CM KCR Kondagattu Tour: కేసీఆర్ కొండగట్టు పర్యటన వాయిదా..!

సీఎం కేసీఆర్ (CM KCR) మంగళవారం (ఫిబ్రవరి 14) కొండగట్టు పుణ్యక్షేత్రాన్ని సందర్శించాలనుకున్న

Published By: HashtagU Telugu Desk
KCR Kondagattu tour postponed..!

Kcr

సీఎం కేసీఆర్ మంగళవారం (ఫిబ్రవరి 14) కొండగట్టు (Kondagattu) పుణ్యక్షేత్రాన్ని సందర్శించాలనుకున్న సంగతి తెలిసిందే. అయితే కొండగట్టులో ఆయన పర్యటన వాయిదా పడింది. కేసీఆర్ తన పర్యటనను ఎల్లుండికి మార్చుకున్నారు. మంగళవారం కొండగట్టులో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందన్న కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఆలయ పునర్ నిర్మాణం కోసం క్షేత్రస్థాయిలో ఆలయాన్ని పరిశీలించనున్నారు. అయితే, భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే మంగళవారం రోజున ఆలయ పర్యటన ఇబ్బందికరంగా ఉంటుందని సీఎంవో భావించింది. సీఎం రాకతో భక్తులకు అసౌకర్యం కలగకూడదనే ఈ పర్యటన వాయిదా నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ సర్కారు ఇటీవలి బడ్జెట్ లో కొండగట్టు (Kondagattu) క్షేత్రం అభివృద్ధి కోసం రూ.100 కోట్లు కేటాయించడం తెలిసిందే.

Also Read:  Pain Killers: మన వంటింట్లోనే ఉండే 11 పెయిన్ కిల్లర్స్ ఇవే..!

  Last Updated: 13 Feb 2023, 06:21 PM IST