Site icon HashtagU Telugu

KCR : కేసుకు కేసు-అరెస్ట్ కు అరెస్ట్! సింహ‌స్వ‌ప్నంలా కేసీఆర్ !!

KCR

The Child Of India.. Will Always Come To Maharashtra.. Kcr

కొన్ని ద‌శాబ్దాల పాటు (KCR)ప్రాంతీయ పార్టీల హ‌వా కొన‌సాగింది. సంకీర్ణ శ‌కం వ‌చ్చిన త‌రువాత వాటికి ప్రాబ‌ల్యం పెరుగుతూనే ఉంది. గ‌త మూడు ద‌శాబ్దాలుగా ఎన్డీయే, యూపీఏ సంకీర్ణాలను( coalition government) చూశాం. అంత‌కంటే ముందు నేష‌న‌ల్ ఫ్రంట్ సంకీర్ణం స్వ‌ల్ప కాలం న‌డిచింది. గ‌త ఐదేళ్లుగా బీజేపీ బ‌లప‌డింది. ఏక పార్టీ పాల‌న దిశ‌గా రాజ‌కీయాల‌ను తీసుకెళుతోంది. ప్రాంతీయ పార్టీలు జాతీయ‌తావాదాన్ని బ‌ల‌హీన‌ప‌రుస్తుయ‌న్న అభిప్రాయాన్ని బీజేపీ క‌లిగి ఉంది. అంతేకాదు, ప్రాంతీయ పార్టీల కార‌ణంగా అభివృద్ధి కుంటుప‌డుతుంద‌ని విశ్వసిస్తోంది.

ద‌శాబ్దాల పాటు ప్రాంతీయ పార్టీల హ‌వా(KCR) 

గ‌త ఐదేళ్లుగా ప్రాంతీయ పార్టీల మీద విరుచుకుపడుతూ రాజ‌కీయంగా బీజేపీ ఎదుగుతోంది. అందుకేనేమో, టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చేసిన కేసీఆర్(KCR) జాతీయ‌వాదాన్ని వినిపిస్తున్నారు. రాజ‌కీయంగా ప్ర‌మాద‌క‌రంగా భావించే మోడీ, షా ద్వ‌యంతో పెట్టుకున్నారు. దేశ ప్ర‌యోజ‌నాల కోసం గోకుతూనే ఉంటానంటూ ప‌రోక్షంగా వాళ్ల‌కు వార్నింగ్ ఇచ్చారు. ఆయ‌న ధైర్యం ఏమిటో ఇప్ప‌టికైతే అర్థం కావ‌డంలేదుగానీ, దేశ వ్యాప్తంగా ఇప్పుడున్న బీజేపీని ఢీ కొట్ట‌గ‌ల లీడ‌ర్ గా కేసీఆర్ క‌నిపిస్తున్నారు. అంతేకాదు, విప‌క్షాల‌న్నింటికీ ఫండింగ్ చేయ‌డానికి కూడా సిద్ధ‌మ‌యిన‌ట్టు ఆయ‌న ఇటీవ‌ల జాతీయ ఛాన‌ల్ జ‌ర్న‌లిస్ట్ రాజ్ దీప్‌ కు చెప్పార‌ట‌. ఆ విష‌యాన్ని బ‌య‌ట‌పెడుతూ ఒక వీడియోను కూడా రాజ్ దీప్ విడుద‌ల చేశారు. ఢీ అంటే ఢీ అనేలా మ‌రో తెలుగోడు ఉన్నాడ‌ని దేశ రాజ‌కీయాల‌ను (( coalition government) తన వైపు తిప్పుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు.

