KCR Kit : కేసీఆర్ ‘కిట్’ సూపర్ ‘హిట్’.. తెలంగాణ‌లో త‌గ్గిన శిశు మ‌ర‌ణాలు!

ఏడు సంవత్స‌రాలుగా శిశు మ‌ర‌ణాల‌ను తగ్గించ‌డంలో తెలంగాణ ప్రభుత్వం విజ‌యం సాధించింది. తాజాగా వెలువ‌డిన నివేదిక ప్ర‌కారం శిశు మ‌ర‌ణాల రేటు 23 వ‌ర‌కు తగ్గించ‌గ‌లిగింది. జాతీయ స‌గ‌టు శిశు మ‌ర‌ణాల సంఖ్య కంటే త‌క్కువ‌గా తీసుకురావ‌డంలో కేసీఆర్ ప్ర‌భుత్వం స‌క్సెస్ అయింది.

  • Written By:
  • Updated On - October 29, 2021 / 05:37 PM IST

ఏడు సంవత్స‌రాలుగా శిశు మ‌ర‌ణాల‌ను తగ్గించ‌డంలో తెలంగాణ ప్రభుత్వం విజ‌యం సాధించింది. తాజాగా వెలువ‌డిన నివేదిక ప్ర‌కారం శిశు మ‌ర‌ణాల రేటు 23 వ‌ర‌కు తగ్గించ‌గ‌లిగింది. జాతీయ స‌గ‌టు శిశు మ‌ర‌ణాల సంఖ్య కంటే త‌క్కువ‌గా తీసుకురావ‌డంలో కేసీఆర్ ప్ర‌భుత్వం స‌క్సెస్ అయింది. దేశ వ్యాప్తంగా ప్ర‌తి వెయ్యి మందిలో 30 మంది శిశువుల చ‌నిపోతున్నారు. గ‌త రెండేళ్ల స‌గ‌టును తీసుకుంటే జాతీయ స్థాయిలో ప్ర‌తి 1000 మంది పిల్ల‌ల జ‌న‌నాల్లో 32 మ‌ర‌ణాలు ఉండేవి. తాజాగా నివేదిక‌లో జాతీయ స‌గ‌టు శిశు మ‌ర‌ణాలు 30 ఉంటే తెలంగాణ రాష్ట్రం 23కు తీసుకురావ‌డానికి ప్ర‌భుత్వం అనేక చ‌ర్య‌లు చేప‌ట్టింది.

ప్ర‌ధానంగా కేసీఆర్ కిట్ శిశు మ‌ర‌ణాల‌ను త‌గ్గించ గ‌లిగింది. ప్ర‌సూతి కేంద్రాల సంఖ్య‌ను పెంచ‌డంతో పాటు ఆధునీక‌రించ‌డం ద్వారా మ‌ర‌ణాల సంఖ్య‌ను పెద్దఎత్తున నివారించింది. కేసీఆర్ కిట్ తో పాటు ఆర్థిక స‌హాయం అందించ‌డం ద్వారా త‌ల్లి, బిడ్డ‌ల ఆరోగ్యం బాగుంటుంద‌ని వైద్యులు చెబుతున్నారు. 2017 జులైలో ఈ ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టిన త‌రువాత ప్ర‌భుత్వ ప్రసూత ఆస్పత్రుల్లో కాన్పులు 30శాతం వ‌ర‌కు పెరిగాయ‌ని అంచ‌నా. కేసీఆర్ కిట్ లెక్క‌ల ప్ర‌కారం 2017లో 23లక్ష‌ల 73వేల 92 మంది కాన్పు అయితే, కేవ‌లం 13లక్ష‌ల 15వేలా 924 మాత్ర‌మే ప్రైవేటు ఆస్ప‌త్రికి చెందిన‌వి. 10ల‌క్ష‌ల 57వేల 168 హెల్త్ కేర్ వ‌స‌తుల ద్వారా ప్ర‌భుత్వం కాన్పులు చేయించింది.
ఇటీవ‌ల తొమ్మిది ఎంసీహెచ్ సెంట‌ర్లను ఒక్క‌దాన్ని 50 బెడ్ల‌తో 90కోట్ల‌తో ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌డంతో పాటు నీలోఫ‌ర్ ఆస్ప‌త్రిని 500 నుంచి 1000 బెడ్ల‌కు పెంచేలా ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది. ఇంటిన్సివ్ కేర్ యూనిట్ల‌ను 30కోట్ల‌తో ఏర్పాటు చేయ‌డంతో పాటు గాంధీ ఆస్ప‌త్రిలో ప్ర‌త్యేక వార్డుల‌ను కాన్పుల కోసం ఏర్పాటు చేశారు. ఫ‌లితంగా మాతా, శిశు మ‌ర‌ణాల సంఖ్య‌ను పెద్ద సంఖ్య‌లో తెలంగాణ ప్ర‌భుత్వం త‌గ్గించ క‌లిగింది.