KCR: గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరుల స్థూపానికి పుష్పాంజలి ఘటించి కొవ్వొత్తితో జ్యోతిని వెలిగించి ఘన నివాళి అర్పించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కొవ్వొత్తిని వెలిగించి అమరజ్యోతుల (కొవ్వొత్తుల) ర్యాలీనీ ట్యాంక్ బండ్ వద్దగల అమర జ్యోతి వరకు ప్రారంభించారు. ఈ ర్యాలీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
అయితే అంతకుముందు కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు. తెలంగాణాలో వేలాది మంది అమరులు అయ్యింది ఎవరి వల్ల? అమరులస్తూపం నిర్మించాల్సి వచ్చింది ఎవరివల్ల? 1952 లోనే ఉమ్మడి రాష్ట్రం వద్దని, హైదరాబాద్ స్టేట్ ప్రత్యేక రాష్ట్రంగానే ఉండాలని పోరాటం చేస్తున్న విద్యార్ధులపై సిటీ కాలేజీ వద్ద కాల్పులు జరిపి 6 మందిని బలిగొన్నది ఎవరు? అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.