బీజేపీని ఢీ కొట్ట‌గ‌ల లీడ‌ర్ గా కేసీఆర్

రెండేళ్ల క్రితం వ‌ర‌కు బీజేపీతో క‌లిసిమెలిసి కేసీఆర్ (KCR) ఉన్నారు. సుమారు ఏడున్న‌రేళ్ల పాటు ఎన్డీయే తీసుకున్న ప్ర‌తి అంశానికి మ‌ద్ధ‌తు ప‌లుకుతూ వ‌చ్చారు. పార్ల‌మెంట్ బ‌య‌ట‌, లోప‌ల మోడీకి జై కొడుతూ టీఆర్ఎస్ పార్టీ న‌డిచింది. ఇచ్చిపుచ్చుకునే ధోర‌ణితో వెళ్లారు. వివాద‌స్ప‌ద‌మైన, సంచ‌ల‌నం క‌లిగించిన సీఏఏ, ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు, నోట్ల ర‌ద్దు, జీఎస్టీ త‌దిత‌రాల‌కు ప‌రోక్షంగా మ‌ద్ధ‌తు ప‌లికింది. వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు కూడా టీఆర్ఎస్ మ‌ద్ధ‌తు ప‌లుకుతూ కొన్ని రోజులు వ్య‌వ‌హారాన్ని న‌డిపింది. ఆక‌స్మాత్తుగా ముచ్చింత‌ల్ రామానుచార్యుల విగ్ర‌హం ఆవిష్క‌ర‌ణ మోడీ, కేసీఆర్ మ‌ధ్య ప్రోటోకాల్ చిచ్చు రేపింది. ఆ రోజు నుంచి ప్ర‌ధాని హోదాలో మోడీ ఎప్పుడు తెలంగాణ‌కు వ‌చ్చిన‌ప్ప‌టికీ కేసీఆర్ అధికారికంగా ఆయ‌న ఎదుట ప‌డ‌లేదు. రాజ‌కీయంగానూ వైరాన్ని పెంచుకున్నారు. ఇప్పుడు మోడీనా? నేనా? అనే స్థాయికి కేసీఆర్ వ‌చ్చారు. కార‌ణాలు ఏమైన‌ప్ప‌టికీ టిట్ ఫ‌ర్ టాట్ లాగా మోడీ, షా ద్వ‌యానికి కేసీఆర్ షాక్ ఇస్తున్నారు.

ఢిల్లీ పీఠంపై కేసీఆర్ గురి(  coalition government)

ప్రాంతీయ పార్టీల‌ను లొంగ‌దీసుకోడం లేదా వాటిని ఛిన్నాభిన్నం చేస్తూ వ‌చ్చిన మోడీ, షా ద్వ‌యం ఎత్తుల‌ను చిత్తు చేస్తూ కేసీఆర్ ఇటీవ‌ల రాజ‌కీయ పావులు క‌దుపుతున్నారు. జాతీయ వాదం బ‌లంగా వినిపిస్తూ ఢిల్లీ పీఠంపై కేసీఆర్ గురి(  coalition government) పెట్టారు. ఆ స‌మ‌యంలో కుమార్తె క‌విత ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ వ్య‌వ‌హారం రావ‌డంతో ఇక కేసీఆర్ ప‌నైపోయింద‌ని చాలా మంది భావించారు. కానీ, ఢిల్లీ లిక్క‌ర్ వ్య‌వ‌హారాన్ని ముందే గ్ర‌హించిన కేసీఆర్ ఎమ్మెల్యేల ఎర కేసుతో బీజేపీ మీద పైచేయిగా నిలిచారు. కేసుకు కేసు చెల్లు మాదిరిగా లిక్క‌ర్ స్కామ్ నుంచి క‌విత‌ను బ‌య‌ట‌ప‌డేశారు. అంతేకాదు,టీఎస్ పీఎస్ పేప‌ర్ లీక్ అంశం బీఆర్ఎస్ ను చుట్టిముట్టింది. ఆ కేసును ఈడీ టేక‌ప్ చేస్తుంద‌ని అనుమానాలు రావ‌డంతో టెన్త్ పేప‌ర్ లీక్ అంశం తెర‌మీద‌కు వ‌చ్చింది. బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజ‌య్ ను అరెస్ట్ చేయ‌డం ద్వారా మోడీ, షా ద్వ‌యానికి ప‌రోక్షంగా వార్నింగ్ ఇచ్చారు.

