Site icon HashtagU Telugu

Delhi Liqour Scam: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో మరో సంచలనం: కేసీఆర్ పాత్ర కూడా

Delhi Liqour Scam

Delhi Liqour Scam

Delhi Liqour Scam:దేశాన్ని ఓ ఊపు ఊపేస్తున్న ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాములో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో ఢిల్లీ అధికార పార్టీకి చెందిన పలువురు నేతలు అరెస్ట్ అయి తీహార్ జైలులో రిమాండ్ లో ఉన్నారు. ఢిల్లీ మాజీ విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా ఇప్పటికే జైలు జీవితాన్ని గడుపుతుండగా తాజాగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సైతం అరెస్ట్ అయి సీబీఐ కస్టడీలో ఉన్నారు. ఇక ఈ కేసుతో సంబంధం ఉన్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుమార్తె కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయ్యారు. సౌత్ గ్రూప్ లో ఆమె పాత్ర కీలకంగా అనుమానించిన ఈడీ ఆమెను అదుపులోకి తీసుకుంది. ఇదిలా ఉండగా ఈ కేసులో కేసీఆర్ పాత్ర కూడా ఉన్నట్లు సంచలన విషయాలు బయటకొచ్చాయి.

ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టింది. సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన అనంతరం గత ప్రభుత్వ లొసుగులను బయటకు తీసే ప్రయత్నంలో భాగంగా ఫోన్ ట్యాపింగ్ అంశం తెరపైకి వచ్చింది. ఈ కేసులోనూ కేసీఆర్ కీలకమని ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఈ కేసు టేబుల్ పై ఉండగానే కేసీఆర్ లిక్కర్ కేసులో పాత్ర పోషించినట్లు ఈడీ విశ్వసిస్తుంది. ఇంతకీ కేసీఆర్ పై ఈడీ చేసిన కామెంట్స్ ని ఒకసారి గమనిస్తే..

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో మరో సంచలనం

* ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో కేసీఆర్‌ పాత్రను ఈడీ వివరించింది.
* లిక్కర్‌ స్కామ్‌ గురించి కేసీఆర్‌కు ముందే తెలుసని ఈడీ సంచలన ఆరోపణలు చేసింది
* ఢిల్లీ హైకోర్టులో ఈడీ వాదనల సందర్భంగా ఈ తరహా వ్యాఖ్యలు చేసింది
* మద్యం విధానం, రిటైల్‌ వ్యాపారం గురించి తండ్రి కేసీఆర్‌కు కవిత ముందే చెప్పినట్లుగా ఈడీ వెల్లడించింది.
* ఢిల్లీలోని కేసీఆర్‌ అధికారిక నివాసంలోనే.. తన టీం సభ్యులను కవిత పరిచయం చేశారని తెలిపారు ఈడీ అధికారులు
* మద్యం వ్యాపార వివరాలను కేసీఆర్‌ అడిగి తెలుసుకున్నారని ఈడీ పేర్కొంది.

Also Read: Mobile Phone : మొబైల్ ను ఎండాకాలంలో ఎలా వాడాలో తెలుసా?