Site icon HashtagU Telugu

MLC Kavitha: 22 ల్యాండ్ క్రూజర్‌ కార్ల కొనుగోలులో కేసీఆర్ కు సంబంధం లేదు: ఎమ్మెల్సీ కవిత

Mlc Kavitha

Mlc Kavitha

MLC Kavitha: హైదరాబాద్: కె చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందనే కారణంతో బిఆర్‌ఎస్ ప్రభుత్వం 22 టయోటా ల్యాండ్ క్రూజర్ వాహనాలను కొనుగోలు చేసిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత శనివారం తప్పుబట్టారు. వరంగల్‌లో కవిత విలేకరులతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి, ఇతర వీవీఐపీల భద్రతా ఏర్పాట్లను పోలీసులు, ఇతర భద్రతా సంస్థలు చూస్తాయన్నారు.

అందులో రాజకీయ నాయకుల పాత్ర లేదని అన్నారు. “అంతిమంగా ఏదైనా ముఖ్యమంత్రి ప్రోటోకాల్‌ను భద్రతా విభాగం, ఇంటెలిజెన్స్, పోలీసులు నిర్ణయిస్తారు. ఇందులో రాజకీయ నాయకుల పాత్ర ఏమీ లేదు. వాహనాల కొనుగోలు ముందే జరిగిందని, ప్రస్తుత సిఎం (రేవంత్ రెడ్డి) అలా అనుకోవడం దురదృష్టకరం”అని ఆమె విలేకరులతో  అన్నారు.

కాాగా ఇటీవలనే రేవంత్ రెడ్డి.. BRS ప్రభుత్వం 22 ల్యాండ్ క్రూజర్ వాహనాలను కొనుగోలు చేసి విజయవాడలో ఉంచినట్లు ఆరోపించారని, గత 10 ఏళ్లలో పోలీసులు తమకు ఎలాంటి భద్రత కల్పించాలని నేతలు ఎప్పుడూ పట్టుబట్టలేదని ఆమె అన్నారు. “ముఖ్యమంత్రి దానిని ఒక సమస్యను చేసి చిన్నచూపు చూడటం సరికాదు” అని ఆమె అభిప్రాయపడ్డారు. గిరిజనుల పండుగైన సమ్మక్క సారమ్మ జాతరను దక్షిణ భారత కుంభమేళాగా అభివర్ణిస్తూ జాతీయ పండుగ హోదా కల్పించాలని ప్రధాని నరేంద్ర మోదీని డిమాండ్ చేశా, ఈ విషయమై ప్రధాని మోదీకి పలుమార్లు ఫిర్యాదులు చేశామని ఆమె తెలిపారు

Exit mobile version