KCR Khammam : విభేదాల‌కు కేరాఫ్ గా కేసీఆర్ ఖ‌మ్మం స‌భ‌

రాజకీయాలకు కేంద్ర బిందువుగా (KCR Khammam)ఖమ్మం జిల్లా మారిపోయింది.

  • Written By:
  • Publish Date - January 16, 2023 / 12:37 PM IST

తెలంగాణ రాజకీయాలకు కేంద్ర బిందువుగా (KCR Khammam) ఉమ్మడి ఖమ్మం జిల్లా మారిపోయింది. పూర్వ వైభ‌వం కోసం చంద్రబాబు ఖ‌మ్మం బ‌హిరంగ స‌భ వేదిక‌గా `ఖమ్మం నా గుమ్మం` అంటూ సంచలనం వ్యాఖ్య‌లు చేశారు. మరో వైపు బీజేపీ(BJP) సైతం ఇక్కడి కీలక నేతలను తమ వైపు ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇంకో వైపు బీఆర్ఎస్ అంతర్గత కుమ్ము లాటలు(KCR Khammam) రోజుకో విధంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి కంచుకోట‌గా ఉండే ఆ జిల్లాలో ఆ పార్టీకి అండ‌గా నిల‌బ‌డే లీడ‌ర్లు క‌రువ‌య్యారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన బీజేపీ(BJP) ఉమ్మడి ఖమ్మం జిల్లాపై దృష్టి సారించింది. గత ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎసీకు ఎదురు గాలి వేచింది. ఈ నేపథ్యంలో ఖమ్మం పాలిటిక్స్ లో అసలేం జరుగుతోందనే ఉత్కంఠ నెలకొంది.

బీఆర్ఎస్ అంతర్గత కుమ్ము లాటలు(KCR Khammam)

తెలంగాణ ఉద్య‌మ‌కారుడుగా ఉన్న‌ప్పుటి నుంచి కేసీఆర్ ఖ‌మ్మం జిల్లా ఒక సవాల్‌. ఆయ‌న వెంట ఎప్పుడూ ఆ జిల్లా న‌డ‌వ‌లేదు. గ‌త ఎన్నిక‌ల్లోనూ టీఆర్ఎస్ పార్టీ అక్క‌డ నుంచి ఏ మాత్రం ప్రాబ‌ల్యం చూప‌లేదు. అలాంటి జిల్లా నుంచి టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారిన పార్టీని బ‌లోపేతం చేసుకోవ‌డానికి కేసీఆర్ చేస్తోన్న సాహ‌సం చ‌ర్చ‌నీయాంశం అయింది. ఆయ‌న ఈనెల 18వ తేదీన బ‌హిరంగ స‌భ‌ను సూప‌ర్ హిట్ చేయ‌డానికి స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతున్నారు. అదే స‌మ‌యంలో బీఆర్ఎస్ కీల‌క నేత‌ల పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీజేపీ గూటికి చేర‌బోతున్నారు. ఆయ‌న త‌ర‌హాలోనే బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్ప‌డానికి సిద్ద‌మ‌వుతోన్న త‌మ్మ‌ల నాగేశ్వ‌ర‌రావును బుజ్జ‌గించ‌డం ద్వారా భారీ న‌ష్ట నివార‌ణ నుంచి బ‌య‌ట‌ప‌డాల‌ని కేసీఆర్ ప్ర‌య‌త్నిస్తున్నారు. ప్ర‌స్తుతానికి తాత్కాలికంగా త‌మ్మల వేగాన్ని కేసీఆర్‌ ఆప‌గ‌లిగారని తెలుస్తోంది.

పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీజేపీ గూటికి

ఖ‌మ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం సీటును త‌మ్మల నాగేశ్వ‌ర‌రావు ఇచ్చేందుకు కేసీఆర్ అంగీక‌రించారని తెలుస్తోంది. అక్క‌డ నుంచి పోటీకి గ్రీన్ సిగ్న‌ల్ బీఆర్ఎస్ నుంచి రావ‌డంతో ఆయ‌న చ‌ల్ల‌బ‌డ్డార‌ని స‌మాచారం. అయితే, అక్క‌డ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఉపేంద్ర‌రెడ్డి గుర్రుగా ఉన్నార‌ట‌. ఆయ‌న గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. ఆ త‌రువాత టీఆర్ఎస్ పంచ‌న చేరారు. సిట్టింగ్ ల‌కు మ‌ళ్లీ టిక్కెట్ ఇస్తాన‌ని ఇటీవ‌ల కేసీఆర్ వెల్ల‌డించారు. దీంతో ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను త‌మ్మల అన్వేషించుకున్నారు. బీజేపీ వైపు వెళ‌తార‌ని కొన్ని రోజులు టాక్ న‌డిచింది. అయితే, ఇటీవ‌ల తెలుగుదేశం పార్టీ బ‌లం పుంజుకుంటోంద‌ని ఖ‌మ్మం చంద్ర‌బాబు స‌భ నిరూపించింది. తిరిగి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు టీడీపీలో చేర‌తార‌ని కూడా ప్ర‌చారం ఉంది. బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్ప‌డం మాత్రం ఖాయ‌మ‌ని ఆయ‌న అనుచ‌రులు ఫిక్స్ అయ్యారు. దీంతో కేసీఆర్ రంగంలోకి దిగి ఈనెల 18వ తేదీ బ‌హిరంగ స‌భ మీద పొంగులేటి, త‌మ్మల ప్ర‌భావం లేకుండా జాగ్ర‌త్త‌ప‌డుతున్నారు.

Also Read : Khammam Politics: బీజేపీలోకి ‘పొంగులేటి’.. బీఆర్ఎస్ కు గుడ్ బై!

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ నేతల వైఖరిపై పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆయన పార్టీ మారేందుకు సిద్ధమైనట్టు టాక్ వినిపిస్తోంది. ఈ మేరకు ఆయన బీజేపీ టచ్ ఉన్నారని ఈనెల 18న సీఎం కేసీఆర్ ఖమ్మంలో సభ నిర్వహిస్తుందగానే అదే రోజున పొంగులేటి అమిత్ షాతో భేటీ కాబోతున్నారనే ప్రచారం రాజకీయాలను మరింత హీటెక్కిస్తోంది. ఇటీవల పొంగులేటి చేస్తున్న వరుస కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో తన అనుచరులంతా పోటీ చేస్తారని, అలాగే తనకు పదవులు లేకున్నా ప్రజల ఆశీస్సులు ఉన్నాయని ఆయన చేసిన కామెంట్స్ ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో సంచ‌ల‌నం రేపాయి.

Also Read : Khammam : చంద్ర‌బాబు ఖ‌మ్మం స‌భ ! తెలంగాణలో ప్ర‌కంప‌న‌లు!

పొంగులేటి బీజేపీ వైపు చూస్తున్నారనే ప్రచారం నేపథ్యంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేరు తెరపైకి వస్తోంది. ఇటీవల ఆయన తన అనుచరులతో ఆత్మీయ సమ్మే ళనాలు నిర్వహించడం హాట్ టాపిక్ అయింది. టీడీపీ నేతల సభలకు హాజరు కావడం చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో పొంగులేటి పొలిటికల్ గా బిగ్ డెసిషన్ తీసుకుంటే.. అదే బాటలో తుమ్మల ప్రయాణిస్తారా? లేక బీఆర్ఎస్లోనే కొనసాగుతారా అనేది ఆసక్తిగా మారింది. అయితే ఈనెల 18న గులాబీ బాస్ ఖమ్మం జిల్లాలో పర్యటించబోతున్నారు. ఈ పర్యటనలో కేసీఆర్ సభకు హాజరు ఆధారంగా నేతల వైఖరిపై ఒక నిర్థార‌ణ‌కు రావ‌చ్చు.