KCR -Jagan Sketch : కాంగ్రెస్ కు ష‌ర్మిల `డెడ్ లైన్‌`  ఎత్తుగ‌డ ఇదే..!

KCR -Jagan Sketch :  కాంగ్రెస్ పార్టీకి ష‌ర్మిల డెడ్ లైన్ పెట్టారా? లేదా ష‌ర్మిల‌కు కాంగ్రెస్ పార్టీ ఫుల్ స్టాప్ పెట్టిందా?

  • Written By:
  • Updated On - September 26, 2023 / 04:10 PM IST

KCR -Jagan Sketch :  కాంగ్రెస్ పార్టీకి ష‌ర్మిల డెడ్ లైన్ పెట్టారా? లేదా ష‌ర్మిల‌కు కాంగ్రెస్ పార్టీ ఫుల్ స్టాప్ పెట్టిందా? అనేది ఆ పార్టీలో జ‌రుగుతోన్న పెద్ద చర్చ‌. ఈనెల 30వ తేదీలోపు ఏదోఒకటి తేల్చాస్తానంటూ ప‌రోక్షంగా కాంగ్రెస్ పార్టీకి అల్టిమేట‌మ్ పెట్టిన‌ట్టుగా క‌నిపిస్తోంది. ఆ లోపు ఆమె ఆశించిన మేర‌కు హామీలు వ‌స్తే స‌రి, లేదంటే వైఎస్సార్ తెలంగాణ పార్టీకి ప‌దును పెట్టాల‌ని ప్లాన్ బీ రెడీ చేసుకున్నారు. ఇదంతా ఒక వ్యూహంలో భాగంగా జ‌రుగుతోన్న త‌తంగంగా రాజ‌కీయాల‌ను నిశితంగా ప‌రిశీలించే వాళ్ల భావ‌న‌.

కాంగ్రెస్ ఓటు బ్యాంకును చీల్చ‌డానికి కేసీఆర్ ఎత్తుగ‌డ (KCR -Jagan Sketch)

ప్ర‌స్తుతం తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మాత్ర‌మే ప్ర‌ధానంగా కనిపిస్తున్నాయి. కానీ, వాటి గెలుపుపోట‌ముల‌పై ప్ర‌భావం చూపే బీఎస్పీ, వైఎస్సాటీపీని పెద్ద‌గా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవ‌డంలేదు. తాజా స‌ర్వేల ఆధారంగా బీఆర్ఎస్ పార్టీకి ష‌ర్మిల కార‌ణంగా న‌ష్టం జ‌రుగుతుంద‌ని గ్ర‌హించార‌ట‌. అందుకే, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ద్వారా కేసీఆర్ చ‌క్రం(KCR -Jagan Sketch) తిప్పార‌ని తెలుస్తోంది. ఫ‌లితంగా చివ‌రి నిమిషంలో కాంగ్రెస్ పార్టీలో చేర‌కుండా దూరంగా ష‌ర్మిల ఉన్నార‌ని తెలుస్తోంది.

ష‌ర్మిల పార్టీని బీఎస్పీని కూడా జోడించ‌డం

ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో బీజేపీ గ్రాఫ్ ప‌డిపోయింద‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. పోటీ కేవ‌లం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ మ‌ధ్యే ఉంటుంద‌ని అంచ‌నా. అందుకే, వీలున్నంత వ‌ర‌కు కాంగ్రెస్ ఓటు బ్యాంకును చీల్చ‌డానికి కేసీఆర్ ఎత్తుగ‌డ వేయ‌డం స‌హ‌జం. ఆ క్ర‌మంలో ష‌ర్మిల పార్టీని ప‌దిలంగా ఉండేలా ప్లాన్ చేశార‌ట‌. ఆ పార్టీకి బీఎస్పీని కూడా జోడించ‌డం ద్వారా కాంగ్రెస్ ఓటు బ్యాంకును భారీగా చీల్చ‌డానికి అవ‌కాశం ఉంద‌ని ఆయ‌న అంచ‌నాగా కారు పార్టీలోని వినికిడి. అందుకే, ఆ రెండు పార్టీల మ‌ధ్య పొత్తు కుద‌ర్చ‌డం ద్వారా ఎంపిక చేసిన నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేయించాల‌ని.(KCR -Jagan Sketch) ప్లాన్ చేస్తున్నార‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లోని చ‌ర్చ‌.

