Site icon HashtagU Telugu

CM KCR: ప్రధాని పర్యటనకు కేసీఆర్ దూరం!

Kcr And Modi

Kcr And Modi

ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ మధ్య దూరం మరింత పెరిగిపోయిందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గతంలో ప్రధాని మోడీ రెండు సార్లు హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. ప్రోటోకాల్ ప్రకారం సీఎం కేసీఆర్ కూడా అటెండ్ కావాల్సి ఉంటుంది. కానీ కేసీఆర్ అందుబాటులో లేకుండా ముఖం చాటేశారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ వచ్చే నెలలో హైదరాబాద్ భారీ రోడ్ షో నిర్వహించనున్న విషయం తెలిసిందే. అయితే మోడీ పర్యటన సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు హైదరాబాద్‌లో ఉండకపోవచ్చు. జులై 1 నుంచి వివిధ రాష్ట్రాల్లో పర్యటించాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. గతంలో కూడా కేసీఆర్ ప్రధానితో స్టేజీ షేర్ చేసుకోకుండా చాకచాక్యంగా తప్పించుకున్నారు.

సీఎం కేసీఆర్ పశ్చిమ బెంగాల్, బీహార్ ఇతర రాష్ట్రాలను జూలై 1- 3 వరకు సందర్శించాలని యోచిస్తున్నారు. రాష్ట్రాల పర్యటనలో కేసీఆర్ ప్రాంతీయ నాయకులను కలిసే అవకాశం ఉంది. తొలుత ప్రధాని నరేంద్ర మోదీ తమ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశానికి హాజరవుతారని ముందుగానే నిర్ణయమైంది. ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి అటువంటి సందర్భంలో ప్రధానమంత్రిని కలవాల్సిన బాధ్యత లేదు. ప్రధానమంత్రి రాజ్‌భవన్‌లో బస చేసినట్లయితే, అతని పర్యటన అధికారికంగా పరిగణించబడుతుంది. అందువల్ల ముఖ్యమంత్రి రాజ్‌భవన్‌లో ఆయనను సందర్శించవలసి ఉంటుంది. ప్రధానిని కలవకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి ఉత్తరాది రాష్ట్రాల్లో పర్యటనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.