గోకుతూనే ఉంటానంటూ  వార్నింగ్ (KCR)

ఒక కేసు బీఆర్ఎస్ మీద ఆపాదిస్తే, ప‌ది కేసులు బీజేపీ మీద పెడ‌తామంటూ మోడీ, షా ద్వ‌యానికి సీరియ‌స్ సంకేతాలు పంపారు. అంతేకాదు, మీడియా స‌మావేశం నిర్వ‌హించి గోకుతూనే ఉంటానంటూ (KCR) వార్నింగ్ కూడా ఇచ్చారు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే బీఆర్ఎస్, బీజేపీ మ‌ధ్య సీరియ‌స్ పాలిటిక్స్ న‌డుస్తున్నాయ‌ని అర్థ‌మ‌వుతోంది. కాంగ్రెస్ పార్టీ అనుమానిస్తున్నట్టు ఆ రెండు పార్టీల మ‌ధ్య స‌ఖ్య‌త లేద‌ని క్ర‌మంగా స్ప‌ష్ట‌త వ‌స్తోంది. అంటే, జాతీయ స్థాయిలో మోడీ, షాను ఎదుర్కోవ‌డానికి కేసీఆర్ ఏ మాత్రం వెనక‌డుగు వేయ‌కుండా దూకుడుగా వెళుతున్నారు. అందుకు సంబంధించిన ప్ర‌తిబంధ‌కాల‌ను ముందుగా గుర్తించ‌డం ద్వారా బీజేపీ అగ్ర నేత‌లకు చుక్క‌లు చూపిస్తున్నారు. మిగిలిన రాష్ట్రాల్లోని లీడ‌ర్ల ను చేసిన మాదిరిగా కేసీఆర్ ను బ‌ల‌హీన‌ప‌ర‌చ‌డం బీజేపీ త‌ల‌కు మించిన భారంగా ఉంది.

Also Read : KCR: భారత బిడ్డను.. బరాబర్ మహారాష్ట్ర వస్తా

ప్రాంతీయ పార్టీల బ‌లం ఏమిటో స్వ‌ర్గీయ ఎన్టీఆర్ తొలిసారి అప్ప‌ట్లో ఉత్త‌రాది పార్టీల‌కు రుచిచూపించారు. ఇప్పుడు కేసీఆర్(KCR) ఆ త‌ర‌హా రాజ‌కీయాల‌ను న‌డుపుతూ గుజ‌రాత్ పాలిటిక్స్ ను ఎదుర్కొంటున్నారు. కేసుకు-కేసు ప‌ద్ధ‌తిని అనుస‌రిస్తున్నారు. అరెస్ట్ కు- అరెస్ట్ అనే రీతిలో దూకుడుగా వెళుతున్నారు. ఏ ధైర్యం లేకుండా గుడ్డిగా అడుగులు వేసే అస‌మ‌ర్థ లీడ‌ర్ కేసీఆర్ కాదు. ఏదో బ‌ల‌మైన పాయింట్ కేసీఆర్ వ‌ద్ద ఉంది. మోడీ, షా ద్వ‌యాన్ని లొంగ‌దీసుకునేందుకు ఆయన వ‌ద్ద ఉన్న ర‌హ‌స్యం ఏమిటో ఇప్ప‌టికైతే అంత‌చిక్క‌డంలేదు. ఆయ‌న దూకుడును చూస్తే ప్రాంతీయ పార్టీల‌ను బ‌ల‌హీన ప‌రిచే బీజేపీ వ్యూహాలు ఫ‌లించేలా క‌నిపించ‌డంలేదు.

Also Read : BJP-BRS : తెలంగాణ‌పై మోడీ షెడ్యూల్! `ఫూల్స్ వార్` హీట్‌!