మాజీ సీఎం, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) మరోసారి ప్రజాక్షేత్రంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. రైతు రుణమాఫీ, రైతు భరోసా అంశాలతో ప్రజల్లోకి రానున్నారని BRS శ్రేణులు అంటున్నాయి. సభలు లేదా కార్నర్ మీటింగ్లు పెట్టాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి రేపు సాయంత్రం షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది.
We’re now on WhatsApp. Click to Join.
అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓటమి చెందడం..కీలక నేతలంతా పార్టీని వీడడం..ఇదే క్రమంలో ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత కు బెయిల్ రాకుండా ఉండడం..ముఖ్యంగా ఎంపీ ఎన్నికల్లో కనీసం ఖాతా కూడా తెరువకపోయేసరికి కేసీఆర్ పూర్తిగా డల్ అయ్యాడు. ప్రజల్లోకి వెళ్లాలని ట్రై చేసినప్పటికీ..ఇలా వరుస నిరాశల నేపథ్యంలో కేసీఆర్ ముందడుగు వేయలేకయాడు. కానీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ఫై వ్యతిరేకత పెరిగిపోతుండటం..రుణమాఫీ పూర్తిగా అమలు కాకపోవడంతో దీనిని బిఆర్ఎస్ క్యాష్ చేసుకోవాలని చూస్తుంది. ఇదే క్రమంలో ఇప్పుడు లిక్కర్ కేసులో కవిత సైతం బయటకు రావడం తో బిఆర్ఎస్ కు మరింత బలం చేకూరినట్లు అయ్యింది. అందుకే ఇక నుండి పూర్తిగా కేసీఆర్ ప్రజల్లో ఉండాలని డిసైడ్ అయినట్లు పార్టీ వర్గాలు చెపుతున్నాయి.
రైతు రుణమాఫీ, రైతు భరోసా అంశాలతో కేసీఆర్ ప్రజల్లోకి రానున్నారని BRS శ్రేణులు అంటున్నాయి. సభలు లేదా కార్నర్ మీటింగ్లు పెట్టాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి రేపు సాయంత్రం షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు.
Read Also : Kannayyanayudu : ఏపీ ప్రభుత్వ సలహాదారుడిగా కన్నయ్య నాయుడు