Site icon HashtagU Telugu

KCR Kokapeta : కోకాపేట `భూ`ధ‌ర‌ల్లో రాజ‌కీయ గేమ్, బినామీ టెండ‌ర్ల‌తో హైప్?

KCR Kokapeta

Kcr

తెలంగాణ రాజ‌కీయాన్ని రియ‌ల్ ఎస్టేట్ రేట్ల‌తో (KCR Kokapeta)హీటెక్కిస్తున్నారు కేసీఆర్. తెలంగాణ‌లో ఒక ఎక‌రం అమ్ముకుంటే ఏపీలో 100 ఎక‌రాల‌ను వ‌స్తుంద‌ని ఇటీవ‌ల వెల్ల‌డించారు. ప్ర‌తిగా ఏపీ మంత్రులు కూడా స్పందించారు. విశాఖ‌లో ఒక ఎక‌రం అమ్ముకుంటే తెలంగాణ‌లో 100 ఎక‌రాలు వ‌స్తుంద‌ని రాజ‌కీయాన్ని ర‌క్తిక‌ట్టించారు. ఈసారి ఎన్నిక‌ల్లో తెలంగాణ రియ‌ల్ ఎస్టేట్ ధ‌ర‌ల‌ను చూపించ‌డం ద్వారా మూడోసారి సీఎం కావాల‌ని కేసీఆర్ వ్యూహంగా క‌నిపిస్తోంది. అందుకే కోకాపేట భూముల ధ‌ర‌ల‌ను ఆకాశానికి లేపార‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. లేదంటే ఆ రేట్ల‌కు భూముల‌ను కొనుగోలు చేసే ప‌రిస్థితి ఇప్పుడు లేద‌ని ఆర్థిక‌, రియ‌ల్ ఎస్టేట్ నిపుణులు కొంద‌రు చెబుతున్నారు.

తెలంగాణ రాజ‌కీయాన్ని రియ‌ల్ ఎస్టేట్ రేట్ల‌తో (KCR Kokapeta)

గ‌త ఎనిమిదిన్న‌రేళ్ల‌లో రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారాన్ని సీఎం కేసీఆర్  (KCR Kokapeta)ప్రోత్స‌హిస్తున్నారు.అదే స‌మ‌యంలో టాప్ 10 కంపెనీల్లో క‌ల్వ‌కుంట్ల కుటుంబానికి బినామీల పేరుతో వాటాలు ఉన్నాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అందుకే, టాప్ 10 కంపెనీలు వెంచ‌ర్లు వేసినా, బిల్డింగ్ లు కట్టినా ఆ చుట్టు ప‌క్క‌ల ప్రాంతంలో అమాంతం అభివృద్ధి ప‌నులు జ‌రుగుతాయ‌ని చెబుతున్నారు. కొన్ని రియ‌ల్ ఎస్టేట్ సంస్థ‌ల‌కు అనుమ‌తులు నుంచి క‌నీస సౌక‌ర్యాల‌ను యుద్ధ ప్రాతిప‌దిక‌ను కేసీఆర్ ప్ర‌భుత్వం చేప‌డుతుంది. గ‌తంలోనూ హెచ్ ఎండీఏ వేలం సంద‌ర్భంగా రేట్ల‌ను పెంచుకోవ‌డానికి స‌ర్కార్ కొన్ని బినామీ పేర్ల‌తో టెండ‌ర్లను వేయించింద‌ని ఆరోప‌ణ‌లు లేక‌పోలేదు. ఇప్పుడు కోకా పేట భూముల ధ‌ర‌ల విష‌యంలోనూ ప్ర‌భుత్వం జిమ్మిక్కు ఉంద‌ని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.

కోకాపేట భూముల‌ను వేలం వేసి కృత్రిమ డిమాండ్ ను కేసీఆర్ స‌ర్కార్ క్రియేట్

వాస్త‌వంగా జీవో 111 ను ఎత్తివేసిన త‌రువాత హైద‌రాబాద్ చుట్టు ప‌క్క‌ల భూముల ధ‌ర‌లు అమాంతం త‌గ్గాయి. వాణిజ్య స్పేస్ డిమాండ్ కూడా త‌గ్గింది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఏర్ప‌డ్డ మాద్యం హైద‌రాబాద్ మీద ఎంతో కొంత ప‌డింది. మిగిలిన ప్రాంతాల కంటే త‌క్కువ అయిన‌ప్ప‌టికీ హైద‌రాబాద్ మీద మాంద్యం ప్ర‌భావం ఉంది. ఆ క్ర‌మంలో శివారుల్లో ఓపెన్ ప్లాట్ల ధ‌ర‌ల‌ను ఆమాంతం త‌గ్గిపోయాయి. నిర్మాణంలోని నివాస గృహాల‌ను అమ్ముకోలేని ప‌రిస్థితుల్లో వ్యాపార‌వేత్త‌లు ఉన్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఇటీవ‌ల హెచ్ఎండీఏ వేసిన ఓపెన్ ప్లాట్ల వేలంకు టెండ‌ర్ వేయ‌డానికి కూడా కొన్ని ప్రాంతాల్లో ఔత్సాహికులు ఇటీవ‌ల ముందుకురాలేదు. అలాంటి ప‌రిస్థితి నుంచి అధిగ‌మించ‌డానికి కోకాపేట భూముల‌ను వేలం వేసి కృత్రిమ డిమాండ్ ను కేసీఆర్ స‌ర్కార్ క్రియేట్ (KCR Kokapeta) చేసింద‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.

