KCR Khammam:గ్రూప్ ల‌కు చెక్!కూక‌ట్ ప‌ల్లికి పువ్వాడ‌,ఖ‌మ్మం బాస్ గా తుమ్మ‌ల‌?

ఖ‌మ్మం వేదిక‌గా బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ (KCR Khammam) చేసిన ఆప‌రేష‌న్ ఫ‌లప్ర‌దం అయింది.

  • Written By:
  • Publish Date - January 17, 2023 / 12:13 PM IST

ఖ‌మ్మం వేదిక‌గా బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ (KCR Khammam) చేసిన మెరుపు ఆప‌రేష‌న్ ఫ‌లప్ర‌దం అయింది. మాజీ మంత్రి త‌మ్మల నాగేశ్వ‌ర‌రావు ప‌క్క‌చూపులు చూడ‌కుండా ఆప‌గ‌లిగారు. ఫ‌లితంగా బీఆర్ఎస్ స‌భ ను జాతీయ స్థాయిలో చ‌ర్చ జ‌రిగేలా నిర్వ‌హించాల‌ని త‌మ్మల న‌డుంబిగించారు. ఆ క్ర‌మంలో మంత్రి పువ్వాడ అజ‌య్ (puvvada ) నుంచి ఖ‌మ్మం జారిపోతుంద‌న్న టాక్ బ‌లోపేతం అయింది. రాబోవు ఎన్నిక‌ల్లో కూక‌ట్ ప‌ల్లి నుంచి పువ్వాడ పోటీ చేస్తార‌ని ప్ర‌చారం మొద‌లైయింది. ఇక తుమ్మల‌కు పూర్తి స్థాయి ఖ‌మ్మం బాధ్య‌త‌ల‌ను బీఆర్ఎస్ అప్ప‌గిస్తుంద‌ని వినికిడి. అందుకే, ఈనెల 18న జ‌రిగే స‌భ‌ను సూప‌ర్ హిట్ చేసేందుకు త‌మ్మల వ‌ర్గం పూనుకుంద‌ని తెలుస్తోంది.

ఖ‌మ్మం వేదిక‌గా బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ (KCR Khammam)

ప్ర‌స్తుతం పువ్వాడ అజ‌య్ మంత్రిగా ఉన్నారు. క‌మ్యూనిస్ట్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. తొలుత వైసీపీ సెంట్ర‌ల్ క‌మిటీ మెంబ‌ర్ గా రాజ‌కీయ ప్ర‌యాణాన్ని ప్రారంభించారు. ఆ త‌రువాత రాష్ట్ర విడిపోయిన 2014 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. గ‌త ఎన్నిక‌ల్లో (2019 ) టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొంద‌డ‌మే కాకుండా మంత్రి అయ్యారు. తొలి రోజుల్లో క‌మ్యూనిస్ట్ , న‌క్స‌ల్స్ సిద్ధంతాన్నే వినిపించిన కేసీఆర్ వైపు మొగ్గు చూప‌డానికి కార‌ణం. పాలేరు నుంచి పోటీ చేసిన తుమ్మ‌ల ఓడిపోవ‌డంతో పువ్వాడ‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్కింది. అప్ప‌టి నుంచి తుమ్మ‌ల‌, పువ్వాడ గ్రూపుల మ‌ధ్య ప్ర‌చ్ఛ‌న్న‌యుద్ధం కొన‌సాగుతోంది. మ‌రో వైపు పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి గ్రూపు బీఆర్ఎస్ కు త‌ల‌నొప్పిగా మారింది.

Also Read : KCR Khammam : విభేదాల‌కు కేరాఫ్ గా కేసీఆర్ ఖ‌మ్మం స‌భ‌

ఖ‌మ్మం వేదిక‌గా బ‌హిరంగ స‌భ జ‌రుగుతోన్న బుధ‌వారం రోజే పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి బీజేపీలోకి వెళుతున్నారు. దీంతో ఒక గ్రూప్ బెడ‌ద బీఆర్ఎస్ పార్టీకి త‌ప్పింది. ఇక తుమ్మ‌ల‌, పువ్వాడ గ్రూపులు ఖ‌మ్మం జిల్లా వ్యాప్తంగా అంత‌ర్గ‌తంగా పోటీపడుతున్నాయి. ఖ‌మ్మం ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావు ఉన్న‌ప్ప‌టికీ పెద్ద‌గా ఆయ‌న ప్ర‌భావం ఉండ‌దు. గ్రూపు విభేదాలకు శాశ్వ‌త స్వ‌స్తి ప‌ల‌క‌డానికి బీఆర్ఎస్ అధిష్టానం వ్యూహాన్ని ర‌చించింది. దాని ప్ర‌కారం రాబోవు రోజుల్లో పువ్వాడ‌ను గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలోని కూక‌ట్ ప‌ల్లి నుంచి పోటీ చేయించాల‌ని భావిస్తున్నార‌ట‌. అటు గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఇటు ఖ‌మ్మం జిల్లాల‌పై బీఆర్ఎస్ ప‌ట్టు సాధించ‌డానికి అవ‌కాశం ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. కానీ, పువ్వాడ మాత్రం ఖ‌మ్మం విడిచి రావ‌డానికి అయిష్టంగా ఉన్నారు. అంతేకాదు, కూక‌ట్ ప‌ల్లి విష‌యం ఆయ‌న వ‌ద్ద ప్ర‌స్తావిస్తే, ఆ మాట అనే వాళ్ల కూక‌టివేళ్లను కూల్చుతానంటూ వార్నింగ్ ఇస్తున్నారు.