ద‌క్షిణ తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ ఎస్ పార్టీ బ‌ల‌హీనం

ప్ర‌ధానంగా ద‌క్షిణ తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ ఎస్ పార్టీ బ‌ల‌హీనంగా ఉంద‌ని స‌ర్వేల సారాంశం. ఆయా జిల్లాల్లో క్రిస్టియ‌న్ ఓటు బ్యాంకు కూడా ఆశించిన మేర‌కు ఉంది. ఆ కోణం నుంచి ఓట్ల‌ను చీల్చ‌డానికి బీఎస్పీ, వైఎస్సార్టీపీని పొత్తు వ్య‌వ‌హారం న‌డుస్తుంద‌ని ప్ర‌గ‌తిభ‌వ‌న్ వ‌ర్గాల్లోని వినికిడి. అంతేకాదే, తెలంగాణ వ్యాప్తంగా ఒక వైపు ఎంఐఎం ముస్లిం ఓట్ల‌ను చీల్చ‌డానికి ఉప‌యోగిస్తున్నారు. ఆ మేర‌కు ఇప్ప‌టికే అస‌రుద్దీన్ బీఆర్ఎస్ కు మ‌ద్ధ‌తు ప్ర‌క‌టించారు. ఇక ష‌ర్మిల కూడా అక్టోబ‌ర్ రెండో వారం నుంచి త‌న‌దైన పంథాలో కాంగ్రెస్ ఓట్ల‌ను చీల్చ‌డానికి (KCR -Jagan Sketch) రంగంలోకి దిగ‌నుంద‌ని తెలుస్తోంది. అలాంటి ఆలోచ‌న‌తోనే ఆమె ఈనెల‌ఖ‌రు నాటికి కాంగ్రెస్ పార్టీలో చేర‌డ‌మా? లేదా? అనేది తేల్చేస్తానంటూ ప్ర‌క‌టించార‌ని లోట‌స్ పాండ్ లోని వినికిడి.

Also Read : Malkajgiri BRS Candidate : మల్కాజ్ గిరి బిఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ ఎవర్ని దింపుతాడో..?

తెలంగాణ వ్యాప్తంగా రెడ్డి సామాజిక‌వ‌ర్గం ఓట్లు, టీడీపీ సానుభూతిప‌రుల‌ను స‌మీక‌రించ‌డం ద్వారా కాంగ్రెస్ ను గెలిపించాన‌లి పీసీసీ చీఫ్ రేవంత్ ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఆ క్ర‌మంలో అదే సామాజిక‌వ‌ర్గానికి చెందిన ష‌ర్మిల‌ను కాంగ్రెస్ లోకి తీసుకుంటే అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు వ‌స్తాయ‌ని ఆయ‌న ముందే గ్ర‌హించార‌ని తెలుస్తోంది. అందుకే, ఆమె చేరిక‌ను బాహాటంగా అడ్డుకున్నారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఆయ‌న్ను కాద‌ని కాంగ్రెస్ పార్టీ షర్మిల‌ను చేర్చుకోవ‌డానికి సిద్ధంగా లేదు. దీంతో ప్ర‌త్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీని ఓడించ‌డానికి కేసీఆర్ పంచ‌న ఆమె చేరుతుఉన్నార‌ని భోగ‌ట్టా. అందుకు కోసం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తాడేప‌ల్లి నుంచి చ‌క్రం తిప్పార‌ని తెలుస్తోంది.

Also Read : KCR Strategy: గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ దూకుడు.. బుజ్జగింపులు, చేరికలపై కేసీఆర్ గురి!

మొత్తం మీద కాంగ్రెస్ ఓటు బ్యాంకును పలు మార్గాల ద్వారా చీల్చ‌డానికి కేసీఆర్ ఎత్తుగ‌డ ర‌చించారు. దాన్ని అమ‌లు చేసే క్ర‌మంలో ఆక‌స్మాత్తుగా కాంగ్రెస్ పార్టీలోకి ష‌ర్మిల చేర‌డం ఆగింద‌ని తెలుస్తోంది. ఇక ఆర్ ప్ర‌వీణ్ కుమార్ బీఎస్పీ పార్టీని ఎంతో కొంత బ‌లోపేతం చేశారు.స్వారోలు క్షేత్ర‌స్థాయిలో బాగా ప‌నిచేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనైనా స‌త్తా చాటాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ఆ క్ర‌మంలో వైఎస్సాఆర్ టీపీతో పొత్తు పెట్టుకోవ‌డానికి పెద్ద‌గా అభ్యంత‌రం ఆయ‌న‌కు ఉండ‌దు. అదే, కేసీఆర్ కు కావాల్సింది కూడా. ఆ మేర‌కు ఇద్ద‌రు సీఎంలు వేసిన స్కెచ్ కూడా అదే. ఆ ఎత్తుగ‌డ య‌థాతదంగా అమ‌లతే, కాంగ్రెస్ ఓటు బ్యాంకు, ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓట్లు చెల్లాచెద‌రు కావ‌డం ఖాయం. అప్పుడు కేసీఆర్ మూడోసారి సీఎం కావ‌డం త‌థ్యం. !