Also Read : KCR Powder : BRS,BJP సూత్రం ఇంచుమించు ఒక‌టే..!

ఎన్నిక‌ల వేళ నిధుల స‌మీక‌ర‌ణ తెలంగాణ స‌ర్కార్ కు క‌త్తిమీద సాముగా మారింది. ఆ క్ర‌మంలో భూముల వేలం మిన‌హా మ‌రో మార్గం లేదు. అందుకే, భూముల‌ను వేలం వేస్తూ కృత్రిమ డిమాండ్ ను క్రియేట్ చేసింద‌ని రియ‌ల్ ఎస్టేట్ నిపుణులు కొంద‌రు భావిస్తున్నారు. ఇదే త‌ర‌హా ప‌ద్ద‌తిని ప్ర‌భుత్వం అమ‌లు చేస్తే రాబోవు రోజుల్లో వ్యాపారులు, వినియోగ‌దారులు భారీగా న‌ష్ట‌పోతార‌ని ఆర్థిక నిపుణుల అంచ‌నా. హెచ్ఎండీఏ కోకాపేట నియోపోలిస్ లే-అవుట్‌లోని ప్లాట్ నెంబర్ 6, 7, 8, 9లోని భూములను గురువారం వేలం వేసింది. ఆ భూముల ధ‌ర‌  (KCR Kokapeta) అత్యధికంగా ఎకరం రూ.72 కోట్లు, అత్యల్పంగా రూ.51 కోట్లు పలక‌డం విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కోంటోంది.

Also Read : KCR & Etela: బీజేపీ బిగ్ స్కెచ్, కేసీఆర్ పై ఈటల పోటీ?

ఈ వేలం ద్వారా తొలి విడతగా హెచ్ఎండీఏకు రూ.1,533 కోట్ల ఆదాయం సమకూరింది. సగటున గజం భూమి ధర రూ.1.5 లక్షలు పలికింద‌ని కృత్రిమ డిమాండ్ ను క్రియేట్ చేసిందని వ్యాపారుల అభిప్రాయం. మొత్తం 45.33 ఎకరాల్లో ఉన్న ఏడు ప్లాట్‌లతో రూ.2,500 కోట్ల వరకు సమీకరించాలని హెచ్ఎండీఏ భావిస్తోంది. ప్రభుత్వం కనీస ధరను ఎకరానికి రూ.35 కోట్లుగా నిర్ణయించ‌గా అనూహ్యంగా ధ‌ర‌లు ప‌ల‌క‌డం వెనుక బినామీల టెండ‌ర్ల భాగోతం ఉంద‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. చుట్టు ప‌క్క‌ల ఉండే ప్రైవేటు వెంచ‌ర్ల ధ‌ర‌ల‌ను పెంచుకోవ‌డానికి ప్ర‌భుత్వ భూముల ధ‌ర‌ల‌ను కృత్రిమంగా (KCR Real Politics) పెంచుకోవ‌డానికి బినామీ ద్వారా టెండ‌ర్ల‌ను వేయించార‌ని టాక్‌. అందుకే, ఆ ధ‌ర‌లు ప‌లికాయ‌ని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. భూముల ధ‌ర‌ల‌ను అత్య‌ధికంగా ప‌ల‌క‌డాన్ని కూడా కేసీఆర్ రాజ‌కీయంగా ఎన్నిక‌ల్లో ఉప‌యోగించుకుంటార‌ని చెబుతున్నారు. ప‌క్కా రియ‌ల్ ఎస్టేట్ చేస్తోన్న కేసీఆర్ ఎన్నిక‌ల అస్త్రంగా దాన్నే తీసుకున్నార‌ని కాంగ్రెస్ విమ‌ర్శిస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో విద్యుత్, నీళ్ల‌ను చూపించ‌డం ద్వారా ఓట్ల‌ను దండుకున్న కేసీఆర్ విచిత్రంగా ఈసారి రియ‌ల్ ఎస్టేట్ ధ‌ర‌ల‌ను చూపించ‌డం ఎన్నిక‌ల్లో స‌రికొత్త ఎత్తుగ‌డ‌గా క‌నిపిస్తోంది.