KCR : నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల పరిహారం ఇవ్వాలి – కేసీఆర్ డిమాండ్

'రైతుల తరఫున మాట్లాడేవారు లేరనుకుంటున్నారా? మేమున్నాం. ప్రభుత్వం మెడలు వంచుతాం. లక్ష ఎకరాల్లో పంట పోయింది. ఈ మంత్రులు, సీఎం ఏం చేస్తున్నారు? ఎండిపోయిన పంటకు ఎకరాకు రూ. 25వేల నష్టపరిహారం ఇవ్వాల్సిందే. అప్పటి వరకు వేటాడుతాం. వెంటాడుతాం.

  • Written By:
  • Publish Date - March 31, 2024 / 07:01 PM IST

బిఆర్ఎస్ అధినేత , మాజీ సీఎం కేసీఆర్‌ (KCR) ఆదివారం పొలంబాట పట్టారు. రైతుకు బాసటగా నిలిచేందుకు, కాంగ్రెస్‌ పాలనలో అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకునేందుకు జనగామ, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో కేసీఆర్ పర్యటించి ఎండిపోయిన పంట ను దగ్గర ఉండి పరిశీలించి , రైతుల కష్టాలను అడిగితెలుసుకున్నారు. పర్యటన అనంతరం నల్గొండ, సూర్యాపేట జిల్లాలో ఏర్పటు చేసిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ.. ఎండిపోయిన పంటలతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎకరాకు రూ.25 వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసారు. ‘రైతుల తరఫున మాట్లాడేవారు లేరనుకుంటున్నారా? మేమున్నాం. ప్రభుత్వం మెడలు వంచుతాం. లక్ష ఎకరాల్లో పంట పోయింది. ఈ మంత్రులు, సీఎం ఏం చేస్తున్నారు? ఎండిపోయిన పంటకు ఎకరాకు రూ. 25వేల నష్టపరిహారం ఇవ్వాల్సిందే. అప్పటి వరకు వేటాడుతాం. వెంటాడుతాం. ఎక్కడికక్కడ మిమ్మల్ని ప్రశ్నిస్తాం’ అని తేల్చిచెప్పారు.

We’re now on WhatsApp. Click to Join.

‘మేం పదేళ్లు రైతులను బ్రహ్మండంగా చూసుకున్నం. ఇప్పుడు వాళ్ల కండ్ల పొంటి నీళ్లు వస్తుంటే ఎట్ల చూడాలె. వాళ్లు బాధలు పడుతుంటే చూసి ఎట్ల ఊకోవాలె. ఇప్పుడే ఇట్లుంటే ముందుముందు ఎట్లుంటదని రైతులు భయాందోళన చెందుతున్నరు. అందుకే వాళ్లపక్షాన మేం నిలబడ్డం. డిసెంబర్‌ 9న రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తమన్నరు. డిసెంబర్‌ 9 పొయ్యి ఎన్నాళ్లయ్యింది..? ముఖ్యమంత్రి ఎక్కడున్నరు..? మీరు దొంగ హామీలు ఇచ్చి తప్పించుకోలేరు. మేం వెంటపడి తరుముతం. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేదాక ఇడిసిపెట్టేది లేదు. బ్యాంకులోళ్లు రైతుల ముక్కుపిండి రుణాలు వసూలు చేస్తున్నరు. మీకు బాధ లేదా..? కనీసం రైతుల దుస్థితి గురించి ఆలోచనైనా చేస్తున్నరా..? రైతుల పక్షాన ఎవడు మాట్లాడెటోడు లేడు, అడిగేటోడు లేడని మీరు అనుకుంటున్నరా..?’ అని కేసీఆర్‌ ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్రంలో పంటలు ఎండిపోవడానికి కారణం మీరు. కరెంటు లో వోల్టేజ్‌ సరఫరాకు కారణం మీరు. మీకంటే ముందు ఎనిమిదేండ్లు మేం బ్రహ్మాండంగా కరెంటు ఇచ్చినం. ఎనిమిదేండ్లు ఇచ్చిన కరెంటు ఇప్పుడెట్ల మాయమైంది’ అని కేసీఆర్‌ ప్రశ్నించారు.

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 100 రోజుల వ్యవధిలోనే రైతులు ఏడ్చే పరిస్థితికి వెళ్తారని తాను అనుకోలేదని అన్నారు. తమకు అందిన సమాచారం ప్రకారం 100 రోజుల్లోనే 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు తెలిపారు. ఈ పరిస్థితికి ప్రభుత్వ వైఖరి కారణమని దుయ్యబట్టారు. అనేక జిల్లాల్లో పంటలు ఎండిపోయాయని దుయ్యబట్టారు. నేను రైతులకు చేతులెత్తి దండం పెట్టి చెబుతున్నా. రైతులు ఎట్టి పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకోవద్దు. మీ కోసం బీఆర్‌ఎస్‌ పార్టీ రణరంగమైనా సృష్టిస్తది. ప్రధాన ప్రతిపక్షంగా మీరు మాకు బాధ్యత ఇచ్చారు. కానీ ఎమ్మటే మాట్లాడితే ఓర్వలేని తనం అంటరని ఓపిక పట్టిన. ఇప్పుడు నాలుగో నెల వచ్చింది. లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నయ్‌ కాబట్టి చూస్తూ ఊరుకోలేక వచ్చిన’ అన్నారు. అదేవిధంగా వాగ్ధానలు ఎగవెడితే ఊరుకునేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ‘మీరు వాగ్ధానాలను ఎగవెట్టి ఊరేగుదాం అనుకుంటున్నరా..? వాగ్ధానాలు ఎగవెడితే బిడ్డా నిద్ర గూడ పోనియ్యం చెప్తున్నా’ అని కేసీఆర్‌ హెచ్చరించారు.

Read Also : TDP : టీడీపీ మళ్లీ తన కోటను కైవసం చేసుకుంటుందా..?