Lok Sabha Polls 2024; హైదరాబాద్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్‌ యాదవ్‌

లోక్‌సభ ఎన్నికలకు గానూ బీఆర్‌ఎస్‌ తమ అభ్యర్థుల్ని ప్రకటించింది. ఇప్పటికే 16 స్థానాలకు అభ్యర్థులను ఖరాలు చేసిన కేసీఆర్‌.. తాజాగా హైదరాబాద్‌ లోక్‌సభ స్థానానికి కూడా అభ్యర్థిని ఫైనల్‌ చేశారు.

Lok Sabha Polls 2024; లోక్‌సభ ఎన్నికలకు గానూ బీఆర్‌ఎస్‌ తమ అభ్యర్థుల్ని ప్రకటించింది. ఇప్పటికే 16 స్థానాలకు అభ్యర్థులను ఖరాలు చేసిన కేసీఆర్‌.. తాజాగా హైదరాబాద్‌ లోక్‌సభ స్థానానికి కూడా అభ్యర్థిని ఫైనల్‌ చేశారు. ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులతో చర్చించిన తర్వాత కేసీఆర్‌ హైదరాబాద్‌ లోక్‌సభ స్థానానికి గడ్డం శ్రీనివాస్‌ను ఫైనల్ చేశారు. దీంతో రాష్ట్రంలోని మొత్తం పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన పార్టీగా నిలిచింది. అటు కాంగ్రెస్, బీజేపీ మాత్రం ఇంకా అభ్యర్థుల వేటలోనే ఉన్నారు.

గడ్డం శ్రీనివాస్ యాదవ్ అక్టోబర్ 28, 1968న గోషామహల్‌లోని గౌలిగూడ చమన్‌లో జన్మించారు. అతని రాజకీయ జీవితం 1988లో నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI)తో ప్రారంభమైంది. అతను 2021లో బీఆర్ఎస్ లో చేరాడు. 2023లో గోషామహల్ అసెంబ్లీ స్థానానికి టికెట్ ఆశించాడు. అయితే రాజా సింగ్ చేతిలో ఓడిపోయిన నంద్ కిషోర్ వ్యాస్‌ను పార్టీ నామినేట్ చేసింది. మరోవైపు ఏఐఎంఐఎం పార్టీ నుంచి అధ్యక్షుడు, ప్రస్తుత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, బీజేపీ నుంచి మాధవి లతపై పోటీ చేయనున్నారు.

బీఆర్‌ఎస్‌ పార్లమెంట్‌ అభ్యర్థులు..
ఆదిలాబాద్‌- ఆత్రం సక్కు
మల్కాజిగిరి- రాగిడి లక్ష్మారెడ్డి
ఖమ్మం- నామా నాగేశ్వర్‌రావు
మహబూబాబాద్‌- మాలోత్‌ కవిత
కరీంనగర్‌- బోయినపల్లి వినోద్‌ కుమార్‌
పెద్దపల్లి- కొప్పుల ఈశ్వర్‌
మహబూబ్‌నగర్‌- మన్నె శ్రీనివాస్‌రెడ్డి
చేవెళ్ల- కాసాని జ్ఞానేశ్వర్‌
వరంగల్‌- కడియం కావ్య
జహీరాబాద్‌- గాలి అనిల్‌కుమార్‌
నిజామాబాద్‌- బాజిరెడ్డి గోవర్ధన్‌
సికింద్రాబాద్‌- పద్మారావుగౌడ్‌
నాగర్‌కర్నూల్‌- ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌
భువనగిరి- క్యామ మల్లేశ్‌
నల్లగొండ- కంచర్ల కృష్ణారెడ్డి
మెదక్‌- వెంకట్రామిరెడ్డి
హైదరాబాద్‌- గడ్డం శ్రీనివాస్‌ యాదవ్‌

Also Read: Indraja Shankar: ఆ డైరెక్టర్ ను పెళ్లి చేసుకున్న విజిల్ సినిమా నటి.. ఫోటోస్ వైరల్?