజ‌కీయాలు చేసిన లీడ‌ర్లు. ఇప్పుడు వీర‌శం కోమ‌టిరెడ్డి పక్షానికి చేరుకున్నారు. ఇటీవ‌ల కాంగ్రెస్ పార్టీలో చేరిన పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి అండ‌తో కాంగ్రెస్ టిక్కెట్ పొంద‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

టిక్కెట్ ను ఆశించిన వీరేశం బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై

కోదాడ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బొల్లం మ‌ల్ల‌య్య యాదవ్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డానికి లైన్ క్లియ‌ర్ అయింది. దీంతో అక్క‌డి సీనియ‌ర్ లీడ‌ర్ చంద్ర‌రావు, గ‌త ఎన్నిక‌ల్లో పోటీచేసి ఓడిన శ‌శిధ‌ర్ రెడ్డి బీఆర్ఎస్ మీద అసంతృప్తిగా ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేకు వ్య‌తిరేకంగా మూకుమ్మ‌డి రాజీనామాల‌కు సిద్ధ‌ప‌డుతున్నారు. మాజీ డీసీసీబీ పాండురంగారావు, మున్సిప‌ల్ చైర్మ‌న్ శిరీష్ ల‌క్ష్మీనారాయ‌న్, ఎంపీటీసీ, జ‌డ్పీసీలు ప్ర‌స్తుతం సంత‌కాల‌ను సిట్టింగ్ ఎమ్మెల్యేకు వ్య‌తిరేకంగా సేక‌రిస్తున్నారు. త్వ‌రలోనే కేసీఆర్ వ‌ద్ద (KCR Politics) పంచాయ‌తీ పెట్ట‌డానికి రెడీ అయ్యారు.

సిట్టింగ్ ఎమ్మెల్యేకు వ్య‌తిరేకంగా మూకుమ్మ‌డి రాజీనామాల‌కు

ఇక ఎస్టీ నియోజ‌క‌వ‌ర్గంగా ఉన్న దేవ‌రకొండ సిట్టింగ్ ఎమ్మెల్యే ర‌వీంద్ర‌కుమార్ మీద ద్వితీయ‌శ్రేణి మండిప‌డుతోంది. మ‌రోసారి ఆయ‌న‌కు పోటీ చేయ‌డానికి అవ‌కాశం ఇచ్చిన కేసీఆర్ మీద (KCR Politics) ఆగ్ర‌హంగా ఉన్నారు. టిక్కెట్ ఆశిస్తోన్న దేవేంద‌ర్ నాయ‌క్ తో పాటు మున్సిప‌ల్ చైర్మ‌న్ న‌ర‌సింహ‌, ఎంపీపీ జానీ సిట్టింగ్ ఎమ్మెల్యే మీద వ్య‌తిరేకంగా ఉన్నారు. బహిరంగ స‌భ‌ల పెడుతూ ర‌వీంద్ర కుమార్ కు వ్య‌తిరేకంగా గ‌ళం విప్పుతున్నారు. ఇక న‌ల్గొండ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కంచ‌ర్ల భూపాల్ రెడ్డి మీద బీఆర్ఎస్ పార్టీలోని ఒక గ్రూప్ వ్య‌తిరేకంగా ఉంది. వాస్త‌వంగా ఈసారి టిక్కెట్ ను ఆశిస్తూ ఆర్ కేఎస్ పౌండేష‌న్ పిల్లిరాజు యాద‌వ్ ప‌లు సేవా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించారు. ఆయ‌న కోట్లాది రూపాయలు ఖ‌ర్చు పెట్టారు. బీఆర్ఎస్ అధిష్టానం ఇచ్చిన భ‌రోసాతో పెద్ద ఎత్తున ఖ‌ర్చుపెడుతూ ప్ర‌జ‌ల మ‌ధ్య ఉన్నారు. ప్ర‌స్తుతం ఇండిపెండెంట్ గా వేయ‌డానికి పిల్లిరాజు యాద‌వ్ డిసైడ్ అయ్యారు.

Also Read : KCR Secret Operation : కేసీఆర్ సీక్రెట్ ఆపరేషన్..నిజమెంత..?

న‌ల్గగొండ జిల్లా నాగార్జున సాగర్ సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల భ‌ర‌త్ మ‌రోసారి పోటీ చేయ‌బోతున్నారు. ఆయ‌న స్థానికేతురుడ‌ని బీఆర్ఎస్ లీడ‌ర్ క‌డారి అంజ‌య్య యాద‌వ్ గుర్రంపోడులో ఏకంగా స‌మావేశం పెట్టారు. ఎంపీసీ, జ‌డ్సీల మ‌ద్ధ‌తును కూడా గ‌ట్టారు. స్థానికేతురుడు భ‌ర‌త్ బ‌దులు త‌న‌కు టిక్కెట్ ఇవ్వాల‌ని కేసీఆర్ కు అల్టిమేటం ఇస్తున్నారు. లేదంటే స్వ‌తంత్ర్య అభ్య‌ర్థిగా పోటీ చేస్తాన‌ని హెచ్చ‌రిస్తున్నారు. ఇక ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గంగా ఉన్న తుంగ‌తుర్తిలో ఈసారి బీఆర్ ఎస్ పార్టీకి త‌ల‌నొప్పిగా మారింది. రెండుసార్లు వ‌రుస‌గా గెలిచిన ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే గాద‌రి కిషోర్ పోటీ దిగుతున్నారు. టిక్కెట్ ను ఆశించిన తిరుమ‌ల‌గిరి మున్సిప‌ల్ చైర్మ‌న్ ర‌జ‌నీ బీఆర్ఎస్ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్నారు. గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మ‌న్ సామేలు ఏకంగా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఇండిపెండెంట్ గా పోటీ చేయ‌డానికి సిద్ద‌మ‌య్యారు.

Also Read : BRS: కేసీఆర్ కు తలనొప్పిగా మారిన పల్లా కామెంట్స్.. జనగాంపై ఉత్కంఠ ..

మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీలోని గ్రూపు రాజ‌కీయాలు ఆ పార్టీ విజ‌యాన్ని న‌ల్గొండ జిల్లా రాజ‌కీయం మ‌లుపుతిప్పేలా కనిపిస్తోంది. ఇప్ప‌టికే రెబ‌ల్స్ ను బుజ్జ‌గించే ప్ర‌య‌త్నం ప్ర‌గ‌తిభ‌వ‌న్ వ‌ర్గాలు చేస్తున్నాయి. కానీ, ఆశించిన స్థాయిలో ఫ‌లించ‌డంలేదు. ప్ర‌త్యామ్నాయంగా కాంగ్రెస్, బీజేపీ వైపు చూస్తోన్న లీడ‌ర్ల బీఆర్ఎస్ అధిష్టానం మాట వినే ప‌రిస్థితి లేద‌ని తెలుస్తోంది.