KCR on Kavitha Case: కవిత అరెస్ట్ పై కేసీఆర్, 99 శాతం ఫిక్స్!

రాజకీయాలు చేయటంలో ఆరితేరిన కేసీఆర్ బీ ఆర్ ఎస్ ను కాపాడుకునే ప్రయత్నం మొదలుపెట్టారు. బీజేపీ ఆపరేషన్ కు చిక్కకుండా 99 శాతం ఎమ్మెల్యే లకు టికెట్స్

  • Written By:
  • Updated On - March 11, 2023 / 09:13 AM IST

రాజకీయాలు చేయటంలో ఆరితేరిన KCR బీ ఆర్ ఎస్ ను కాపాడుకునే ప్రయత్నం మొదలుపెట్టారు. బీజేపీ ఆపరేషన్ కు చిక్కకుండా 99 శాతం ఎమ్మెల్యే లకు టికెట్స్ ఇస్తానని హామీ ఇచ్చారు. కనీసం 50 మందిని మార్చకపోతే మూడోసారి గెలుపు అసాధ్యమని సర్వే ఉందని ఇప్పటి వరకు ప్రచారం జరిగింది. దానికి భిన్నంగా కేసీఆర్ 99 శాతం సిట్టింగులకు టికెట్స్ ఇస్తానని చెప్పటం గేమ్ లో భాగం. అంతే కాదు కవిత అరెస్ట్ ను ఆయన దాదాపుగా ధ్రువీకరించారు. అలాంటి సంకేతాలు ఇస్తూ సిట్టింగ్ల ప్రస్తావన తీసుకొచ్చారు. అంటే , కొందరు బీజేపీ ఆపరేషన్ లో ఉన్నారని గ్రహించారు. కవిత అరెస్ట్ తరువాత పార్టీ లో జరిగే కల్లోలాన్ని KCR ముందుగా పసిగట్టారు. ఆ అరెస్ట్ ను చూపి ఇతర పార్టీలకు వెళ్లే వాళ్ళ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అందుకే కవిత అరెస్ట్ కు లింకు పెడుతూ ఎమ్యెల్యే లను కాపాడుకునే స్కెచ్ వేశారు.

కవితను కచ్చితంగా అరెస్ట్ చేస్తారని కేసీయారే నోటి నుంచి సంకేతాలు రావటం సంచలనం రేగింది. నా బిడ్డ దాకా వచ్చారంటే అంటూ ఆయన బీజేపీ నేతల మీద మండిపోతున్నారు. అరెస్ట్ చేసి కవితను ఇబ్బంది పెట్టవచ్చు. అలా చేస్తే చేసుకోనివ్వండి అంటూg కేసీయార్ పార్టీ సమావేశంలో కీలక కామెంట్స్ చేయడం ఇపుడు చర్చనీయాంశం అవుతోంది. కవితను కేసులో ఇరికిస్తున్నారు అని కేసీయార్ అంటున్నారు. ఇలా చాలా మందిని అరెస్ట్ చేస్తున్నారు. ఈ అరెస్టులకు ఎవరూ భయపడేది లేదని కేసీయార్ చెబుతున్నారు. న్యాయపోరాటం చేస్తామని కేసీయార్ బీజేపీ పెద్దలను హెచ్చరించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకుండా చూస్తామని ఆయన స్పష్టమైన సవాల్ కూడా చేశారు. తెలంగాణాలో మళ్ళీ గెలిచేది బీయారెస్ నే అని కేసీయార్ స్పష్టం చేశారు. ఆ తరువాత బీజేపీ పని పడతామని ఆయన అంటున్నారు.

మొత్తానికి చూస్తే కవిత అరెస్ట్ విషయంలో కేసీయార్ క్లారిటీ ఇచ్చాక ఇక అరెస్ట్ కావడం లాంచనమేనా అన్న చర్చ వస్తోంది. తెలంగాణాలో బీజేపీ రాజకీయ క్రీడలో ఈ దర్యాప్తులు అరెస్టులు కూడా భాగం అవుతున్నాయా అన్నది కూడా ఆలోచనలోకి వస్తోంది.బీజేపీ తెలంగాణాలో అధికారంలోకి రావాలని చూస్తోంది. మరో వైపు బీయారెస్ ని పెట్టడం ద్వారా కేంద్రంతో ఢీ కొట్టడానికి కేసీయార్ చూస్తున్నారు. ఆ క్రమంలో కవిత అరెస్ట్ , బీజేపీకి ప్లస్ అవుతుందా?లేక బీయారెస్ దాన్ని రాజకీయ ఆయుధంగా మలచుకుంటుందా?అన్నది పెద్ద ప్రశ్న.

తెలంగాణాలో సార్వత్రిక ఎన్నికలకు కేవలం ఎనిమిది నెలలు మాత్రమే సమయం ఉన్న నేపధ్యంలో బీయారెస్ అధినేత కుమార్తె కవిత అరెస్ట్ కావడం చిన్న విషయం కాదు. దాన్ని అనుకూలంగా మార్చుకునే విధంగా కేసీయార్ బీయారెస్ నేతలు గట్టి వ్యూహాలే రచిస్తారు. ఈ ఎపిసోడ్ కేసీయార్ రాజకీయ జీవితంలో అతి పెద్ద సంచలనం. ఆయన కుమార్తె అరెస్ట్ విషయం కొద్ది గంటలలో తేలిపోతుంది. అప్పుడు కేసీఆర్ వేసే ఎత్తుగడ ఏమిటీ అనేది చూడాలి. ఇప్పటి వరకు కవిత అరెస్ట్ దాదాపుగా ఖాయంగా ఆయన భావిస్తున్నారు. అందుకే పార్టీని కాపాడుకునే ఎత్తుగడ 99 శాతం సిట్టింగులకు అనే స్టేట్మెంట్ కనిపిస్తుంది.

Also Read:  Snoring Problem: గురక సమస్యకు ఈ చిట్కాలు పాటించండి..