Site icon HashtagU Telugu

TRS National Party: కేసీఆర్ ఆ లాజిక్ మిస్సయితే.. జాతీయ పార్టీ కష్టమేనా?

Kcr

Kcr

తెలంగాణ ఉద్యమం నుంచి పుట్టుకు వచ్చిందే తెలంగాణ రాష్ట్ర సమితి. ఉద్యమాన్ని బలంగా నడపబట్టి.. తెలంగాణ సాధనలో ముందుండబట్టి టీఆర్ఎస్ కు అధికారం దక్కింది. కేసీఆర్ రెండుసార్లు ముఖ్యమంత్రి కాగలిగారు. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలంటే టీఆర్ఎస్ ముందు కొన్ని సవాళ్లు ఉన్నాయి. అందుకే ఆయన ఇప్పుడు జాతీయ రాజకీయాలపై కొన్నాళ్లుగా ఆసక్తి చూపిస్తున్నారన్న విమర్శ ఉంది.

టీఆర్ఎస్ ఇక్కడ గెలవడానికి.. జాతీయ రాజకీయాలపై కేసీఆర్ ఆసక్తికి ముడి ఏమిటి అని చాలామంది అనుకోవచ్చు. కానీ లాజిక్ అక్కడే ఉంది. ఇక్కడ కొన్నాళ్లుగా కారుకు ఎదురుగాలి వీస్తోందన్న ఆరోపణలున్నాయి. ప్రశాంత్ కిషోర్ సర్వేల్లోనూ ఇదే తేలిందట. అందుకే గులాబీ బాస్ వెంటనే కొత్త ఎత్తుగడకు ప్లాన్ చేశారని.. అందులో భాగంగానే.. భారత రాష్ట్ర సమితి పేరుతో జాతీయ పార్టీపై లీకులు ఇస్తున్నారంటున్నారు ప్రత్యర్థులు.

కానీ జాతీయ పార్టీ పెట్టాలంటే మాటలు కాదు. కొన్నాళ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం నేషనల్ మీడియాలో చేస్తున్న ప్రచారం వల్ల దేశాన్ని అది ఆకర్షించి ఉండొచ్చు. కానీ టీఆర్ఎస్ కు అది ఓట్లు తెచ్చిపెడుతుందని చెప్పలేం. ఇక సౌత్ లో, నార్త్ లో ఏ రాష్ట్రంలోనూ ఆయనకు పూర్తిగా పట్టు లేదు. ఆయన గురించి పూర్తిగా తెలిసినవారు కూడా తక్కువ. టీఆర్ఎస్ పథకాలను కోరుకున్నంత మాత్రాన.. టీఆర్ఎస్ ను కోరుకుంటున్నారని అర్థం కాదంటున్నారు ప్రత్యర్థులు.

Exit mobile version