Site icon HashtagU Telugu

KCR : రేపటి నుండి పార్టీ నేతలతో కేసీఆర్ సమావేశాలు

KCR Comments

KCR Comments

బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ..దూకుడు పెంచాలని చూస్తున్నారు. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందడం..పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం ఖాతా తెరువక పోవడం..గెలిచినా కొద్దీ మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరుతుండడంతో ఇంకా సైలెంట్ గా ఉంటె మొదటికే మోసం వస్తుందని గ్రహించిన కేసీఆర్..ఉన్న కొద్దీ మందిని కాపాడుకునే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా రేపటి నుండి వరుసగా పార్టీ ఎమ్మెల్యేలతో , నేతలతో సమావేశం కాబోతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, కేపీ వివేకానంద గౌడ్‌, మాగంటి గోపీనాథ్‌, ముఠా గోపాల్‌, మాధవరం కృష్ణారావు, అరికెపూడి గాంధీ, ప్రకాశ్‌గౌడ్‌, ఎమ్మెల్సీలు శేరి సుభాశ్‌ రెడ్డి, దండె విఠల్‌, మాజీ ఎమ్మెల్యేలు జోగు రామన్న, నాయకులు క్యామ మల్లేశ్‌, రావుల శ్రీధర్‌ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారితో కలిసి లంచ్‌ చేసిన కేసీఆర్‌.. బీఆర్‌ఎస్‌ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై చర్చించారు. ఎవరూ తొందరపడొద్దని సూచించారు.

మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి పార్టీ మారడాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని సూచించారు. కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారినంత మాత్రాన బీఆర్‌ఎస్‌కు వచ్చే నష్టం ఏమీ లేదని స్పష్టం చేశారు. రేపట్నుంచి వరుసగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీలు ఉంటాయని స్పష్టం చేశారు.

Read Also : Jagan : అసెంబ్లీలో తనను అవమానించారంటూ స్పీకర్‌కు జగన్ లేఖ..