కూక‌ట్ ప‌ల్లి నుంచి పువ్వాడ పోటీ చేస్తార‌ని… 

రాబోవు ఎన్నిక‌ల్లో బ‌ల‌మైన క‌మ్మ సామాజిక‌వ‌ర్గం మ‌ద్ధ‌తు కావాల‌ని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్( KCR Khammam) కోరుకుంటున్నారు. అందుకే, ఇటీవ‌ల ఎన్టీఆర్ జ‌యంతి సంద‌ర్భంగా ఆ పార్టీ లీడ‌ర్లంద‌రూ ఎన్టీఆర్ ఘాట్ వ‌ద్ద క్యూ క‌ట్టారు. గ్రేట‌ర్ ప‌రిధిలోని 25 నియోజ‌క‌వ‌ర్గాల‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా క‌మ్మ సామాజిక‌వ‌ర్గం మ‌రో 20 చోట్ల డిసైడ్ ఫ్యాక్ట‌ర్ గా ఉంద‌ని కేసీఆర్ అంచ‌నా వేస్తున్నార‌ట‌. అందుకే, ఖ‌మ్మం జిల్లాతో పాటు గ్రేట‌ర్ ప్రాంతాన్ని ఆ సామాజిక‌వ‌ర్గం లీడ‌ర్ల‌ను ఫోక‌స్ చేస్తున్నారు. ఆ క్ర‌మంలో తుమ్మ‌ల, నామాకు పూర్తిగా ఖ‌మ్మం బాధ్య‌త‌ల‌ను అప్పగించాల‌ని భావిస్తున్నారు. గ్రేట‌ర్ హైద‌రాబాద్ లోని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌తో పాటు కూక‌ట్ ప‌ల్లి త‌దిత‌ర నియోజ‌క‌వ‌ర్గాల‌ను పువ్వాడ చేతుల్లో ఉంచ‌డానికి ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఖ‌మ్మం బీఆర్ఎస్ జ‌రుగుతోన్న వేళ ఆ జిల్లాలోని బీఆర్ఎస్ గ్రూప్ రాజ‌కీయాల‌కు శాశ్వ‌తంగా తెర‌వేసే ప్ర‌క్రియ కొన‌సాగుతోంది.

Also REad Ro Khanna Profile: అమెరికా అధ్యక్ష బరిలో భారత సంతతి వ్యక్తి.. ఎవరీ రో ఖన్నా..?

ప్ర‌స్తుతం కేసీఆర్ ఖ‌మ్మం స‌భ‌ను సూప‌ర్ హిట్ చేయ‌డానికి తుమ్మ‌ల‌, పువ్వాడ గ్రూప్ లు పోటీప‌డి ప‌నిచేస్తున్నాయ‌ని తెలుస్తోంది. బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న కూడా ఆ స‌భా ప్రాంగ‌ణం వ‌ద్ద క‌నిపిస్తుంద‌ని బుధ‌వారం క‌నిపిస్తుంద‌ని ఆ రెండు గ్రూప్ ల క్యాడ‌ర్ భావిస్తోంది. స్థానిక ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావు మాత్రం సైలెంట్ గా ఉన్నారు. ఇటీవ‌ల ఆయ‌న కంపెనీల మీద
ఐటీ దాడులు జ‌రిగిన విష‌యం విదిత‌మే. అప్ప‌టి నుంచి ఆయ‌న బీఆర్ఎస్ రాజ‌కీయాలకు అంటీముట్ట‌న‌ట్టు ఉంటున్నారు. ఈనెల 18వ తేదీ పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి బీజేపీలో చేరిన త‌రువాత నామా మీద బీజేపీ ఆప‌రేష‌న్ ఉంటుంద‌ని తెలుస్తోంది. అంటే, నామా, పొంగులేటి బీజేపీలోనూ, పువ్వాడ‌, తుమ్మ‌ల బీఆర్ఎస్ పార్టీకి రాబోవు రోజుల్లో ప్రాతినిధ్యం వహించే అవ‌కాశం ఉంద‌ని స్థానిక రాజ‌కీయాల్లోని టాక్‌.

భార‌త రాష్ట్ర స‌మితి తొలి స‌భ

భార‌త రాష్ట్ర స‌మితి తొలి స‌భ ను విజ‌య‌వంతం చేయ‌డానికి గులాబీ శ్రేణులు శ్ర‌మ‌డోడ్చుతున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన చంద్ర‌బాబు స‌భ కంటే మిన్న‌గా నిర్వ‌హించాల‌ని గులాబీ బాస్ ఆదేశించార‌ట‌. అందుకే, ఈ నెల 18న ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ యావత్ దేశం దృష్టిని ఆకర్షించేలా సభను నిర్వహించాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. సభకు ఇతర రాష్ట్రాలకు చెందిన నలుగురు సీఎంలు, మాజీ ముఖ్యమంత్రులు కూడా ఆహ్వానం వెళ్లింది. మ‌రో 24 గంట‌ల్లో ప్రారంభం కానున్న ఖమ్మం స‌భ కోసం నగరం పార్టీ హోర్డింగులు, కటౌట్లతో గులాబీమయమయింది. 100 ఎకరాల్లో సభ, 400 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. 15 వేల మంది వీఐపీలకు ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా వారికి కేటాయించిన స్థలంలో పార్కింగ్ చేసేలా డ్రైవర్లకు క్యూఆర్ కోడ్ ఇస్తున్నారు. వీఐపీల కోసం సభా వేదిక ముందు 20 వేల కుర్చీలను ఏర్పాటు చేయనున్నారు. 3 లక్షల మంది పార్టీ కార్యకర్తలు సభకు హాజరుకాబోతున్నార‌ని అంచ‌నా వేస్తున్నారు.