Site icon HashtagU Telugu

KCR : ఆగం కాకండి ప్రజలారా.. మళ్లీ రానున్నది మన ప్రభుత్వమే – కేసీఆర్

Kcr Bharosa

Kcr Bharosa

గత కొద్దీ నెలలుగా కేసీఆర్ (KCR) మీడియా ముందుకు రాకపోవడం..రాష్ట్రం (Telangana) అల్లకల్లోలం అవుతున్న స్పందించకపోయేసరికి ప్రజలంతా కేసీఆర్ ఏమైపోయాడు..? ప్రజలు బాధపడుతుంటే కనిపించడే…? ప్రజల మీద ఆయన కోపం మీద ఉన్నాడా..? ప్రజలు తమ తప్పును తెలుసుకునే వరకు బయటకు రాకూడదని సైలెంట్ అయ్యాడా..? కాంగ్రెస్ ఇంకెత చేస్తుందో చూద్దాం..? అని చూసుకుంటూ ఉన్నాడా..? ఇలా అనేక విధాలుగా రాష్ట్ర ప్రజలు మాట్లాడుకుంటూ వస్తున్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనను కాదని..కాంగ్రెస్ (Congress) ఏదో మేలు చేస్తుందని ప్రజలంతా ఓట్లు వేసి గెలిస్తే..ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరకపోగా..గత ప్రభుత్వం అందించిన పథకాలు పోయాయి..దీంతో ప్రజలు కేసీఆర్ ను ఓడించి ఎంత తప్పు చేసాం పో..అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.

రాష్ట్రం రోజు రోజుకు వెనక్కు పోతుంటే చూస్తూ ఉండలేక ఈరోజు కేసీఆర్ మీడియా ముందు వచ్చి ప్రజల్లో సంతోషం నింపారు. మళ్లీ బీఆర్ఎస్‌ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ..వచ్చే ఎన్నికల్లో 100 శాతం విజయం మనదే అని ధీమా వ్యక్తం చేసి ప్రజల్లో ఆనందం నింపారు. శనివారం పాలకుర్తి నియోజకవర్గ నేతలతో సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లిలోని తన నివాసంలో కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. ఏం కోల్పోయారో ప్రజలకు అర్థమైందని, ఇక మనం కష్టపడితే సరిపోతుందని..వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ కు తిరుగులేదని..ఈరోజు ఓడించిన ప్రజలే..రేపు 100 సీట్లు ఇచ్చి గెలిపిస్తారని భరోసా ఇచ్చారు.

సమాజాన్ని నిలబెట్టి నిర్మాణం చేయాలని.. అంతేతప్ప కూలగొడతామంటూ పిచ్చిగా మాట్లాడొద్దని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. అధికారం ఇచ్చింది కూల్చడానికి కాదు.. నిర్మించడానికి అని తెలిపారు. మాకు మాటలు రావనుకుంటున్నారా.. ఈరోజు మొదలపెడితే రేపటి వరకు మాట్లాడతానని , రౌడీ పంచాయితీలు చేయడం తమకు కూడా తెలుసని అన్నారు. ప్రజలను కాపాడాల్సింది పోయి.. భయపెడతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు మీకు బాధ్యతను అప్పగించారు.. బాధ్యతాయుతంగా సేవ చేయాలని సూచించారు. బీఆర్‌ఎస్‌ నేతలెవరూ భయపడవద్దని.. మళ్లీ మన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని , వచ్చే ఎన్నికల్లో 100 శాతం మనదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.

Read Also : SUV Sales: ప్ర‌ముఖ కారుకు దూరంగా ఉంటున్న వాహ‌నదారులు.. స‌గానికి సగం ప‌డిపోయిన అమ్మ‌కాలు!